pizza
Inkenti Nuvve Cheppu platinum disc function
`ఇంకేంటి నువ్వే చెప్పు` ప్లాటిన‌మ్ డిస్క్ వేడుక‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

18 December 2016
Hyderaba
d

స‌న్ని, అక్షిత‌, ప్ర‌శాంత్‌, ప్ర‌స‌న్న హీరో హీరోయిన్లుగా వెల్ఫేర్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శివ శ్రీ ద‌ర్శ‌క‌త్వంలో డాక్ట‌ర్ మ‌ళ్ల విజ‌య్ ప్ర‌సాద్ నిర్మించిన చిత్రం `ఇంకేంటి నువ్వే చెప్పు`. వికాస్ సంగీతం అందించిన ఈ సినిమా పాట‌ల ప్లాటిన‌మ్ వేడుక ఆదివారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లోజ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి కె.య‌స్‌.రామార‌వు, సి.క‌ల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా.....

కె.ఎస్‌.రామారావు మ‌ట్లాడుతూ - ``వృత్తి రీత్యా డాక్ట‌ర్ అయిన ప్ర‌సాద్ నాకు మంచి మిత్రుడు. ఆయ‌న సినిమా రంగంపై ప్యాష‌న్‌తో ఎంట్రీ ఇచ్చారు. ఇది వ‌ర‌కు ఆయ‌న సినిమాల‌ను నిర్మించారు కూడా. ఇంకేంటి నువ్వే చెప్పు సినిమాతో మ‌రోసారి కొత్త న‌టీన‌టుల‌ను ప‌రిచ‌యం చేస్తున్నారు. యూత్‌కు క‌నెక్ట్ అయ్యే టైటిల్‌తో వ‌స్తున్న ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

సి.క‌ల్యాణ్ మాట్లాడుతూ - ``సిద్ధు ఫ్ర‌మ్ శ్రీకాకుళం సినిమా నుండే ప్ర‌సాద్‌గారితో నాకు ప‌రిచ‌యం. కొత్త వాళ్ల‌తో సినిమా చేయ‌డం గ‌ట్స్ ఉండాలి. ఈ సినిమాతో కొత్త న‌టీన‌టుల‌కు మంచి లైఫ్ రావాలి. శివ‌శ్రీ తెర‌కెక్కించిన తీరు చూస్తే అనుభ‌మ‌వున్న ద‌ర్శ‌కుడిలా సినిమా చేసిన‌ట్టు ఉంది. సినిమా పెద్ద హిట్ కావాలి. టీంకు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

Glam galleries from the event

డైర‌క్ట‌ర్ శివశ్రి మాట్లాడుతూ, ప్రొడ్యూస‌ర్ ఈ సినిమాకు కావాల్సిన ప్ర‌తీ దాన్ని చాలా చ‌క్క‌గా స‌మ‌కూర్చారు. ఆయ‌న ప్ర‌తీ ఒక్క‌రికీ బంధువు. సినిమాకు ప‌నిచేసిన‌ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులంద‌రూ ఎంతో కష్ట‌ప‌డ్డారు.స‌పోర్ట్ చేసిన‌ ప్ర‌తీ ఒక్క‌రికీ స్పెషల్ థ్యాంక్స్`` అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు వికాస్ మాట్లాడుతూ- ``త‌నకు ఈ అవ‌కాశాన్ని ఇచ్చిన వెల్ఫేర్ క్రియేష‌న్స్ కు ఎంతో ఋణ‌ప‌డి ఉంటాన్నారు. ఆడియో ను ఇంత బాగా ఆద‌రించినందుకు సంతోష‌మ‌న్నారు. సినిమా యూనిట్ కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.

నిర్మాత మ‌ళ్ల విజ‌య‌ప్ర‌సాద్ మాట్లాడుతూ - ``మంచి సినిమాల‌ను నిర్మించేదిగా పేరున్న మా బ్యాన‌ర్ విలువ త‌గ్గ‌కుండా ఈ సినిమా ఉంటుంది. ఆడియో లాగానే ఈ సినిమాను కూడా ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాను.సినిమా మొద‌లు పెట్టిన ద‌గ్గ‌రి నుంచి ఏ ఒక్క రోజు కూడా ఆల‌స్యం కాకుండా ప్ర‌తీ ఒక్క‌రూ ఎంతో క‌ష్ట‌ప‌డి చేశారు. ఈ సినిమా త్వరలొనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. పెద్ద సినిమాలు ఉన్న‌ప్ప‌టికీ, ఈ సినిమా మీద న‌మ్మ‌కంతో ఈనెలలొనే సినిమాను ముందుకు తీసుకొస్తున్నాం..సినిమా సందేశాత్మ‌కంగా ఉంటుంది.వికాస్ అందించిన సంగీతం సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్తుంది. సినిమాను ఒక‌సారి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపించేలా ఉంటుంది`` అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved