pizza
Sunil - N Shankar - Mahalakshmi Arts production no 2 movie launch
ఎన్‌.శంకర్‌ కాంబినేషన్‌లో సునీల్‌ హీరోగా మహాలక్ష్మి ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌ నెం.2 సినిమా ప్రారంభోత్సవం
You are at idlebrain.com > News > Functions
Follow Us

7 November 2016
Hyderaba
d

ఎన్‌.శంకర్‌ దర్శకత్వంలో సునీల్‌ హీరోగా మహాలక్ష్మి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ముహుర్తపు సన్నివేశానికి తెలంగాణ ఐటీశాఖా మంత్రి కె.టి.ఆర్‌ క్లాప్‌ కొట్టారు, తెలంగాణ విద్యుశాఖా మంత్రి జగదీశ్వరరెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దర్శకరత్న డా.దాసరి నారాయణరావు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....

ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ - ''ఎన్‌.శంకర్‌ తీసిన 9 సినిమాల్లో 8 సినిమాలు హిట్‌ సినిమాలే. అయిన శంకర్‌కు అనుకున్న స్థాయిలో గుర్తింపు లభించలేదు. జై బోలో తెలంగాణ సినిమాను చేసి తెలంగాణ బిడ్డనని రుజువు చేసుకున్నారు. ఇప్పుడు మలయాళంలో విజయవంతమైన 'టు కంట్రీస్‌' సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఈ రీమేక్‌లో సునీల్‌ వంటి మంచి నటుడు యాక్ట్‌ చేస్తుండటం నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. చలం, మహమూద్‌ వంటి కమెడియన్స్‌లా నాకు సునీల్‌ కనపడతాడు. ప్రపంచం గ్లోబలైజేషన్‌ అయిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య మానవీయ విలువలను, సంబంధాలను కామెడి మిక్స్‌ చేసి చూపిస్తున్నారు. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ సాధించి ఎన్‌.శంర్‌కు, టీంకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

తెలంగాణ విద్యుశాఖా మంత్రి జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ - ''సినిమాల గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. కానీ ఇప్పుడు ప్రేక్షకులు మంచి ఎంటర్‌టైనింగ్‌ సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. అలాంటి కామెడితో పెద్ద హిట్‌ సాధించిన మలయాళ సినిమా టు కంట్రీస్‌ చిత్రాన్ని ఎన్‌.శంకర్‌ తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి గోపీసుందర్‌, కోటగిరి వెంకటేశ్వరరావు, శ్రీధర్‌సీపాన వంటి టాప్‌ టెక్నిషియన్స్‌ పనిచేస్తుండటం పెద్ద ఎసెట్‌ అవుతుంది. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

ఎన్‌.శంకర్‌ మాట్లాడుతూ - ''హీరో సునీల్‌ తన స్వయం కృషితో పైకొచ్చిన వ్యక్తి. సునీల్‌ బాడీ లాంగ్వేజ్‌ మలయాళ హీరో దిలీప్‌లా ఉంటుంది. గతంలో దిలీప్‌ యాక్ట్‌ చేసిన సినిమాను సునీల్‌ పూలరంగడు పేరుతో రీమేక్‌ చేసి విజయం సాధించారు. ఇప్పుడు దిలీప్‌ హీరోగా చేసిన టు కంట్రీస్‌ చిత్రాన్ని రీమేక్‌ చేస్తున్నాం. రాంప్రసాద్‌, కోటగిరి వెంకటేశ్వరరావు, గోపీసుందర్‌ వంటి టాప్‌ టెక్నిషియన్స్‌ పనిచేస్తున్నారు. శ్రీధర్‌ సీపాన హ్యుమన్‌ ఎమోషన్స్‌తో కూడిన అద్భుతమైన డైలాగ్స్‌ను అందించారు. మంచి టీం కుదిరింది. డిసెంబర్‌ మొదటి వారం నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ఉంటుంది. ఎనబై శాతం సినిమా అమెరికాలో షూట్‌ చేస్తాం. మంచి సినిమాను అందించడానికి మేం చేసే ప్రయత్నాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం'' అన్నారు.

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ - ''శంకర్‌గారు ఎన్నో సామాజిక చైతన్యవంతమైన సినిమాలు చేశారు. ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉన్న మానవ సంబంధాలను తెలియజేసే సినిమాను చేయనుండటం విశేషం. సునీల్‌ ఎంతో కష్టపడి ఈ స్థాయి వచ్చారు. ఆయన హీరోగా ఎంటర్‌టైనింగ్‌గా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

హీరో సునీల్‌ మాట్లాడుతూ - ''గతంలో దిలీప్‌గారి సినిమాను తెలుగులో పూలరంగడుపేరుతో రీమేక్‌ చేసినప్పుడు నేనే హీరోగా నటించాను. ఇప్పుడు ఆయన నటించిన టు కంట్రీస్‌ చిత్ర రీమేక్‌లో హీరోగా నటిస్తున్నాను. శ్రీధర్‌ చాలా మంచి డైలాగ్స్‌ అందించారు. ఎన్‌.శంకర్‌గారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఈ సినిమాతో నిజం చేస్తానని భావిస్తున్నాను'' అన్నారు.

శ్రీధర్‌ సీపాన మాట్లాడుతూ - ''నేను, సునీల్‌ అన్న పూలరంగడు, భీమవరం భుల్లోడు సినిమా తర్వాత చేస్తున్న సినిమా. ఎలాంటి వల్గారిటీ లేకుండా డీసెంట్‌ కామెడితో ఫ్యామిలీ ఆడియెన్స్‌ కలసి చూసేలా సినిమా ఉంటుంది'' అన్నారు.

ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్‌ సభ్యులు, రాజకీయ ప్రముఖులు పాల్గొని యూనిట్‌ను అభినందించారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved