pizza
Yatrikudu first look launch
కాశీ బ్యాక్‌డ్రాప్‌లో `యాత్రికుడు`
You are at idlebrain.com > News > Functions
Follow Us

10 March 2017
Hyderaba
d



శ్రీ న‌ట‌రాజ ల‌క్ష్మి న‌ర‌సింహ‌స్వామి మూవీస్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం `యాత్రికుడు`. వార‌ణాసి సూర్య ద‌ర్శ‌క‌త్వంలో యు.వేద‌ప్ర‌కాష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శుక్ర‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగిన స‌మావేశంలో బ్యాన‌ర్‌ను సంతోషం సురేష్ కొండేటి, టీజ‌ర్‌ను తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ‌, ట్రైల‌ర్‌ను పోచారం భాస్క‌ర్ రెడ్డి, పోస్ట‌ర్‌ను ప్ర‌తాని రామ‌కృష్ణాగౌడ్ ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో రేవ‌తి గౌడ్‌, బ‌సిరెడ్డి, కె.వి.మోహ‌న్ గౌడ్, హీరో అనూప్‌, సినిమాటోగ్రాఫ‌ర్ ఫ‌ణీంద్ర‌వ‌ర్మ‌, ఎడిట‌ర్ ఉద‌య్, సి.జె.శోభారాణి, ద‌ర్శ‌కుడు వార‌ణాసి సూర్య‌, నిర్మాత వేద‌ప్ర‌కాష్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ రామ్ పైడిశెట్టి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా...

ప్ర‌తాని రామ‌కృష్ణా గౌడ్ మాట్లాడుతూ - ``యాత్రికుడు ట్రైల‌ర్ చాలా బావుంది. ఇది చిన్న సినిమా అయినా పెద్ద సినిమాలా చేస్తాను. నిర్మాత‌ల‌కు థియేట‌ర్స్ విష‌యంలో నా వంతు స‌హకారం అందిస్తాను`` అన్నారు.

పోచారం భాస్క‌ర్ రెడ్డి మాట్లాడుతూ - ``సినిమా మేకింగ్ బావుంది. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు సినిమా పెద్ద సాధించి మంచి పేరు తెచ్చి పెట్టాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ - ``కాశీ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన సినిమా ఇంద్ర చాలా పెద్ద స‌క్సెస్ అయ్యింది. ఈ సినిమా కూడా అలాంటి పెద్ద స‌క్సెస్ కావాలి. ఈ సినిమాలో రీ రికార్డింగ్ చాలా బావుంది. డైరెక్ట‌ర్ సూర్య చాలా కాలంగా నాకు తెలుసు. మొద‌టి ప్ర‌య‌త్నంలో మంచి సినిమా చేశాడు. వేద ప్ర‌కాష్ వంటి నిర్మాత దొర‌క‌డం సూర్య అదృష్టం`` అన్నారు.

ద‌ర్శ‌కుడు వార‌ణాసి సూర్య మాట్లాడుతూ - ``అంద‌రి స‌హ‌కారంతోనే ఈ సినిమాను అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేయ‌గ‌లిగాను. మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, సినిమాటోగ్రఫీ చ‌క్క‌గా కుదిరాయి. సి.వి.ఎల్ స్టూడియో ర‌వి చ‌క్క‌టి స‌హకారం అందించారు. అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

నిర్మాత యు.వేద‌ప్ర‌కాష్ మాట్లాడుతూ - ``కొరియోగ్రాఫ‌ర్ అయిన నేను నిర్మాత‌గా మారి చేసిన తొలి ప్ర‌య‌త్నం. సూర్య మంచి క‌థ‌తో ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమాతో 85 మంది కొత్త న‌టీన‌టులు ఈ సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతున్నారు. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved