pizza
Kathilanti Kurradu Movie launch
`కత్తిలాంటి కుర్రాడు` ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us

11 October 2016
Hyderaba
d

భద్రాద్రి మూవీస్ బ్యానర్‌పై విసుశ్రీ, అక్ష, హ‌మీదా హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం ఈ రోజు హైద‌రాబాద్‌లో లాంచ‌నంగా ప్రారంభమైంది. జంగాల నాగ‌బాబు ద‌ర్శ‌క‌త్వంలో ఎల్‌.నాని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలి స‌న్నివేశానికి హీరో శ్రీకాంత్ క్లాప్ కొట్ట‌గా, నిర్మాత ఎల్‌.నాని కెమెరా స్విచ్చాన్ చేశారు. ఇ.స‌త్తిబాబు ముహుర్త‌పు స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా...

ద‌ర్శ‌కుడు జంగాల నాగ‌బాబు మాట్లాడుతూ - ``అక్టోబ‌ర్ 28 నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ తూర్పుగోదావరిలో జ‌రుగుతుంది. రెండు సాంగ్స్ చిత్రీక‌ర‌ణ‌ను విదేశాల్లో ప్లాన్ చేశాం. సినిమాలో హీరోయిన్‌గా న‌టించ‌డానికి అంగీక‌రించిన అక్ష‌గారికి థాంక్స్‌. క‌మ‌ల్ సంగీతం అందిస్తుండ‌గా, రామ‌జోగ‌య్య‌, అనంత్ శ్రీరాంలు సాహిత్యం అందిస్తున్నారు. సినిమా షూటింగ్ రాజమండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో చేస్తాం. సంగీతం, సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి`` అన్నారు.

విసుశ్రీ మాట్లాడుతూ - ``అల్ల‌రోడు అనే సినిమా చేస్తున్నాను. ఇది నా రెండో సినిమా. నాలాంటి యంగ్ హీరో ప‌క్క‌నే న‌టించ‌డానికి అంగీక‌రించిన అక్ష‌గారికి థాంక్స్‌`` అన్నారు.

Glam galleries from the event

అక్ష మాట్లాడుతూ - ``యంగ్ టీం చేస్తున్న సినిమా. మంచి రోల్ చేస్తున్నాను. అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌`` అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ క‌మ‌ల్ మాట్లాడుతూ - ``నాకు ఇది రెండో సినిమా. నాపై న‌మ్మ‌కంతో అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో హ‌మీదా, శ‌శి రాజేంద్ర త‌దిత‌రులు పాల్గొన్నారు.

ర‌ఘుబాబు, కృష్ణ‌భ‌గ‌వాన్‌, భ‌ర‌త్ రెడ్డి, శ‌శిరాజేంద్ర‌, హేమ‌, సురేఖా వాణి త‌దిత‌రులు ఇత‌ర తారాగ‌ణంగా న‌టించారు. ఈ చిత్రానికి ఆర్ట్ః బాబ్జి, స్టంట్స్ః క‌న‌ల్ క‌న్న‌న్‌, కెమెరాః వాసిరెడ్డి స‌త్యానంద్‌, సంగీతంః క‌మ‌ల్‌, పాట‌లుః రామ‌జోగ‌య్య‌శాస్త్రి, అనంత్ శ్రీరాం, మాట‌లుః ఎమ్‌.ఎమ్‌.వెంక‌ట్‌, క‌థః జి.వి.శ్రీనివాస్‌, స‌హ నిర్మాత‌లుః డి.ర‌వికుమార్‌, సి.హెచ్‌.నాగేశ్వ‌ర‌రావు, నిర్మాతః ఎల్‌.నాని, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః జంగాల నాగ‌బాబు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved