pizza
Aakatayi On the sets press meet
చిత్రీక‌ర‌ణలో `ఆక‌తాయి`
You are at idlebrain.com > News > Functions
Follow Us

23 November 2016
Hyderaba
d

ఆశిష్‌రాజ్‌, రుక్సార్ మీర్ హీరో హీరోయిన్లుగా వి.కె.ఎ.ఫిలింస్ బ్యాన‌ర్‌పై రామ్‌భీమ‌న ద‌ర్శ‌కత్వంలో విజ‌య్ క‌ర‌ణ్‌, కౌశ‌ల్ క‌ర‌ణ్‌, అనిల్ క‌ర‌ణ్ నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం `ఆక‌తాయి`. ఈ సినిమా హైదరాబాద్ సార‌థి స్టూడియోలో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమా ప్ర‌ముఖ బాలీవుడ్ హీరోయిన్ అమీషా ప‌టేల్ స్పెష‌ల్ సాంగ్ చేస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో..

అమీషా ప‌టేల్ మాట్లాడుతూ - ``హిందీలో క‌హోనా ప్యార్ హై సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయిన నేను తెలుగులో బ‌ద్రి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చాను. త‌ర్వాత తెలుగులో బాల‌కృష్ణ, మ‌హేష్‌, ఎన్టీఆర్‌, వంటి స్టార్ హీరోస్‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం క‌లిగింది. మ‌ళ్లీ గ్యాప్ తీసుకుని ఆక‌తాయి సినిమాలో న‌టించాను. ఈ సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్ చేశాను. ఈ సాంగ్‌కు జానీ మాస్ట‌ర్ డ్యాన్స్‌ను జానీ మాస్ట‌ర్ కంపోజ్ చేశారు. ఇది సినిమా టైటిల్ సాంగ్‌. ప్రీ క్లైమాక్స్‌లో వ‌చ్చేసాంగ్ సినిమా ముఖ్య‌మైన స‌మ‌యంలో వ‌చ్చే సాంగ్‌. పాట చాలా బాగా వ‌చ్చింది. ఆశిష్ రాజ్ మంచి హీరోగా పేరు తెచ్చుకుంటాడు. మంచి టీంతో క‌లిసి ప‌ని చేయ‌డం ఆనందంగా ఉంది`` అన్నారు.

చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన కౌశ‌ల్ క‌ర‌ణ్ మాట్లాడుతూ - ``ఆశిష్ రాజ్‌ను ఈ సినిమాతో హీరోగా ప‌రిచయం చేస్తున్నాం. ద‌ర్శ‌కుడు రామ్‌భీమ‌న చెప్పిన పాయింట్ బాగా న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాం. సినిమా ఇప్ప‌టికే 90 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. అమీషా ప‌టేల్‌గారు మా సినిమాలో స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌డం చాలా గొప్ప విష‌యం. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జ‌న‌వ‌రి చివ‌రి వారంలో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

Ameesha Patel glam gallery from the event

ద‌ర్శ‌కుడు రామ్‌భీమ‌న మాట్లాడుతూ - ``సినిమా ప్రారంభ‌మైన రోజు నుండి ఆర‌వై రోజుల పాటు కంటిన్యూ షెడ్యూల్ చేస్తూనే ఉన్నాం. మ‌రో ప‌ది రోజుల్లో షూటింగ్ పూర్త‌వుతుంది. చైత‌న్య ప్ర‌సాద్‌గారు రాసిన ఆక‌తాయి టైటిల్‌తో రాసిన సాంగ్‌లో అమీషా ప‌టేల్ వంటి స్టార్ హీరోయిన్ న‌టించ‌డం ఆనందంగా ఉంది. సాంగ్స్ చాలా బాగా వ‌చ్చాయి. డిసెంబ‌ర్‌లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి జ‌న‌వరిలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమా క‌థ‌పై రెండు సంవ‌త్స‌రాలుగా వ‌ర్క్ చేశాను. ల‌వ్‌, యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో సాగే చిత్రం. ఈ చిత్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియ‌న్ స్క్రీన్‌పై రాని విధంగా యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను ఈ సినిమాలో చూపిస్తున్నాం`` అన్నారు.

హీరో ఆశిష్ రాజ్ మాట్లాడుతూ - ``క‌థ విన‌గానే నేను చేయ‌గ‌లనా..లేదా అనే డౌట్ వ‌చ్చింది. కానీ దర్శ‌కుడు రామ్‌భీమ‌న‌గారు నాలో కాన్ఫిడెంట్‌ను నింపి నాతో సినిమాను చేయించారు. ఈ సినిమా జ‌ర్నీని మ‌ర‌చిపోలేను. మంచి యాక్ష‌న్ స‌న్నివేశాలు ఉంటాయి. సినిమా బాగా వ‌చ్చింది. అమీషాప‌టేల్‌గారితో న‌టించ‌డం హ్యాపీగా ఉంది`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో జానీ మాస్ట‌ర్‌, నిర్మాత‌లు విజ‌య్ క‌ర‌ణ్‌, అనిల్ క‌ర‌ణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఆశిష్‌రాజ్‌, రుక్సార్ మీర్‌, సుమ‌న్‌, నాగ‌బాబు, రాంకీ, రాశి, బ్ర‌హ్మానందం, అలీ, ప్ర‌దీఫ్ రావ‌త్‌, పోసాని, పృథ్వీ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రంలో అమీషా ప‌టేల్ స్పెష‌ల్‌సాంగ్ చేశారు. ఈ చిత్రానికి సంగీతంః మ‌ణిశ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీః వెంక‌ట్ గంగ‌దారి, ఆర్ట్ః ముర‌ళి కొండేటి, ఫైట్స్ః నందు, ఎడిట‌ర్ః ఎం.ఆర్‌.వ‌ర్మ‌, డ్యాన్స్ః జానీ మాస్ట‌ర్‌, స్వ‌ర్ణ‌, స‌తీష్‌, అమిత్‌, నిర్మాత‌లుః విజ‌య్ క‌ర‌ణ్‌, కౌశ‌ల్ క‌ర‌ణ్‌, అనిల్ క‌ర‌ణ్‌, క‌థ‌, క‌థ‌నం, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వంః రామ్ భీమ‌న‌.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved