25 October 2016
Hyderabad
Nata Simham Nandamuri Balakrishna and director Boyapati Sreenu combination blockbuster film Legend is heading to complete 1000 days run. The film released on March 28, 2014 is progressing from 950 to 1000 days in Archana Theater, Proddaturlu in Kadapa district.
Boyapati Sreenu has superbly presented Balayya Babu in a powerful characterization. On this exceptional 1000 days achievement occasion, Archana Theater proprietor K Obul Reddy met director Boyapati for the launch of Legend 950 - 1000 Days poster.
Rajinikanth established a South Indian film record with Chandramukhi running for 891 days in Tamil Nadu. Now, Balakrishna broke this record and rewriting the history with Legend proceeding for an unbelievable 4 digit 1000 days run.
On this outstandingly remarkable moment, K Obul Reddy thanked hero Balakrishna, director Boyapati, producers Ram Achanta, Gopichand Achanta, Anil Sunkara, Sai Korrapati, Balayya Babu fans and Telugu audience for making Legend a memorable film in Telugu cinema history.
బోయపాటి శ్రీను చేతుల మీదుగా `లెజెండ్` 1000(వెయ్యి) రోజుల పోస్టర్ విడుదల
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం `లెజెండ్`. 2014, మార్చి 28న విడుదలైన ఈ చిత్రం కడపజిల్లాలోని ప్రొద్దుటూరు అర్చన థియేటర్‌లో సక్సెస్ ఫుల్‌గా 950 రోజులను పూర్తి చేసుకుని 1000 రోజుల దిశగా పయనిస్తుండటం విశేషం.
నటసింహ నందమూరి బాలకృష్ణను పవర్‌ఫుల్ పాత్రలో దర్శకుడు బోయపాటి శ్రీను ఆవిష్కరించిన తీరు రియల్లీ సూపర్బ్. ఈ శుభ సందర్భాన అర్చన థియేటర్ ప్రొప్రైటర్ కె.ఓబుల్ రెడ్డి, లెజెండ్ దర్శకుడు బోయపాటిని కలిసి లెజెండ్ 950 నుండి 1000వ రోజు పోస్టర్‌ను విడుదల చేశారు.
రజనీకాంత్ నటించిన తమిళ `చంద్రముఖి` చెన్నైలో 891 రోజుల విజయవంతంగా ప్రదర్శించపడి దక్షిణాది సినిమా చరిత్రలో ఓ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఈ రికార్డ్‌ను తిరగరాస్తూ నందమూరి బాలకృష్ణ `లెజెండ్` 950 రోజలను పూర్తి చేసుకుని 1000 రోజులుకు పయనిస్తుంది. దక్షిణ భారత సినిమాల్లోనే 4 డిజిట్స్ పూర్తి చేసుకుంటున్న తొలి సినిమాగా `లెజెండ్`ప్రదర్శించబడుతూ దక్షిణ భారత చలన చిరిత్రలో సరికొత్త హిస్టరీని క్రియేట్ చేయనుంది.
`లెజెండ్`ను ఇంత మెమరబుల్ మూవీగా గుర్తుండిపోయేలా చేసిన తెలుగు ప్రేక్షకులకు, నందమూరి అభిమానులకు హీరో నందమూరి బాలకృష్ణ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, సాయికొర్రపాటి సహా చిత్రయూనిట్ కృతజ్ఞతలు తెలియజేశారు.
Legend 950 to 1000 days poster