pizza
Sri Sai Pawan Putra productions No.1 movie launch
శ్రీ సాయి ప‌వ‌న్‌పుత్ర ప్రొడ‌క్ష‌న్స్ నెం.1 ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us

2 October 2017
Hyderaba
d

శ్రీ ర‌త్నం దవేజీ స‌మ‌ర్ప‌ణ‌లోశ్రీ సాయి ప‌వ‌న్‌పుత్ర ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్‌పై అవ్వారు వంశీ కృష్ణ నిర్మాణ సారథ్యంలో వెంక‌ట్ ద‌ర్శ‌కుడిగా జె.వి.నాయుడు నిర్మిస్తోన్న సినిమా ప్రారంభ‌మైంది. రికార్డింగ్ కార్య‌క్ర‌మాల‌తో విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా సినిమాను స్టార్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత జె.వి.నాయుడు మాట్లాడుతూ - ``ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ట్రెండ్ క్రియేట్ చేస్తోన్న హార‌ర్, ల‌వ్‌, కామెడీ, సెంటిమెంట్ సినిమాలు మంచి విజ‌యాల‌ను సాధిస్తున్న సంగ‌తి తెలిసిందే.ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్న ల‌వ్ కామెడీ హార‌ర్ అంశాల‌తో పాటు మ‌న‌సుకు హ‌త్తుకునే పాయింట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు వెంక‌ట్‌. మ‌ధుమిత‌తో పాటు యుక్త ప్రియ హీయిన్‌గా న‌టిస్తుంది. మ‌రో హీరోయిన్ ఎవ‌ర‌నేది త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం. అలాగే కృష్ణ‌భ‌గ‌వాన్‌, కాదంబ‌రికిర‌ణ్‌, రాకెట్ రాఘ‌వ‌, తాగుబోతు ర‌మేష్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, భావ‌న‌, సురేఖావాణి త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రంంలో ఇద్ద‌రు ప్ర‌ముఖ హీరోలు న‌టించ‌నున్నారు. వీరీతో పాటు సాంకేతిక వ‌ర్గాన్ని త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం`` అన్నారు.

ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణః ర‌త్నం ద‌వేజీ, స‌హ నిర్మాత‌లుః అవ్వారు వంశీకృష్ణ‌, కొల‌న్‌ నంద‌న్‌రెడ్డి, నిర్మాతః జె.వి.నాయుడు, క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వంః వెంక‌ట్‌.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved