pizza
Nee Devude Naa Devudu movie launch
`నీ దేవుడే నా దేవుడు` సినిమా ప్రారంభోత్స‌వం
You are at idlebrain.com > News > Functions
Follow Us

15 November 2016
Hyderaba
d

ప్రాజ్ఞేయ ఆర్ట్స్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై స్ర‌వంతి స‌మ‌ర్ప‌ణ‌లో డి.శ్రీధ‌ర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం `నీ దేవుడే నా దేవుడు`. ఈ సినిమా ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో....

ఎమ్మెల్యే బాబూ మోహ‌న్ మాట్లాడుతూ - ``తొలి కిర‌ణం ద‌ర్శ‌కుడు జాన్‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్ర‌మిది. అలాగే నాకెంతోఇష్ట‌మైన హీరోయిన్ దివ్య‌వాణి ఈ చిత్రంలో ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టిస్తుండ‌టం విశేషం. బైబిల్ సంబంధిత సినిమాలు చాలా త‌క్కువ‌గా వ‌స్తుంటాయి. బైబిల్‌లోని అత్తాకోడ‌ళ్లుకు సంబంధించిన క‌థ‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మంచి మెసేజ్ ఉన్న చిత్రం. మంచి టీం కుదిరింది. సినిమా మంచి స‌క్సెస్‌ను సాధించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

ద‌ర్శ‌కుడు జాన్‌బాబు మాట్లాడుతూ - ``ఇది హిస్టారిక‌ల్ చిత్రం. క్రీస్తుపూర్వం ఇజ్రాయిల్ దేశంలో జ‌రిగిన అత్తాకోడ‌ళ్లు క‌థ‌. దాదాపు ప‌ది కోట్ల వ్య‌యంతో ఈ చిత్రాన్ని నిర్మాత తెర‌కెక్కిస్తున్నారు. తొలి కిర‌ణం త‌ర్వాత నా ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా ఇది. ఖ‌ర్చుకు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. రెండు షెడ్యూల్స్‌లో సినిమా పూర్త‌వుతుంది. తొలి షెడ్యూల్ రామోజీ ఫిలింసిటీలో ఈ నెల 26 వ‌ర‌కు జ‌రుగుతుంది. రెండో షెడ్యూల్ టర్కీలో చిత్రీక‌రిస్తాం.జూన్‌లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం. దివ్య‌వాణిగారు మా సినిమా న‌టించ‌డానికి ఒప్పుకోవ‌డం ఆనందంగా ఉంది. ఆర్.పి.ప‌ట్నాయ‌క్‌గారు మంచి సంగీతాన్ని అందించారు`` అన్నారు.

దివ్య‌వాణి మాట్లాడుతూ - ``నేను ప‌దిహేనేళ్ల వ‌య‌సు నుండి సినిమాల్లో న‌టిస్తున్నాను. పెళ్లైన త‌ర్వాత ఏడేళ్లు గ్యాప్ తీసుకున్నాను. నాకు ఇష్ట‌మైన ఈ ఫీల్డ్‌కు దేవుడు న‌న్ను మ‌ళ్లీ ఆహ్వానించాడు. బైబిల్‌లోని ఓ క‌థ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. ఓ కుంటుంబంలోని ప్రేమానురాగాలను ఆధారంగా చేసుకుని సినిమా ఉంటుంది. న‌యోని అనే పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను. మా టీంకు ఆ ప్ర‌భువు, ప్రేక్ష‌కుల ఆశీర్వాదం ఉంటుంద‌ని భావిస్తున్నాం`` అన్నారు.

నిర్మాత డి.శ్రీధ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ - ``మంచి మెసేజ్‌తో, భారీ బ‌డ్జెట్‌తో చేస్తున్న సినిమా. ముందుగానే రిలీజ్‌డేట్‌ను ప్లాన్ చేసుకుని దానిక‌నుగుణంగా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నాం`` అన్నారు.

ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ - ``తొలి కిర‌ణం త‌ర్వాత జాన్‌బాబుగారి ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. సినిమాలో ఆరు పాటలుంటాయి. మంచి మ్యూజిక్ కుదిరింది`` అన్నారు.

ఈ చిత్రానికి క‌థః జి.విజ‌య‌, ర‌చ‌న‌, మాట‌లుః వి.ఎమ్‌.ఎమ్‌.ప్ర‌వీణ్‌, సంగీతంః ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్‌, ఎడిట‌ర్ః టి.రాజు, సినిమాటోగ్ర‌ఫీః ఆర్‌.పి.ప‌ట్నాయ‌క్‌, ఆర్ట్ః నాగు, నిర్మాతః డి.శ్రీధ‌ర్ రెడ్డి, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః జాన్‌బాబు.



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved