17 September 2016
Hyderabad
పవన్, బిందు బార్బరీ హీరో హీరోయిన్లుగా పసుపులేటి ప్రసన్న చౌదరి సమర్పణలో కన్నాంబ పసుపులేటి మూవీస్ బ్యానర్‌పై శివనాగేశ్వరరావు దర్శకత్వంలో పసుపులేటి దేవీ చౌదరి నిర్మిస్తోన్న చిత్రం 'మనసంతా నువ్వే'. ర్యాప్ రాక్ షకీల్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ప్లాటినమ్ వేడుక శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో....
మ్యూజిక్ డైరెక్టర్ ర్యాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ - ''పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ శివనాగేశ్వరరావుగారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. పవన్, బిందు బార్బరీ సహా అందరూ నటీనటులు, టెక్నిషియన్స్ చక్కగా సపోర్ట్ చేయడంతో సినిమాను చేయగలిగాం. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించి నిర్మాతకు మంచి పేరు రావాలి''అన్నారు.
రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ - ''కర్ణాటకలో నేను ఆరేడు సినిమాల్లో హీరోగా నటించాను. ఇప్పుడు తెలుగులో కూడా విలన్ లేదా హీరోగా కానీ ప్రయత్నాలు చేస్తున్నాను. ఇక ఈ'మనసంతానువ్వే' సినిమా తెలుగు మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
దర్శకుడు శివనాగేశ్వరరావు మాట్లాడుతూ - ''నల్గొండలో జరిగిన యదార్థ ఘటనను ఆధారంగా చేసుకుని కథ రాసుకుని ప్రసన్న చౌదరి, దేవీ చౌదరిలకు వినిపించాను. వారికి కథ నచ్చడంతో సినిమా రూపకల్పన జరిగింది. అనేక అడ్డంకులను దాటి సినిమాను ఈ స్థాయికి తీసుకొచ్చిన నిర్మాతలకు కృషి అభినందనీయం. పవన్, బిందు, ర్యాప్ రాక్ షకీల్, కెమెరామెన్ నందు సహా నటీనటులు, టెక్నిషియన్స్‌తో అనుకున్నట్లుగానే సినిమాను పూర్తి చేశాం. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం'' అన్నారు.
Bindu Glam gallery from the event |
|
|
|
పసుపులేటి ప్రసన్నచౌదరి మాట్లాడుతూ - ''దక్షిణాది తొలి హీరోయిన్ కన్నాంబగారి మనవడిని నేను. అమ్మమ్మగారి ఆశీస్సులతో ఈ సినిమా చేశాను. మా ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాం. శివనాగేశ్వరరావుగారి చెప్పిన కథను ఇంకా చక్కగా తెరకెక్కించారు. ర్యాప్ రాక్ షకీల్ మంచి సంగీతాన్ని అందించారు. మంచి టెక్నికల్ టీం కూడా తోడవడంతో మంచి సినిమాను తీశాం. వీలైనంత త్వరగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.
పసుపులేటి దేవీ చౌదరి మాట్లాడుతూ - ''శివనాగేశ్వరరావుగారు యదార్థ ఘటనను బేస్ చేసుకుని రాసుకున్న కథ అని, మాకు కథను వినిపించారు. బాగా నచ్చింది. వెంటనే సినిమాను స్టార్ట్ చేశాం. సవాళ్ళను ఫేస్ చేసి సినిమాను పూర్తి చేశాం. ఇటీవల ఆడియో విడుదల కూడా చేశాం. ర్యాప్ రాక్ షకీల్ అందించిన పాటలకు మంచి స్పందన వచ్చింది. సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
హీరో పవన్ మాట్లాడుతూ - ''సినిమాను సెప్టెంబర్ చివరి వారంలో విడుదల చేయడానికి సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను'' అన్నారు.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ బిందు, కె.దేవీలాల్, ముప్పా అంకమ్మ చౌదరి తదితరులు పాల్గొన్నారు. చిత్రయూనిట్‌కు ప్లాటినమ్ డిస్క్‌లను అందజేశారు.
పవన్, బిందు బార్బరీ, చంద్రమోహన్, అమ్మ రాజశేఖర్, గీతాసింగ్, ఆదిత్య, ధనుష్, జెన్నీ, సిల్వర్ సురేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్: ర్యాప్ రాక్ షకీల్, కొరియోగ్రఫీ: సెమ్ సిల్, పాటలు: నందు గాలేటి, బాషా శ్రీ, సహ నిర్మాతలు: కె.దేవీలాల్, ముప్పా అంకమ్మ చౌదరి, నిర్మాత: పసుపులేటి దేవీ చౌదరి, డైరెక్టర్: శివనాగేశ్వరరావు(శివాజీ).