02 March 2017
Hyderabad
తెలుగు చిత్రసీమలో కథానాయికగా క్రేజ్ సంపాదించుకొన్న తెలుగమ్మాయి మనాలి రాథోడ్. సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోపక్క తన సన్నిహితులైన పవన్, విజిత్ వర్మలతో కలిసి సరికొత్త సెలూన్ ను ప్రారంభించి వ్యాపారవేత్తగానూ కొత్తడుగు వేసింది. కూకట్ పల్లిలోని భవ్యాస్ తులసీవనంలో క్లబ్ హౌస్ నందు నేడు (మార్చి 2) సినీ ప్రముఖుల సమక్షంలో "మేకోవర్ స్టూడియో సెలూన్" ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేసిన పాపులర్ యాంకర్ సుమ "మేకోవర్ స్టూడియో సెలూన్"ను ప్రారంభించారు. ప్రత్యేక అతిధులుగా ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్. ప్రముఖ దర్శకనిర్మాత మధుర శ్రీధర్, ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి, ప్రముఖ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంస్థ యజమానుల్లో ఒకరైన మనాలి రాథోడ్ మాట్లాడుతూ.. "నా చిరకాల మిత్రులైన పవన్, విజిత్ వర్మలతో కలిసి ఈ "మేకోవర్ స్టూడియో సెలూన్"ను ప్రారంభించడం, దాన్ని మా యాంకర్ సుమ గారు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మా స్టూడియో తరపు నుంచి ప్రతి నెల కొందరు అనాధ బాలలకు ఫ్రీగా మేకోవర్ చేస్తాం" అన్నారు.


