pizza
Siva Kasipuram first look launch
'శివ కాశీపురం' ఫస్ట్‌లుక్‌ విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

24 February 2017
Hyderaba
d

సాయి హరీశ్వర్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజేష్‌ చక్రవర్తి, ప్రియాంక శర్మ హీరో హీరోయిన్లుగా హరీష్‌ వట్టికూటి దర్శకత్వంలో మోహన్‌బాబు పులి మామిడి నిర్మించిన చిత్రం 'శివ కాశీపురం'. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. సీనియర్‌ పాత్రికేయులు పసుపులేటి రామారావు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అనంతరం....

దర్శకుడు హరీష్‌ వట్టికూటి మాట్లాడుతూ - ''ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తిగారి మనవడు రాజేష్‌ శ్రీ చక్రవర్తిని మా శివ కాశీపురం చిత్రంతో పరిచయం చేయడం ఆనందంగా ఉంది. మహా శివరాత్రి సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం అదృష్టంగా ఉంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది'' అన్నారు.

నిర్మాత మోహన్‌బాబు పులిమామిడి మాట్లాడుతూ - ''నేను వ్యవసాయ రంగానికి చెందిన వాడిని. కానీ మొదటి నుండి సినిమా రంగం అంటే చాలా ఆసక్తి ఉండేది. దేవుడి కృపతో శివ కాశీపురం సినిమాకు నిర్మాతగా మారాను. నాకు ఇష్టమైన మ్యూజిక్‌ డైరెక్టర్స్‌లో చక్రవర్తిగారు ఒకరు. ఆయన మనవడిని ఇండస్ట్రీకి పరిచయం చేయడం ఇంకా ఆనందంగా ఉంది. డైరెక్టర్‌ హరీష్‌గారు గతంలో చేసిన షార్ట్‌ ఫిలిం చూశాను..నచ్చింది. తర్వాత హరీష్‌గారు చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి అంగీకరించాను. సినిమా బాగా వస్తుంది'' అన్నారు.

హీరో రాజేష్‌ శ్రీ చక్రవర్తి మాట్లాడుతూ - ''డైరెక్టర్‌గారు చెప్పిన కథ నచ్చి సినిమా చేయడానికి అంగీకరించాను. తమిళ్‌ ఫ్లెవర్‌తో చాలా గ్రాండియర్‌ లుక్‌లో సినిమా ఉంటుంది. నన్ను హీరోగా ఆదరిస్తారని నమ్ముతున్నాను'' అన్నారు.

ఈ కార్యక్రమంలో దిల్‌ రమేష్‌, హీరోయిన్‌ ప్రియాంక శర్మ పాల్గొన్నారు.

దిల్‌ రమేష్‌, చమ్మక్‌ చంద్ర, జబర్‌దస్త్‌ రాము, మాస్టర్‌ హరీశ్వర పులి మామిడి, జబర్‌దస్త్‌ నవీన్‌, కళ్యాణి, సత్యప్రియ, రవీంద్ర, వైజాగ్‌ రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: పవన్‌ శేష, కెమెరా: జయ జి.రాంరెడ్డి, ఎడిటర్‌: జియో థామస్‌, నిర్మాత: మోహన్‌బాబు పులి మామిడి, రచన, దర్శకత్వం: హరీష్‌ వట్టికూటి.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved