12 October 2016
Hyderabad
వి.బి.ఆర్.క్రియేషన్స్, సూరజ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై పూనమ్ పాండే ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం బుధవారం ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది. ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భవాని మస్తాన్ కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నఈ చిత్రానికి వెంకట్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈరోజు నుండే సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం అవుతుందని, కామెడి ప్రధానంగా సాగే లవ్ ట్రయాంగిల్ చిత్రంలో ఓ ప్రముఖ హీరో కూడా నటిస్తున్నారని నిర్మాతలు విజయ్‌భాస్కర్ రెడ్డి, ఫక్రుద్దీన్ షా తెలియజేశారు.


