pizza
Touch Chesi Choodu pre release function
`ట‌చ్ చేసి చూడు` ప్రీ రిలీజ్ వేడుక‌
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

27 January 2018
Hyderabad

మాస్ మహారాజా రవితేజ హీరోగా న‌టించిన చిత్రం 'టచ్ చేసి చూడు`. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మించిన చిత్ర‌మిది. విక్రమ్ సిరికొండ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. రాశీఖ‌న్నా, సీర‌త్ క‌పూర్ నాయిక‌లు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఫిబ్ర‌వ‌రి 2న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుక‌లో వి.వి.వినాయక్ ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు. అనంత‌రం...

ర‌వితేజ మాట్లాడుతూ - ``జామ్ 8 వండ‌ర్‌ఫుల్ మ్యూజిక్‌ను అందించారు. రామ్ ల‌క్ష్మ‌ణ్‌, వెంక‌ట్, ర‌వివ‌ర్మ, అన్బు అరివు, పీట‌ర్ హెయిన్స్‌ అంద‌రూ మంచి యాక్ష‌న్స్ సీన్స్ కంపోజ్ చేశారు. రాశీ ఖన్నా, సీర‌త్ క‌పూర్ ఎంత అందంగా ఉంటారో, అంతే అంద‌మైన న‌డ‌వ‌డిక ఉన్నవారు. ఈ సినిమా పెద్ద స‌క్సెస్‌ణు సాధించి నా నిర్మాత‌లు బుజ్జి, వ‌ల్ల‌భ‌నేనిల‌కు బాగా డ‌బ్బులు రావాలి. మిర‌ప‌ర‌కాయ్ నుండి విక్ర‌మ్‌తో నాకు మంచి ప‌రిచ‌యం ఉంది. మంచి క్లారిటీ ఉన్న డైరెక్ట‌ర్‌. సినిమాను అద్భుతంగా తీశాడు. వ‌క్కంతం చాలా మంచి క‌థ‌ను అందించాడు. ఈ సినిమాతో మ‌న‌కు మంచి డైరెక్ట‌ర్ రాబోతున్నాడు. ఈ సినిమా హిట్ అయితే, ఆ క్రెడిట్ అంతా విక్ర‌మ్‌దే. ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌`` అన్నారు.

ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ సిరికొండ మాట్లాడుతూ - ``వినాయ‌క్‌గారు నాకు ఫిల్మ్ గురు. చాలా మంచి విష‌యాల‌ను ఆయ‌న్నుండి నేర్చుకున్నాను. నా సినిమాలు బావుండాల‌ని కోరుకోవ‌డం స‌హ‌జం. అలాగే నా త‌ల్లిదండ్రులు స‌హా నా కుటుంబ స‌భ్యులకు థాంక్స్‌. నా స్నేహితులు నా సినిమా కోసం ఎంతో స‌పోర్ట్ చేశారు. నల్ల‌మ‌లుపు బుజ్జి, వ‌ల్ల‌భ‌నేని వంశీగారికి థాంక్స్‌. బుజ్జిగారు, వ‌క్కంతం వంశీగారి క‌థ విన్న త‌ర్వాతే సాధ్య‌మైంది. వ‌క్కంతం వంశీ అద్భుతమైన క‌థ‌ను అందించారు. సంగీతం అందించిన జామ్ 8, నేప‌థ్య సంగీతం అందించిన మ‌ణిశర్మ‌గారికి థాంక్స్‌. ఛోటాగారు న‌న్నెంతో ఇన్‌స్పైర్ చేశారు. డాలీ, హ‌రీష్‌ల‌కు థాంక్స్‌. రాశి, సీర‌త్‌లు గ్లామ‌ర్‌తోనే కాదు, న‌ట‌న‌తో కూడా మెప్పించారు. ఎన‌ర్జీని ఆయ‌న త‌న నుండి మ‌రొక‌రికి కూడా ఇచ్చే వ్య‌క్తి ర‌వితేజ‌గారు. మ‌నిషి లైఫ్‌లో అద్భుతాలు జ‌రుగుతుంటాయి. నా లైఫ్‌లో జ‌రిగిన అద్భుతం మాస్ మ‌హారాజ్‌. అలాంటి హీరోతో నేను డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం కావ‌డం నా అదృష్టం. ఈ టైటిల్‌లో ఎలాంటి ప‌వ‌ర్ ఉంటుందో, సినిమాలో కూడా అంతే ప‌వ‌ర్ ఉంటుంది. మీరు డిస‌ప్పాయింట్ కారు. మంచి మెసేజ్ కూడా ఉంది. సినిమా చాలా అద్భుతంగా వ‌చ్చిందివండ‌ర్‌ఫుల్ స‌పోర్ట్ అందించారు. సినిమాకు ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌`` అన్నారు.

వి.వి.వినాయ‌క్ మాట్లాడుతూ - ``నిర్మాత‌లు బుజ్జి, వ‌ల్ల‌భ‌నేని వంశీతో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ సినిమా డైరెక్ట‌ర్ విక్ర‌మ్ నాతో క‌లిసి ప‌నిచేశాడు. సినిమాలో రెండు రీళ్లు చూశాను. సినిమాను విక్ర‌మ్ ఎంతో అద్భుతంగా తీశాడు. చోటన్న‌, గౌతంరాజు స‌హా కంగ్రాట్స్‌. బావ‌(ర‌వితేజ‌)కి పుట్టిన‌రోజు వ‌య‌సు త‌గ్గుతూ వ‌స్తుంది. విక్ర‌మార్కుడు సినిమా చూసి ఎలా ఫీల‌య్యామో, ఈ సినిమా చూసిన‌ప్పుడు కూడా అలాగే ఫీల్ అవుతాం. ర‌వి చాలా ఎన‌ర్జితో, ట‌ఫ్‌గా చేశాడు. యూనిట్ అంద‌రికీ శుభాకాంక్ష‌లు`` అన్నారు.

ఆకాష్ సేన్ గుప్తా, కౌశ‌ల్, గుడ్డు మాట్లాడుతూ ``మేం ముగ్గురం క‌లిసి మ‌న‌సా మ‌న‌సాను ట్యూన్ చేశాం`` అని తెలిపారు.

రెహ‌మాన్ మాట్లాడుతూ ``మ‌న‌సా మ‌న‌సా పాట‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఆకాష్‌, కౌశ‌ల్‌, గుడ్డుకి టాలీవుడ్ ఆహ్వానం. ప్రీత‌మ్ జామ్ 8 తొలిసారి తెలుగులో చేస్తున్నారు. ర‌వితేజ‌గారితో ప‌నిచేయ‌డం చాలా ఉత్సాహంగా ఉంటుంది. అంద‌రికీ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది`` అని అన్నారు.

కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ ``రెండో తేదీ ప్రేక్షకులు ఈ సినిమాను ట‌చ్ చేసి చూస్తే 50 రోజులు త‌ప్ప‌కుండా ఆడుతుంది`` అని చెప్పారు.

కాస‌ర్ల శ్యామ్ మాట్లాడుతూ ``రిజా ది గ్రేట్‌లో మూడు పాట‌లు రాశారు. ఈ సినిమాలోనూ ఉత్సాహంతో ఉన్న పాట రాశాను. రాయే ఇటు రాయే ల‌వ్ మ‌గ్గం నేస్కోయే.. అనే పాట రాశాను. మార్క్ గారు చాలా బాగా ట్యూన్ చేశారు. ముందు ఈ పాట‌కు ఇంగ్లిష్ ప‌దాలు రాశాను. కానీ ద‌ర్శ‌కుడు నా మార్క్ ప‌దాలు కావాల‌ని అడిగి రాయించుకున్నారు. మ‌హ‌రాజా ఎన‌ర్జీ తోడైతే చాలా బావుంటుంది`` అని చెప్పారు.

మార్క్ కేడీ మ్యూజ్ మాట్లాడుతూ ``విక్ర‌మ్ సిరిగారు, ర‌వితేజ‌గారికి ధ‌న్య‌వాదాలు. పాట అంద‌రికీ న‌చ్చుతుంద‌ని భావిస్తున్నా`` అని తెలిపారు.

జెమిని కిర‌ణ్ మాట్లాడుతూ ``రాజా ది గ్రేట్ ఏం ట‌చ్ చేసినా సూప‌ర్ హిట్ అవుతుంది. ఈ సినిమా కూడా సూప‌ర్ హిట్ కావాలి`` అని తెలిపారు.

వ‌క్కంతం వంశీ మాట్లాడుతూ ``ఈ ద‌ర్శ‌కుడు పెద్ద హిట్ కొట్టాలి. ఎన్నాళ్లుగానో ఈ అవ‌కాశం కోసం ఎదురుచూశారాయ‌న‌. సినిమా పెద్ద హిట్ కావాలి`` అని తెలిపారు.

హ‌రీశ్ శంక‌ర్ మాట్లాడుతూ ``విక్ర‌మ్ ద‌ర్శ‌కుడు కావాల‌ని నేను ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నా `షాక్‌` త‌ర్వాత నాకు బుజ్జిగారి ఆఫీస్‌లో విక్ర‌మ్ ప‌రిచ‌య‌మ‌య్యారు. దీప‌క్ రాజ్‌, డాలీ, విక్ర‌మ్ అంద‌రూ ప‌రిచ‌య‌మ‌య్యారు. విక్ర‌మ్ గురించి ర‌వితేజ‌గారితో చెప్పిన‌ప్పుడు `ఎవరిగురించైనా యాడ్ వేయాలంటే నీ త‌ర్వాతేరా` అని అన్నారు. ర‌వితేజ‌గారి పుట్టిన‌రోజున ఆయ‌న‌తో మాట్లాతాను. ఈ సినిమా హిట్ అయితే విక్ర‌మ్‌కోస‌మేన‌ని ఆయ‌న అన్నారు. విక్ర‌మ్ మా అంద‌రి కంటే పెద్ద హిట్ కొడ‌తాడు. మా ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో పెద్ద డైర‌క్ట‌ర్ అవుతారు. బుజ్జిగారితో మా ప‌రిచ‌యం చాలా గొప్ప‌ది. హాస్ట‌ల్ వార్డ‌న్‌లాగా చూసుకునేవారు. భోజ‌నం తిన‌మ‌ని, సినిమాలు చూడ‌మ‌ని అనేవారు. ఆయ‌న మీద ఏమైనా కోపం ఉంటే మేం వెళ్లి వినాయ‌క్‌గారికి చెప్పేవాళ్లం. ప్ర‌పంచం మ‌మ్మ‌ల్ని ప్రూవ్డ్ వ్య‌క్తులుగా చూడ‌క‌ముందే బుజ్జిగారు చూశారు. త్వ‌ర‌లో దీప‌క్‌ని కూడా డైర‌క్టర్ చేయాలి. న‌న్ను, మ‌లినేని గోపి, బోయ‌పాటి శ్రీను, హ‌రీశ్ శంక‌ర్‌, విక్ర‌మ్ సిరికొండ‌, బాబీ... ఇలా చాలా మందిని డైర‌క్ట‌ర్లుగా నిల‌బెట్టాడు. తొలి సినిమా చిన్న సినిమా చేసిన‌వారికి కూడా లైఫ్ ఇచ్చాడు. డైర‌క్ట‌ర్ల‌ను ర‌వితేజ న‌మ్మిన‌ట్టు ఇంకెవ‌రూ న‌మ్మ‌రు. ఈ సినిమాతో విక్ర‌మ్‌కి చాలా మంచి పేరు వ‌స్తుంది. జామ్ 8కి కంగ్రాట్స్. ఈ సినిమా ర‌వితేజ కెరీర్లో స్పెష‌ల్ చిత్ర‌మ‌వుతుంది`` అని తెలిపారు.


 
Photo Gallery (photos by G Narasaiah)
 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved