On Friday, Sivakarthikeyan and Keerthy Suresh-starrer Remo had its first look and song teaser release in Hyderabad. While Anil Ravipudi unveiled the first look, Vamsi Paidipally did the honours for the song. Directed by Bakkiyaraj Kannan, the film had a grand release in Tamil and the makers have planned something on a similar grand scale for Telugu as well! The Telugu version is being released by Dil Raju under Sri Venkateswara Creations banner while RD Raja is presenting thr film under thr 24 A M Studios banner.
An entry with a bang for Sivakarthikeyan
Speaking about the film, Vamsi Paidipally said, "Remo is an example to the fact that when a good team comes together, the result is going to be likewise. I understand how tough it must have been for the director to show hero Sivakarthikeyan as a heroine! Another's music has got a recognition among the Telugu people. It's impressive how Sivakarthikeyan has not just become a name to bank on but a name the audience view for in such a short span of time. This film is definitely the kind of entry that will bring him closer to the audience's here. Here's hoping he continues his success streak in Telugu as well."
The lady getup is a delight
Anil Ravipudi expressed happiness that Sivakarthikeyan is finally debuting in Telugu and said, "So far, his films were being remade in Telugu but for the first time his film will be seen directly by our audiences. When I saw Remo, the lady getup that Sivakarthikeyan dons in the film made me wonder if it is another actress but I was surprised to know that it is him! And that's how wonderfully he played the role. I wish this film gives him the standing he has in Tamil cinema!"
A hit for sure
Dil Raju, who is releasing the film I'm Telugu said, "Recently during an outdoor schedule of Shatamanam Bhavathi, Raja Ravindra happened to show me the trailer of Remo and I liked it so much that I wanted to remake it. And I haven't made a remake so far despite having done 25 films! I saw the preview show in Tamil and really enjoyed it but was doubtful because of the language barrier. But then, I saw the film with the audiences in Vetri theatre and looking at the audiences having fun, I became sure of the decision."
He added, "It was through Mala madam that RD Raja approached me to release the film's Telugu version under my banner and I willingly agreed. I'm the past, I had seen success when Shankar had asked me to release Vaishali in Telugu and later Mani Ratmam's OK Bangaram happened. And I am thinking that as Remo is set to release now, it will give me a hat trick of hits. Sivakarthikeyan's three variations of characters in the film are amazing. PC Sreeram's cinematography and Anirudh's music are assets. It's amazing that a debut director, Bakkiyaraj Kannan, has managed a film that raked around 65-70 crore at the BO. I heartily welcome and congratulate Sivakarthikeyan who is entering Tollywood with this film."
In the words of Sivakarthikeyan
"I am really thankful to Dil Raju Garu for releasing this film in Telugu. Bommarillu, which was made under his banner, is a film I love and connected a lot with. And it feels like an honour to be associated with the banner now. I am excited too and am looking at this release as an examination for me. Since Dil Raju is the teacher, I have a feeling that all of us will pass this exam in Telugu."
The rest of the cast speaks
PC Sreeram: "The Telugu and Tamil film industries are like my two eyes because I have done multiple films in both the languages. The films I did in Telugu have been dubbed into Tamil and same is the case with films I have done in Tamil which have been dubbed in Telugu. I hope Remo is liked by the audiences."
Satish: "It's amazing that the film is releasing in Telugu because of the support of an esteemed producer like Dil Raju."
Bakkiyaraj Kannan: "While it was great that my debut film in Tamil became a success, I am happy to be making even my Telugu debut with this film. I am thankful to my hero Sivakarthikeyan, producer Raja, and Dil Raju for releasing it in Telugu."
Anirudh: "I think Remo will be a great debut film for me in Telugu. I hope the audience will bless Sivakarthikeyan who is entering Telugu filmdom and make not just the film but also the music a hit
`రెమో` ఫస్ట్ లుక్ విడుదల
24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్.డి.రాజా సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు తెలుగులో విడుదల చేస్తున్న చిత్రం `రెమో`. శివకార్తీకేయన్, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం రెమోను తెలుగులో అదే పేరుతో విడుదల చేస్తున్నారు. బక్కియ రాజ్ కన్నన్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్ లుక్, సాంగ్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో శుక్రవారం జరిగింది. ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. సాంగ్‌ను వంశీపైడిపల్లి విడుదల చేశారు. ఈ సందర్భంగా....
అనిల్ రావిపూడి మాట్లాడుతూ ` శివకార్తీకేయన్ సినిమాలు ఇప్పటి వరకు తెలుగులో రీమేక్ అవుతూ వచ్చేవి. కానీ తొలిసారి రెమో సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇక శివకార్తికేయన్ గురించి చెప్పాలంటే తక్కువ కాలంలోనే బాగా కష్టపడి పైకి వచ్చిన హీరో. ఈ చిత్రంలో శివకార్తికేయన్ వేసిన లేడీ గెటప్ చూసిన నేను వెరవరో హీరోయిన్ అనుకున్నాను. శివకు లేడీ గెటప్ అంత బాగా సరిపోయింది. ఈ సినిమాతో తెలుగులోకి ఎంటర్ అవుతున్న శివకార్తికేయన్ కచ్చితంగా రాణిస్తాడు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే దిల్‌రాజు సక్సెస్‌ఫుల్ నిర్మాతగా రాణిస్తున్నారు. ఆయన బ్యానర్‌లో వస్తున్న రెమో సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ - ``నేను శతమానం భవతి అవుట్‌డోర్ షూటింగ్‌లో ఉన్నప్పుడు రాజా రవీంద్ర రెమో తమిళ ట్రైలర్ చూపించాడు. ట్రైలర్ చూడగానే నాకు నచ్చింది. నిర్మాతగా నేను ఇప్పుడు 25వ సినిమా చేశాను. ఇప్పటి వరకు ఏ సినిమాను రీమేక్ చేయలేదు. కానీ తొలిసారి రెమో ట్రైలర్ చూసి రీమేక్ చేయాలనిపించేంతగా ఇన్‌స్పైర్ అయ్యాను. నాలాగే నిర్మాత రాజాను మరికొందరు రీమేక్ కోసం అప్రోచ్ అయ్యారు. అయితే మాల మేడంగారి సపోర్ట్‌తో రాజాగారు నన్ను వచ్చి కలిసి ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి నా బ్యానర్‌లో విడుదల చేయాలనుందని అనడంతో నేను కూడా హ్యాపీగా సరేనన్నాను. ఎందుకంటే ఈ సినిమాను నేను ఒక్కడినే ప్రివ్యూ షో వేసుకుని చూసినప్పుడు బాగా ఎంజాయ్ చేశాను, కానీ నాకు ఎక్కడో డౌట్ వచ్చింది, దాని వల్ల వెట్రి థియేటర్‌లో ఆడియెన్స్ మధ్య సినిమా చూశాను. ఆడియెన్స్ కూడా సినిమాను బాగా ఎంజాయ్ చేయడం చూసి నాలో నమ్మకం ఏర్పడింది. శంకర్‌గారు వైశాలి సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేశాను. తర్వాత మణిరత్నంగారి ఓకే బంగారం సినిమాను కూడా నా బ్యానర్‌లో విడుదల చేశాను. ఇప్పుడు నా బ్యానర్‌లో విడుదల వుతున్న రెమో నాకు హ్యాట్రిక్ హిట్ మూవీ
అవుతుందని భావిస్తున్నాను. హీరో శివకార్తికేయన్ రెమో సినిమాలో మూడు వేరియేషన్స్‌లో అద్భుతంగా యాక్ట్ చేశాడు. పి.సి.శ్రీరాంగారి సినిమాటోగ్రఫీ, అనిరుధ్ సంగీతం సినిమాకు మరింత సపోర్ట్ చేశాయి. డెబ్యూడైరెక్టర్ బక్కియ రాజ్ కన్నన్ చేసిన సినిమా తమిళనాడులో 65-70 కోట్లు కలెక్ట్ చేయడం చిన్న విషయం కాదు. రెమో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్న శివకార్తికేయన్‌కు అభినందనలు`` అన్నారు.
సతీష్ మాట్లాడుతూ - దిల్ రాజుగారి వంటి నిర్మాతగారి సహకారంతో రెమో సినిమా తెలుగులో విడుదల అవుతుండటం చాలా ఆనందంగా ఉంది`` అన్నారు.
దర్శకుడు బక్కియ రాజ్ కన్నన్ మాట్లాడుతూ - ``తమిళంలో నా తొలి సినిమాగా విడుదలైన రెమో పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ రెమో చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడం ఆనందంగా ఉంది. తెలుగులో కూడ రెమో నా తొలి చిత్రంగా విడుదలవుతుంది. సినిమా సక్సెస్ లో భాగమైన శివకార్తికేయన్, నిర్మాత రాజగారికి థాంక్స్. తెలుగులో సినిమాను విడుదల చేస్తున్న దిల్‌రాజుగారికి ధన్యవాదాలు`` అన్నారు.
అనిరుధ్ మాట్లాడుతూ - ``రెమో తెలుగులో నాకు మ్యూజిక్ డైరెక్టర్ మంచి డెబ్యూ మూవీ అవుతుందని భావిస్తున్నాను. ఈ చిత్రం ద్వారా తెలుగులో పరిచయం అవుతున్న శివకార్తికేయన్‌ను ప్రేక్షకులు ఆశీర్విదించాలి. సాంగ్స్, సినిమాను పెద్ద హిట్ చేస్తారని భావిస్తున్నాను`` అన్నారు.
పి.సి.శ్రీరాం మాట్లాడుతూ - ``తెలుగు, తమిళ సినిమాలు నాకు రెండు కళ్ళు లాంటివి. రెండు భాషా చిత్రాలతో నాకు మంచి అనుబంధం ఉంది. నేను తెలుగులో చేసిన సినిమాలు తమిళంలోకి డబ్ అయ్యాయి. అలాగే తమిళ సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి. రెమో సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
వంశీ పైడి పల్లి మాట్లాడుతూ - ``హీరో శివకార్తికేయన్ ను హీరోయిన్‌గా చూపించడానికి దర్శకుడు ఎంత కష్టపడి ఉంటాడో నాకు తెలుసు. అనిరుధ్ మ్యూజిక్‌కు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. మంచి వ్యక్తులు కలిస్తే మంచి విజయాలు వస్తాయనడానికి రెమో లాంటి సినిమాయే ఉదాహరణ. శివకార్తికేయన్ మూడేళ్ళలో హీరో తనెంటో ప్రూవ్ చేసుకోవడమే కాదు, తన సినిమా కోసం ఇప్పుడు తమిళనాడులో అందరూ ఎదురుచూస్తున్నారు. తెలుగులో కూడా శివకార్తికేయన్ సక్సెస్‌ఫుల్ హీరో కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
శివకార్తికేయన్ మాట్లాడుతూ - ``తెలుగులోరెమో సినిమాను విడుదల చేస్తున్న దిల్‌రాజుగారికి థాంక్స్. ఆయన బ్యానర్‌లో వచ్చిన బొమ్మరిల్లు సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఒకప్పుడు ఆ సినిమాకు నేను బాగా కనెక్ట్ అయ్యాను. దిల్‌రాజుగారి బ్యానర్ ద్వారా తెలుగులో ఎంట్రీ ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నాను. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఈ సినిమాను ఓ పరీక్షలా భావిస్తున్నాం. అయితే దిల్రాజుగారి వంటి నిర్మాత టీచర్‌గా ఉండటం వల్ల ఈ రెమో ఎగ్జామ్‌ను మేం అందరం తెలుగులో పాస్ అవుతామని భావిస్తున్నాను`` అన్నారు.