14 December 2016
Hyderabad
గల్ప్ వలసల నేపథ్యంలో పి.సునీల్‌కుమార్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం `గల్ఫ్`. శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై యెక్కలి రవీంద్రబాబు, ఎం.రమణీకుమారి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చేతన్ మద్దినేని, డింపుల్ ఇందులో హీరో హీరోయిన్లు. ఇటీవలే చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా గల్ఫ్‌లో ప్రవాసీయుల కోసం పాటుపడే ప్రవాసి మిత్ర మేగజైన్ ఎడిటర్ భీమ్ రెడ్డి ప్రతి ఏడాది ఇంటర్నేషనల్ మైంగ్రేట్ డే సందర్భంగా డిసెంబర్ 18న హైదరాబాద్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో అందజేయనున్నప్రవాసి ఎక్సలెన్స్ అవార్డ్స్-2016 వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ చిత్ర దర్శకుడు సునీల్‌కుమార్ రెడ్డి, మిథిలారెడ్డి, శేషుకుమార్, యెక్కలి రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
డైరెక్టర్ సునీల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ - ``గల్ఫ్ అంటే కేవలం కష్టాలే కాదు...సుఖాలు కూడా ఉంటాయి. ఎంతో మంది గల్ఫ్ కంట్రీస్‌కు వచ్చి సక్సెస్ అయ్యారు. అటువంటి వారి గురించి కూడా మా గల్ఫ్ చిత్రంలో చూపించబోతున్నాం. అలాంటి ఎందరో ఎంతో కష్టపడి పంపుతున్న ధనంతో మన దేశానికి అందుతుంది. ఇలా ప్రవాస భారతీయుల్లో విజయవంతమైన వారిని ఎంపిక చేసి వారికి ఈ ప్రవాసి ఎక్సలెన్స్ అవార్డులను అందజేయడం చాలా గొప్ప విషయం. ప్రవాసి మిత్రతో పాటు కొలిషన్ ఆఫ్ ఓవర్‌సీస్ తెలంగాణ ఆసోసియేషన్‌వారు కూడా ఇందులో భాగస్వామ్యులు కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక గల్ఫ్ సినిమా విషయానికి వస్తే సినిమా గత ఏడాదిన్నర పాటు చిత్రీకరణ జరుపుతున్నాం. సినిమా షూటింగ్ పూర్తయ్యింది. వీలైనంత తర్వగా ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకు రావడానికి మా వంతు ప్రయత్నాలు చేస్తాం. ఈ సినిమాను సౌత్ ఏషియా కంట్రీస్‌లో కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.
ప్రవాసి మిత్ర మేగజైన్ ఎడిటర్ భీమ్ రెడ్డి మాట్లాడుతూ - ``గల్ఫ్‌లోని మన దేశీయులు గురించి సినిమా తీయడానికి ముందుకు వచ్చిన సునీల్‌కుమార్‌రెడ్డిగారిని ముందుగా అభినందిస్తున్నాం. గల్ఫ్ సినిమాకు కావాల్సిన సమాచారం అందివ్వడంలో మా వంతు సహకారాన్ని మేం అందిస్తూ వచ్చాం. గల్ఫ్ అంటే ఒక వైపు కష్టాలుంటే మరోవైపు అక్కడికి వచ్చి సక్సెస్ అయినవారు కూడా ఉన్నారు. వీరందరిలో బెస్ట్ అయినవారికి ప్రవాసి ఎక్సలెన్స్ అవార్డ్స్‌ను అందిస్తున్నాం. డిసెంబర్ 18న వరల్డ్ మైగ్రేంట్ డే సందర్భంగా ఈ అవార్డులను ప్రధానం చేస్తున్నాం. ఈ అవార్డులను గత 26 ఏళ్లుగా అందిస్తూ వస్తున్నాం. అందువల్ల ఈ సారి 26 మందికి ఈ అవార్డులను హైదరాబాద్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో అందిస్తున్నాం`` అన్నారు.