అంజలి టైటిల్ పాత్రలో తెలుగు,తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం చిత్రాంగద. తమిళంలో యార్నీ పేరుతో నిర్మిస్తున్న ఈ హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ చిత్రానికి పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకుడు. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీధర్, రెహమాన్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి 10న విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..
అంజలి మాట్లాడుతూ - ``సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నంది అవార్డు వచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి థాంక్స్. గీతాంజలి తర్వాత నేను నటించిన హీరోయిన్ సెంట్రిక్ మూవీ చిత్రాంగద. నాకు పర్సనల్‌గా చాలా ఇష్టమైన సినిమా. సినిమా కోసం హార్డ్ వర్క్‌చేశాను. నా గత చిత్రాలకు భిన్నంగా ఉండే సినిమా. అశోక్ గారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది`` అన్నారు.
సప్తగిరి మాట్లాడుతూ - ``నేను హర్రర్ మూవీస్‌లో గతంలో చాలా మంచి రోల్స్ చేసి కమెడియన్‌గా చాలా మంచి పేరు తెచ్చుకున్నాను. అలాగే చిత్రాంగద సినిమాలో నా రోల్‌కు చాలా మంచి పేరు వస్తుంది. యు.ఎస్‌లో డిఫరెంట్ క్లైమాక్స్‌లో సినిమాను షూట్ చేశాం. అంజలిగారు హీరోలా యాక్ట్ చేశారు. అంజలిగారి కష్టానికి తప్పకుండా ఫలితం వస్తుంది.అశోక్‌గారి దర్శకత్వంలో వర్క్ చేయడం హ్యాపీగా ఉంటాయి. మన సలహాలు కూడా తీసుకుని మంచి అవుట్‌పుట్ ఇస్తారు`` అన్నారు.
interviewgallery
జి.అశోక్ మాట్లాడుతూ - ``అంజలి మెయిన్ లీడ్ చేసిన చిత్రాంగదలో అంజలి చాలా డేర్‌తో నటించింది. హారర్, కామెడి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. అమెరికాలో క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో మంచి లోకేషన్స్‌లో సినిమాను తీశాం. సప్తగిరి మెయిన్ కమెడియన్‌గా నటించారు. మార్చి 10న ఈ సినిమాను మల్కాపురం శివకుమార్‌గారు సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్. చిత్రాంగద తనకు మరో హిట్ చిత్రంగా నిలుస్తుంది`` అన్నారు.
మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ - ``గీతాంజలి వంటి ఉమెన్ సెంట్రిక్ మూవీలో నటించిన అంజలి. అంత కంటే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా చిత్రాంగద. సప్తగిరి ఈ సినిమాలో డిఫరెంట్ పెర్‌ఫార్మెన్స్‌తో మంచి కామెడిని పండించారు. అశోక్‌గారు సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారు. మార్చి 10న సినిమా విడుదలవుతుంది. సినిమాపై నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సినిమాను విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.