pizza
Seetha first look launch
ఫ్యామిలీ ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన 'సీత.. రామునికోసం' మంచి విజయం సాధించాలి - టీజర్‌ లాంచ్‌లో స్వామి చిదాత్మానంద
You are at idlebrain.com > News > Functions
Follow Us

24 November 2017
Hyderaba
d

కాన్సెప్ట్‌ బేస్డ్‌ మూవీస్‌తో సరికొత్త జోనర్‌లో రూపొందిన చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. అదే కోవలో మరొక్కసారి ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రం 'సీత.. రామునికోసం'. అంతా నూతన నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని నవంబర్‌ 24న హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో ఘనంగా రిలీజ్‌ చేశారు. నూతన నటుడు శరత్‌ హీరోగా కారుణ్య హీరోయిన్‌గా తస్మయ్‌ చిన్మయ ప్రొడక్షన్స్‌, రోల్‌ కెమెరా యాక్షన్‌ పతాకాలపై ఇబాక్స్‌ తెలుగు టి.వి. సమర్పణలో అనిల్‌ గోపిరెడ్డి దర్శకుడిగా శిల్పా శ్రీరంగం, సరితా గోపిరెడ్డి, డాన్‌ నందన్‌ సంయుక్తంగా 'సీత... రామునికోసం' చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా టీజర్ ని వినూత్నంగా రిలీజ్ చేసారు. ఒకేసారి అటు అమెరికాలో ఇక్కడ హైదరాబాద్ లో రిలీజ్ చేసారు. అయినవాళ్లు ,ఆత్మీయులకన్నా సెలెబ్రిటీలు ఎవరు వుండరు అన్న కాన్సెప్ట్ తో అమెరికాలోని తెలుగు వాళ్ళ మధ్య ఈ సినిమా మేకింగ్ వీడియోని, టీజర్ ని లాంచ్ చేసారు. అమెరికాలోని న్యూ జెర్సీ లో చిత్ర నిర్మాతల్లో ఒకరైన డాన్ నందన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రవాస తెలుగు ప్రముఖులు జయ్ తాళ్లూరి, ఉపేంద్ర చివుకుల, మహేందర్ నరాల, తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఆత్మీయ వేడుకగా సాగిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారంతా ఈ సినిమా విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ మేకింగ్‌ని హీరో మదర్‌ జ్యోతి రిలీజ్‌ చేయగా, టీజర్‌ని స్వామి చిదాత్మానంద రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో శరత్‌ హీరోయిన్‌ కారుణ్య, దర్శకుడు అనిల్‌ గోపిరెడ్డి, నిర్మాతలు శిల్పా శ్రీరంగం, సరిత గోపిరెడ్డి, కెమెరామెన్‌ జైపాల్‌ రెడ్డి, ఎడిటర్‌ సాయి తరాలి, మాటల రచయిత వేణు రాచర్ల, కళా దర్శకుడు మధు రెబ్బ, పాటల రచయిత వెంగి పాల్గొన్నారు.

స్వామి చిదాత్మానంద మాట్లాడుతూ.. ''సీత.. రామునికోసం' టీజర్‌ చాలా బాగుంది. అందరూ చాలా కష్టపడి చేశారు. వారి కష్టం అంతా టీజర్‌లో కన్పిస్తుంది. శరత్‌ చిన్నప్పట్నుంచీ హీరో కావాలని కలలు కనేవాడు. ఈ చిత్రంతో అతని కల నెరవేరింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి టీమ్‌ అందరికీ మంచి పేరు తీసుకురావాలని ఆశీర్వదిస్తున్నాను'' అన్నారు.

చిత్ర దర్శకుడు అనిల్‌ గోపిరెడ్డి మాట్లాడుతూ.. ''వైకుంఠ పాళి', 'బిస్కెట్‌' చిత్రాల తర్వాత రెండు సంవత్సరాల పాటు ఈ స్క్రిప్ట్‌ పై వర్క్‌ చేశాను. ఫస్ట్‌ ఐ ఫోన్‌లో టెస్ట్‌ షూట్‌ చేసిన తర్వాత రెడ్‌ కెమెరాతో ఈ చిత్రాన్ని షూట్‌ చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. డెఫినెట్‌గా ప్రేక్షకులు సినిమా చూసి థ్రిల్‌ ఫీలవుతారు. హీరో శరత్‌ నా ఫ్రెండ్‌, అలాగే నా బిజినెస్‌ పార్టనర్‌. ఫస్ట్‌ సినిమా అయినా ఎంతో ఎక్స్‌పీరియన్స్‌ వున్న హీరోలా చాలా అద్భుతంగా నటించాడు. హీరోయిన్‌ కారుణ్య క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్‌ అయి నటించింది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఒక ఆడది మగవాడ్ని మనస్ఫూర్తిగా ప్రేమించి, తాను చనిపోయాక కూడా ఆ ప్రేమను పొందడానికి ఎలా పరితపించింది? ఆ తర్వాత ఆమె ఏం చేసింది? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ చిత్రానికి మ్యూజిక్‌ నేనే చేశాను. మొత్తం 5 పాటలున్నాయి. ఇలాంటి థ్రిల్లర్‌ సినిమాలకు మ్యూజిక్‌, రీరికార్డింగ్‌ చాలా ఇంపార్టెంట్‌. ముఖ్యంగా సెకండాఫ్‌ అంతా ఒళ్ళు గగుర్పొడిచేవిధంగా వుంటుంది'' అన్నారు.

హీరో శరత్‌ మాట్లాడుతూ.. ''మా గురువు స్వామిజీ, మా అమ్మ చేతులమీదుగా ఫస్ట్‌లుక్‌, టీజర్‌, మేకింగ్‌ వీడియోని లాంచ్‌ చేయడం నాకు చాలా ఆనందంగా వుంది. ఇది నా ఫస్ట్‌ సక్సెస్‌గా భావిస్తున్నాను. ఈ చిత్రంలో హీరోగా నటించే ఛాన్స్‌ ఇచ్చిన దర్శకుడు అనిల్‌కి మనస్ఫూర్తిగా థాంక్స్‌. టీజర్‌ చాలా అద్భుతంగా వుంది. సినిమా దానికంటే రెండింతలు వుంటుంది'' అన్నారు.

హీరోయిన్‌ కారుణ్య మాట్లాడుతూ.. ''ఈ చిత్రంలో టైటిల్‌ రోల్‌ చేశాను. అనిల్‌గారు నా క్యారెక్టర్‌ని ఫెంటాస్టిక్‌గా డిజైన్‌ చేశారు. ఇట్స్‌ ఎ ఫ్యామిలీ ఎమోషనల్‌ థ్రిల్లర్‌ మూవీ. ఈ సినిమా మంచి సక్సెస్‌ అయి మా అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.

పాటల రచయిత వెంగి మాట్లాడుతూ.. ''ఈ చిత్రంలో మూడు పాటలు రాశాను. సిట్చ్యుయేషన్‌కి తగ్గట్లుగా పాటలు వుంటాయి. ఈ అవకాశం ఇచ్చిన అనిల్‌గారికి థాంక్స్‌'' అన్నారు.

మాటల రచయిత వేణు రాచర్ల మాట్లాడుతూ - ''ఫ్యామిలీ ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆట్టుకునేవిధంగా వుంటుంది. మంచి సీన్స్‌, డైలాగ్స్‌ చాలా బాగా కుదిరాయి. ఇలాంటి కాన్సెప్ట్‌ బేస్డ్‌ మూవీకి మాటలు రాసే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా వుంది'' అన్నారు.




Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved