pizza
Satya Gang movie launch
`స‌త్య‌గాంగ్‌` ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us

24 November 2016
Hyderaba
d

సిద్ధ‌యోగి క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం `స‌త్య‌గాంగ్`. ఈ సినిమాను ఎం.మ‌హేశ్ క‌న్నా నిర్మిస్తున్నారు. ప్ర‌భాస్ నిమ్మ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌త్యూష్ వి.ఆర్‌., హ‌ర్షిత ప‌న్వ‌ర్‌, కిష‌న్ క‌న్న‌య్య కెకె, సాత్విక్‌, సిరి కొమ్ము, వినోద్ కుమార్‌, జీవా, స‌మీర్‌, జెన్ని, బి.హెచ్‌.ఇ.ఎల్‌.ప్ర‌సాద్‌, విజ‌య్‌, చిట్టిబాబు కీల‌క పాత్ర‌ధారులు. ఈ సినిమా ప్రారంభోత్స‌వం హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోలో గురువారం ఉద‌యం జ‌రిగింది. ముహూర్త‌పు స‌న్నివేశానికి కాశీ విశ్వ‌నాథ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ప‌ద్మ దేవేంద‌ర్ రెడ్డి క్లాప్‌నిచ్చారు. తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

హీరో ప్ర‌త్యూష్ మాట్లాడుతూ ``క‌థ చాలా బాగా న‌చ్చింది. త‌ప్పకుండా అంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంది. ఇందులో స‌త్య అనే పాత్ర‌లో నేను క‌నిపిస్తాను`` అని తెలిపారు.

నిర్మాత మాట్లాడుతూ ``ప్ర‌భాస్ చెప్పిన క‌థ న‌చ్చి ఈ సినిమాను ప్రారంభించాం. ఇది అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది`` అని తెలిపారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ``ఐదేళ్లు స‌ముద్ర‌గారి దగ్గ‌ర ప‌నిచేశా. ఇది యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రం. న‌లుగురు కుర్రాళ్లు హైద‌రాబాద్‌కు వ‌చ్చి బ‌త‌క‌డానికి ఏ మార్గం చూసుకున్నారు? డ‌బ్బు కోసం ఎలాంటి దారిలో న‌డిచారు అనేది కీల‌కం`` అని అన్నారు.

Harshitha Singh glam gallery from the event

జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు, గ‌బ్బ‌ర్‌సింగ్ రాజ‌శేఖ‌ర్‌, అంజిబాబు, ప్రేమ్‌, మ‌హేశ్ క‌న్నా, స‌తీమ్‌, రామ్‌, బాబూరావు.కె. కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాకు స‌హ నిర్మాత‌: ఎస్‌.మంగారావు, చ‌ల‌ప‌తి, కెమెరా: అడుసుమిల్లి విజ‌య్ కుమార్‌, సంగీతం: ప‌్ర‌భాస్ నిమ్మ‌ల‌, ఫైట్స్: న‌ందు, పాట‌లు: కుల‌శేఖ‌ర్‌, ఎడిట‌ర్‌: న‌ంద‌మూరి హ‌రి, ఆర్ట్: డేవిడ్‌.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved