19 October 2016
                            Hyderabad
                          'తుంగభద్ర' ఫేమ్ అరుణ్ ఆదిత్ హీరోగా, పూజ ఝవేరి హీరోయిన్ గా మరియు ఇతరులు ప్రధాన పాత్రధారులుగా, రాహూల్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించబడుతున్న చిత్రం 'ఎల్7'. ఈ చిత్ర నిర్మాత గతంలో 'ఈ వర్షం సాక్షిగా' వంటి పలు చిత్రాలు నిర్మించారు. నిర్మాత బి. ఓబుల్ సుబ్బారెడ్డిగారు మాట్లాడుతూ "లవ్, కామెడీ, థ్రిల్లర్ ప్రధానాంశాలుగా నిర్మించిన మా చిత్రం ఔట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. ఇటీవలే ఈ చిత్రం ఆడియోని రిలీజ్ చేసాము. ఆడియో కి మంచి మంచి రెస్పాన్స్ వచ్చ్చింది. మా చిత్రం ప్లాటినం డిస్క్ ఫంక్షన్  ఇవ్వాళా ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా 'ఇష్క్' చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన అరవింద్ శంకర్ పని చేశారు. ఆయన అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ద్వారా ముకుంద్ పాండేని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాము. ఈయన గతంలో ఇష్క్, గుండె జారి గల్లంతయ్యింది, మనం వంటి సూపర్ హిట్ చిత్రాలకు కధ,           స్క్రీన్ ప్లే, దర్శకత్వం విభాగాలలో పని చేశారు. ఈ చిత్రాన్ని 21 వ  తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాము " అని అన్నారు.
                          ఆర్టిస్ట్స్
                            అరుణ్ ఆదిత్ (హీరో)
                            పూజ ఝవేరి (హీరోయిన్)
                            వెన్నెల కిషోర్
                            అజయ్ 
                          టెక్నీషియన్స్
                            సినిమాటోగ్రఫీ  :  దుర్గా ప్రసాద్
                            ఆర్ట్  : నాగ సాయి
                            సంగీతం : అరవింద్ శంకర్
                            లిరిక్స్  : శ్రీమణి
                            ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్  :  ఎం. కిషోర్
                            కో-ప్రొడ్యూసర్స్ : మోహనరావు .బి
                            సతీష్ కొట్టె
                            కె. పున్నయ్య చౌదరి
                            సమర్పణ  : మాస్టర్ ప్రీతమ్ రెడ్డి
                            కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ముకుంద్ పాండే
                            నిర్మాత  : బి. ఓబుల్ రెడ్డి