pizza
Simplyjith Productions New Film With Santosh Shoban As Hero
సంతోష్‌ శోభన్‌ హీరోగా సింప్లిజిత్‌ ప్రొడక్షన్స్‌ చిత్రం ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us

6 October 2016
Hyderaba
d

'Golconda Highschool','Tanu-Nenu' fame Santosh Shoban's new film in Simplyjith Productions banner was started on October 5th. Abhijeeth Jayanthi is producing this film and Srinivas Chakravarthy, a protege of Creative Director Krishna Vamsy is directing this film. Simplyjith group of companies director Madhavi Katha clapped for opening shot while Director Vamsi Paidipally switched the camera on.

In this occasion Producer Abhijeeth Jayanthi said, " I am very impressed with the story narrated by Director Srinivas Chakravarthy who was a student of Director Krishna Vamsy. This film will get a big break for Santosh Shoban as Hero."

Director Srinivas Chakravarthy said, " I am very thankful to Producer Abhijeeth Jayanthi for giving me this opportunity. This film will be appreciated and enjoyed by all sections of audience."

Satosh Shoban, Kashish Vohra will be seen in lead roles and others like Dr Naresh, Tanikella Bharani, Ajay, Vennela Kishore, Gundu Sudershan, Gemini Suresh are playing other important roles. Music : DJ Vasanth, Cameraman : Samala Bhaskar, Art : Kiran Kumar Manne, Lyrics : Ramajogayya Sastry, Bhaskarabhatla, Balaji, Costumes : Raju, Makeup : Rama Krishna, Stills : Mallik, Publicity Designer : Ananth, Producer : Abhijeeth Jayanthi, Written and Directed by : Srinivas Chakravarthy.

సంతోష్‌ శోభన్‌ హీరోగా సింప్లిజిత్‌ ప్రొడక్షన్స్‌ చిత్రం ప్రారంభం

'గోల్కొండ హైస్కూల్‌', 'తను నేను' ఫేం సంతోష్‌ శోభన్‌ హీరోగా సింప్లిజిత్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై అభిజిత్‌ జయంతి నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌ అక్టోబర్‌ 5న ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ శిష్యుడు శ్రీనివాస్‌ చక్రవర్తి దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ముహూర్తపు షాట్‌కి సింప్లీజిత్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ డైరెక్టర్‌ మాధవీలత క్లాప్‌ నివ్వగా, ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి కెమెరా స్విచ్చాన్‌ చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత అభిజిత్‌ జయంతి మాట్లాడుతూ - ''కృష్ణవంశీగారి శిష్యుడు శ్రీనివాస్‌ చక్రవర్తి చెప్పిన కథ వినగానే ఎంతో బాగా నచ్చడంతో ఈ సినిమా నిర్మిస్తున్నాను. ఈ సినిమా సంతోష్‌ శోభన్‌కి హీరోగా చాలా మంచి పేరు తెస్తుంది'' అన్నారు.

దర్శకుడు శ్రీనివాస్‌ చక్రవర్తి మాట్లాడుతూ - ''ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాత అభిజిత్‌ జయంతిగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్నివర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుంది'' అన్నారు.

సంతోష్‌ శోభన్‌, కాషిష్‌ వోహ్రా హీరో హీరోయిన్లుగా కీలక పాత్రల్లో డా|| నరేష్‌, తనికెళ్ల భరణి, అజయ్‌, వెన్నెల కిషోర్‌, గుండు సుదర్శన్‌, జెమిని సురేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డిజె వసంత్‌, కెమెరామెన్‌: సామల భాస్కర్‌, ఆర్ట్‌: కిరణ్‌కుమార్‌ మన్నె, పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, బాలాజీ, కాస్ట్యూమ్స్‌: రాజు, మేకప్‌: రామకృష్ణ, స్టిల్స్‌: మల్లిక్‌, పబ్లిసిటీ డిజైనర్‌: అనంత్‌, నిర్మాత: అభిజిత్‌ జయంతి, రచన-దర్శకత్వం: శ్రీనివాస్‌ చక్రవర్తి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved