విజయ్ రామ్, శివ్ శక్తి సచిదేవ్ నటులుగా వి.ఆర్. చలనచిత్రాలు తొలి చిత్రాన్ని శనివారం మొదలుపెట్టింది. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి కెమెరాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ కె.రామ్మోహన్ రెడ్డి స్విచ్చాన్ చేశారు. సుకుమార్ క్లాప్‌నిచ్చారు. నరేష్ గౌరవ దర్శకత్వం వహించారు. థామస్ రెడ్డి, విజయప్రసాద్ స్క్రిప్ట్ ను అందజేశారు. జోనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకుడు. వి.ఇ.వి.కె.డి.ఎస్.ప్రసాద్ నిర్మాత.
సుకుమార్ మాట్లాడుతూ ``ఈ చిత్ర నిర్మాత, నేనూ ఒకే కాలేజీలో పనిచేశాం. ఇద్దరికీ సినిమాలంటే ఆసక్తి. నాకు రసూల్ ఎల్లోర్ చాన్నాళ్ల క్రితమే పరిచయం. ఆయన కెమెరాపనితనం నాకు స్ఫూర్తినిచ్చేది. ఈ చిత్ర దర్శకుడు ఐదేళ్ల క్రితం పరిచయమయ్యాడు. అతను తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ నాకు చాలా బాగా నచ్చింది. అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో తీశాడు. అప్పటి నుంచి నాతో ట్రావెల్ అవుతున్నాడు. ఆర్జీవీ ప్రభావం అతనిపై చాలా ఉంటుంది. ఈ సినిమాకు రథన్‌ను, అందాల రాక్షసి ఆర్ట్ డైరక్టర్ ను నేనే సజెస్ట్ చేశాను`` అని తెలిపారు.
Glam gallery from the event
రసూల్ ఎల్లోర్ మాట్లాడుతూ ``మంచి సినిమాలకు పనిచేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే వెయిట్ చేసి చేస్తున్నా. ఈ చిత్రం తప్పకుండా హిట్ అవుతుంది`` అని అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ``ఈ చిత్ర దర్శకుడు నాకు సుకుమార్ ద్వారా పరిచయమయ్యాడు. మా హీరోయిన్ కూడా యాడ్స్ చేసింది. మంచి నటి. 100 పర్సెంట్ లవ్ లో డాక్టర్‌గా నేను ఒక రోల్ చేశాను. అప్పటి నుంచే నరేశ్ పరిచయమయ్యారు. లవ్ ఫీల్ ఉన్న చిత్రమిది. రథన్ మ్యూజిక్ హిట్ అవుతుంది`` అని అన్నారు.
నరేశ్ మాట్లాడుతూ ``సుకుమార్ సపోర్ట్, బ్లెస్సింగ్స్ తో ఈ సినిమా చేస్తున్నాం. దర్శకుడు 20 నిమిషాలు స్టోరీ చెబితే చాలా స్పెల్ బౌండ్ అయ్యా`` అని చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ ``సుకుమార్ లేకుంటే ఈ సినిమా లేదు. నా పట్ల ఆయనకున్న నమ్మకం చూస్తే చాలా భయమేస్తుంది. సుకుమార్ మంచి హ్యూమన్ బీయింగ్. అలాంటి వ్యక్తిని ఇంకెప్పుడైనా కలుస్తానో లేదో తెలియదు. కథానుగుణంగా బ్యాక్ గ్రౌండ్ పాటలుంటాయి. రియలిస్టిక్ లొకేషన్లలో సినిమా చేస్తున్నాం. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. గులాబి, గీతాంజలి, సఖి తరహాలో ఉంటుంది. న్యూ వేవ్ సినిమా. 2 షెడ్యూల్లో పూర్తి చేస్తాం. ఈ నెలాఖరున మొదలుపెడతాం`` అని చెప్పారు.
నరేష్, లక్ష్మి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రసూల్ ఎల్లోర్, మ్యూజిక్: రథన్, ఆర్ట్ రామకృష్ణ.ఎస్., మాటలు: విస్స శ్రీకాంత్ నాయుడు, నిర్మాత: వి.ఇ.వి.కె.డి.ఎస్.ప్రసాద్, రచన, దర్శకత్వం: జోనాథన్ ఎడ్వర్డ్స్.