రిచాపనై, బాహుబలి ప్రభాకర్, పృథ్వీ, సప్తగిరి, బ్రహ్మాజీ తదితరులు ప్రధాన తారాగణంగా సుఖీభవ మూవీస్ బ్యానర్‌పై వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఎ.గురురాజ్ నిర్మిస్తున్న చిత్రం `రక్షకభటుడు`. ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకున్న సందర్భంగా సోమవారం చిత్రయూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
చిత్ర నిర్మాత ఎ.గురురాజ్ మాట్లాడుతూ - ``సుఖీభవ ప్రాపర్టీస్ సంస్థను ప్రారంభించిన నాకు ప్రజలు ఎంతో సపోర్ట్ చేశారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో సుఖీభవ మూవీస్ బ్యానర్‌పై వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేశాను. చాలా డిఫరెంట్ కథ. సాధారణంగా దేవుడ్ని చూస్తే దెయ్యాలు భయంతో పారిపోతాయి. కానీ ఈ సినిమాలో ఓ దెయ్యాన్ని దేవుడే కాపాడటం విశేషం. వంశీకృష్ణగారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. అరకు లోయలో సినిమాను షూట్ చేశాం. ఈ మార్చి 8 నుండి 10 వరకు జరిగే పాట చిత్రీకరణతో సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అందుకని యూనిట్ అంతా రాత్రి పగలు కష్టపడుతున్నారు. సినిమా ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు ఎంటర్‌టైన్మెంట్‌తో సాగుతూ ప్రేక్షకులను వంద శాతం ఎంటర్‌టైన్ చేసే సినిమా. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించాం. సినిమాలో కథే హీరో మంచి కథతో పాటు ఇండస్ట్రీలోని ప్యాడింగ్ ఆర్టిస్టులందరూ వర్క్ చేశారు`` అన్నారు.
చిత్ర దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ళ మాట్లాడుతూ - ``రక్ష, జక్కన్న వంటి సూపర్‌హిట్ చిత్రాల తర్వాత నేను డైరెక్ట్ చేస్తున్న 3వ సినిమా రక్షకభటుడు. ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎంటర్‌టైన్మెంట్‌తో కూడిన కథే హీరో. ఈ సినిమాకు సంబంధించిన ఆంజనేయ స్వామి పోలీస్ గెటప్‌తో ఉన్న మోషన్ పోస్టర్‌ను విడుదల చేశాం. మోషన్ పోస్టర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా అంతే రేంజ్‌లో ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను. సినిమాలో పర్టికులర్‌గా హీరో అంటూ లేడు. ప్రతి క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంటర్వెల్ వరకు అవుటండ్ అవుట్ ఎంటర్‌టైన్మెంట్‌తో సినిమా సాగుతుంది. సెకండాఫ్‌లో మంచి ఎమోషనల్ సీన్స్‌తో పాటు ఎంటర్‌టైన్మెంట్ మిక్స్ అయ్యింటుంది. క్లైమాక్స్ చివరి పదిహేను నిమిషాలు అందరి హృదయాలను హత్తుకుంటుంది. మల్హర్ భట్ జోషి సినిమాటోగ్రఫీ, రాజీవ్ నాయర్ ఆర్ట్ వర్క్, డ్రాగన్ ప్రకాష్ యాక్షన్ పార్ట్, శేఖర్ చంద్ర మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి.బ్రహ్మానందంగారు ఈ సినిమా సెకండాఫ్‌లో ఓ కీలకమైన పాత్రలో కనపడతారు. అందరూ పగలబడి నవ్వేలా ఆయన రోల్ సాగుతుంది. సినిమాలో ఒకే ఒక సాంగ్ ఉంటుంది. అది కూడా పక్కా మాస్ ట్యూన్ అందించాడు మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్రగారు. అలాగే ఎక్స్‌ట్రార్డినరీ బ్యాక్ గ్రౌండ్ ఇస్తారనడంలో సందేహం లేదు. సినిమా 90 శాతం అరకులోయలోని ఓ పోలీస్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. అందుకోసం రాజీవ్‌నాయర్‌గారు అద్భుతమైన సెట్ వేశారు. చేయాల్సిన ఒక సాంగ్ చిత్రీకరణను మార్చి 8 నుండి 10 వరకు చిత్రీకరిస్తాం. దీంతో చిత్రీకరణంతా పూర్తవుతుంది. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేస్తాం`` అన్నారు.
రిచా పనయ్ మాట్లాడుతూ - ``ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర చేశాను. యూనిట్ అంతా ఓ ఫ్యామిలీలా కలిసిపోయి సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. అరకులోయలోని పోలీస్ స్టేషన్, నా క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది`` అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, ఎడిటర్ అమర్ రెడ్డి, ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
రిచాపనై, బాహుబలి ప్రభాకర్, పృథ్వీ, సప్తగిరి, బ్రహ్మాజీ, ధనరాజ్, అదుర్స్ రఘు, నందు, చిత్రం శ్రీను, గురురాజ్, గౌతంరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలో ప్రత్యేకపాత్రలో ఓ స్పెషల్‌స్టార్ నటించనున్నాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః మల్హర్ భట్ జోషి, ఆర్ట్ః రాజీవ్‌నాయర్, ఎడిటింగ్ః అమర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః జె.శ్రీనివాసరాజు, ప్రొడ్యూసర్ః ఎ.గురురాజ్, రచన, దర్శకత్వంః వంశీకృష్ణ ఆకెళ్ల.