pizza
Prementha Panichese Narayana movie launch
`ప్రేమెంత ప‌నిచేసె నారాయ‌ణ‌` ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us

14 December 2016
Hyderaba
d

హ‌రిక్రిష్ణా, అక్షిత హీరో హీరోయిన్లుగా జె.ఎస్.ఆర్‌.మూవీస్ బ్యాన‌ర్‌పై జొన్న‌ల‌గ‌డ్డ శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క నిర్మాణంలో కొత్త చిత్రం బుధ‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ప్రారంభ‌మైంది. ముహుర్త‌పు స‌న్నివేశానికి హీరో శ్రీకాంత్ క్లాప్ కొట్ట‌గా, ఎం.ఎస్‌.రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. బి.గోపాల్ తొలి స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో....

ద‌ర్శ‌క నిర్మాత జొన్న‌ల‌గ‌డ్డ శ్రీనివాస‌రావు మాట్లాడుతూ - ``ఇదొక ల‌వ్‌స్టోరీ. అంతా కొత్త‌వాళ్ల‌తోనే మొద‌టిసారిగా చేస్తున్నాను. ఇప్ప‌టి వ‌ర‌కు నాగార్జున‌, శ్రీకాంత్‌, జ‌గ‌ప‌తిబాబు వంటి పెద్ద హీరోల‌తో చేశాను. ముందు కొత్త‌వాళ్ల‌తో చేయ‌డానికి భ‌య‌ప‌డ్డ‌ప్ప‌టికీ శివ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో రెడీ అయ్యాను. మా అబ్బాయి హ‌రికృష్ణ‌ను హీరోగా పరిచ‌యం చేస్తున్నాను. రైట‌ర్‌, టెక్నిషియ‌న్స్ అంద‌రూ ఈ చిత్రంలో నటిస్తున్నారు. అర‌కులో ఓ సాంగ్‌ను చిత్రీక‌రించాం. ఓ నిజ‌మైన ఘ‌ట‌న‌ను ఆధారంగా చేసుకుని దాని ఇన్‌స్పిరేష‌న్‌గా చేసుకుని చేస్తున్న సినిమా ఇది. ఎంట‌ర్‌టైన్మెంట్‌, రొమాన్స్‌, ఫీల్ గుడ్ మూవీ. ఈ నెల 25 నుండి 35 రోజుల పాటు సింగిల్ షెడ్యూల్‌లో సినిమా పూర్త‌వుతుంది. ఫిభ్ర‌వ‌రిలో తుది మెరుగులు దిద్దుకుని మార్చిలో విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

హీరో హ‌రిక్రిష్ణా మాట్లాడుతూ - ``డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్‌. క‌థ విన‌గానే న‌చ్చింది. నాన్న‌గారు హీరో న‌న్ను ప‌రిచ‌యం చేయ‌డం ఆనందంగా ఉంది. అంద‌రూ ప్రోత్సాహం ల‌భిస్తుండ‌టంతో న‌న్ను నేను ప్రూవ్ చేసుకుంటాను`` అన్నారు.

అక్షిత మాట్లాడుతూ - కొత్త‌వాళ్ల‌తో సినిమా తీయ‌డానికి ఆలోచించే ఈరోజుల్లో మాలాంటి కొత్త‌వారికి అవ‌కాశం ఇచ్చిన జొన్న‌ల‌గ‌డ్డ శ్రీనివాస‌రావుగారికి థాంక్స్`` అన్నారు.

Akshitha hot gallery frome the event

ఈ కార్య‌క్ర‌మంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ యాజ‌మాన్య‌, కెమెరా మెన్ క్రిష్ణా జ‌క్కుల‌, దుర్గారావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

హ‌రిక్రిష్ణా, అక్షిత‌, దుర్గారావు, రాజా వ‌న్నెంరెడ్డి, శ్రీరాం బాలాజీ, రాజేంద్ర‌కుమార్‌, చ‌ర‌ణ్‌, గిరి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్ః రామ్ సుంక‌ర‌, డ్యాన్స్ః ప్రేమ్ ర‌క్షిత్‌, మ్యూజిక్ః యాజ‌మాన్య‌, కెమెరాః క్రిష్ణా జ‌క్కుల‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః ఎస్‌.బి.ఎన్‌.రాజు, కో ప్రొడ్యూస‌ర్ః సావిత్రి జొన్న‌ల‌గ‌డ్డ‌, స్క్రీన్‌ప్లే, నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వంః జొన్న‌ల‌గ‌డ్డ శ్రీనివాస‌రావు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved