pizza
Nandamuri Kalyanram’s New Film With East Coast Productions and Cool Breeze Cinemas Launched
కల్యాణ్‌రామ్‌ హీరోగా ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌, కూల్‌ బ్రీజ్‌ సినిమాస్‌ కొత్త చిత్రం ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us

30 July 2017
Hyderabad

The Dynamic Nandamuri star Kalyan Ram will be seen as the hero in the latest film produced by East coast Productions and Cool Breeze Cinemas. The film will be produced by Kiran Muppavarapu and Vijaykumar Vattikooti. Jayendra is the director & Mahesh Koneru is presenting the film. The first scene had the clap from Jr.NTR and camera was switched on by Shyam Prasad Reddy followed by the first shot direction Krish. Nandamuri Harikrishna handed over the script to the director. This event took place at Ramanaidu Studios, Hyderabad.

Kalyan Ram spoke- “Mahesh Koneru is like my family member. We have been together since two years and he is the main reason why I am doing this film. Coming to the film, I have been doing different films right from the beginning of my career which started 13 years ago. No matter how different they were, the films had commercial elements. But when I heard director Jayendra’s script, there was a new point. I was yearning to do a romantic comedy since ages and my wish will be fulfilled with this film. I am feeling greatly honored to work with a cinematographer like P.C.Sreeram. I am sure he will unleash a new dimension in me through the camera. Aishwarya Lakshmi will be introduced to Telugu Cinema wit this film and I am sure this film will be an enthralling entertainer.”

Mahesh Koneru spoke-“ I am also a journalist and had good relations with the press and now I have entered into film industry. I really hope this fresh banners Eastcoast Productions and Cool Breeze Cinemas would make even more interesting films in the coming future. I am glad to get the opportunity to showcase hero Kalyan Ram in a cool, romantic avatar. I personally thank Kalyan Ram for having the faith in my work. The first schedule of this film will start in Arcot from August 5-7th. Then, we will move to Hyderabad from August 15th till September ending. We are planning to release the film in the first quarter of 2018.

Producer Vijaykumar Vattikooti- “ This film is a result of all those cast and crew who are extremely passionate about Cinema. Kalyan Ram’s positive energy will surely make us even more optimistic. We are quite confident that Sharath would give great music for the film Subha garu has given wonderful script. I don’t need to exclusively tell about director Jayendra’s vision as his work speaks more than words. I feel extremely delighted to work with a celebrated cinematographer like P.C.Sreeram.”

Director Jayendra spoke-“ It is quite exciting to work with Kalyan Ram for a romantic entertainer. He will be seen in a totally changed over look for the film. I am eagerly awaiting to work with him and I am really glad to get such passionate duo of producers.”

Kiran Muppavarapu said that it is definite that the film will be liked by all sections of audience and P.S.Sreeram expressed his happiness to be a part of this young team. The female lead Aishwarya Lakshmi expressed her moment of pride to work with a legendary cinematographer like P.C.Sreeram and looking forward to work with such vibrant team.

PRO: Vamsi Kaka, Art: Selvakumar, Editor: T.S.Suresh, VFX: C. Kamal Kannan, Action: Vijay, Dialogues: Jayendra , Subha, Music: Sharath, Cinematography: P.C.Sreeram, Presentation: Mahesh Koneru, Producers: Kiran Muppavarapu, Vijaykumar Vattikooti, Direction: Jayendra

కల్యాణ్‌రామ్‌ హీరోగా ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌, కూల్‌ బ్రీజ్‌ సినిమాస్‌ కొత్త చిత్రం ప్రారంభం

నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకం సమర్పణలో కూల్‌ బ్రీజ్‌ సినిమాస్‌ బ్యానర్‌పై నిర్మితమవుతున్న కొత్త చిత్రం ఆదివారం హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో లాంఛంగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ముహుర్తపు సన్నివేశానికి ఎన్టీఆర్‌ క్లాప్‌ కొట్టారు. శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, క్రిష్‌ గౌరవ దర్శకత్వం వహించారు. హరికృష్ణ స్క్రిప్ట్‌ను డైరెక్టర్‌కు అందించారు. అనంతంర జరిగిన పాత్రికేయుల సమావేశంలో...

మహేష్‌ కొనేరు మాట్లాడుతూ - ''నేను కూడా పాత్రికేయ రంగం నుండి సినిమా ప్రొడక్షన్‌ రంగంలోకి అడుగు పెట్టాను. పాత్రికేయులతో మంచి అనుబంధం ఉంది. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌, కూల్‌ బ్రీజ్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెం.1 ఇది. ఇలాగే ఇంకా మంచి సినిమాలు చేసే అవకాశం వస్తే చాలా ఆనందంగా ఉంటుందని భావిస్తున్నాను. కల్యాణ్‌రామ్‌గారిని కొత్తగా, ఫ్రెష్‌గా రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రంతో ప్రజెంట్‌ చేసే అవకాశం రావడం హ్యాపీ. అవకాశం ఇచ్చినందుకు కల్యాణ్‌రామ్‌గారికి థాంక్స్‌. ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ ఏర్కాడ్‌లో స్టార్ట్‌ అవుతుంది. ఆగస్ట్‌ 5 నుండి 7 వరకు అక్కడే షూటింగ్‌ చేస్తాం. తర్వాత ఆగస్ట్‌ 15 నుండి సెప్టెంబర్‌ చివరి వారం వరకు సినిమా హైదరాబాద్‌లో చిత్రీకరణను జరుపుకుంటుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

విజయ్‌కుమార్‌ వట్టికూటి మాట్లాడుతూ - ''సినిమా అంటే ప్యాషన్‌ ఉన్న వ్యక్తులందరూ ఓ టీమ్‌గా ఏర్పడి చేస్తున్న సినిమా ఇది. కల్యాణ్‌గారి పాజిటివ్‌ ఎనర్జీతో అందరిలో ఉత్సాహాన్ని నింపుతుంది. శరత్‌ బెస్ట్‌ మ్యూజిక్‌ అందిస్తారని భావిస్తున్నాం. సుభాగారు అద్భుతమైన స్క్రిప్ట్‌ను అందించారు. జయేంద్రగారి విజన్‌ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రేపు స్క్రీన్‌పై చూస్తారు. పి.సి.శ్రీరామ్‌ వంటి గొప్ప టెక్నిషియన్‌తో వర్క్‌ చేయడం గౌరవంగా భావిస్తున్నాం'' అన్నారు.

దర్శకుడు జయేంద్ర మాట్లాడుతూ - ''కల్యాణ్‌రామ్‌గారితో రొమాంటిక్‌ మూవీ చేయడం ఎగ్జయిటింగ్‌గా ఉంది. కల్యాణ్‌రామ్‌గారు సరికొత్త మేకోవర్‌లో కనపడతారు. ఆయనతో పనిచేయడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఐశ్వర్యలక్ష్మిని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నాం. ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్స్‌తో జర్నీ చేయడం హ్యాపీగా ఉంది'' అన్నారు.

Aishwarya Lakshmi glam gallery from the event

కిరణ్‌ ముప్పవరపు మాట్లాడుతూ - ''ఈ సినిమాలో అసోసియేషన్‌ కావడం ఆనందంగా ఉంది. జయేంద్రగారు, పి.సి.శ్రీరాంగారితో కలిసి పనిచేయడం మంచి ఎక్స్‌పీరియెన్స్‌. ఈ సినిమా స్ట్రయిట్‌ తెలుగు సినిమా. ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమాను అందిస్తామనే నమ్మకం ఉంది'' అన్నారు.

ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ - ''ఓ మంచి టీంతో కలసి పనిచేయడం సంతోషంగా ఉంది. పి.సి.శ్రీరాం వంటి గొప్ప టెక్నిషియన్‌తో కలిసి సినిమా చేస్తున్నందుకు గర్వంగా ఉంది'' అన్నారు.

నందమూరి కల్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ - ''మహేష్‌ కొనేరు నా కుటుంబ సభ్యుడు. మాతో గత రెండేళ్లుగా కలిసి ప్రయాణిస్తున్నారు. గత 13 సంవత్సరాలుగా డిఫరెంట్‌ సినిమాలు చేస్తూనే ఉన్నాను. ఎంత డిఫరెంట్‌ సినిమా చేసినా అందులో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటూనే ఉన్నాయి. కానీ తొలిసారి జయేంద్రగారి స్క్రిప్ట్‌ విన్న తర్వాత కొత్తగా అనిపించింది. మంచి రొమాంటిక్‌ కామెడి సినిమాలో చేయాలని చాలా రోజులుగా కోరిక ఉండేది. ఈ సినిమాతో కోరిక తీరనుంది. పి.సి.శ్రీరాంగారితో కలిసి పనిచేయడం గౌరవంగా ఉంది. అందరికీ కొత్త కల్యాణ్‌రామ్‌ కనపడతాడని భావిస్తున్నాను. ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. అందరినీ అలరించే ఎంటర్‌టైనర్‌ అవుతుందని భావిస్తున్నాను'' అన్నారు.

పి.సి.శ్రీరామ్ మాట్లాడుతూ - ``ఓ మంచి చిత్రంలో పార్ట్ కావ‌డం ఎంతో ఆనందంగా ఉంది. మంచి సినిమా అవుతుంది`` అన్నారు.

నందమూరి కల్యాణ్‌రామ్‌, ఐశ్వర్య లక్ష్మి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌: సెల్వకుమార్‌, ఎడిటర్‌: టి.ఎస్‌.సురేష్‌, వి.ఎఫ్‌.ఎక్స్‌:సి.కమల్‌ కన్నన్‌, యాక్షన్‌: విజయ్‌, మాటలు: జయేంద్ర, సుభా, మీరాగ్‌, కథ, కథనం: జయేంద్ర, సుభా, సంగీతం: శరత్‌, సినిమాటోగ్రఫీ: పి.సి.శ్రీరామ్‌, నిర్మాతలు: కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌కుమార్‌ వట్టికూటి, దర్శకత్వం: జయేంద్ర.



 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved