ఎ.రవితేజ, అశ్విని చంద్రశేఖర్ జంటగా శ్రీమతి శైలజ సమర్పణలో, రెడ్ కార్పెట్ రీల్స్ బ్యానర్ లో రవి పచ్చపాల నిర్మిస్తున్న చిత్రం ఆవు పులి మధ్యలో పెళ్ళి. భాహుబలి లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో కాళకేయ గా నటించి ప్రపంచంలో తెలుగు ప్రేక్షకుల ఆదరణ పోందిన ప్రభాకర్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈచిత్రానికి ఎస్.జె.చైతన్య దర్శకుడు గా పరిచయం అవుతున్నారు. శ్రీమతి శైలజ సమర్పణలో, రెడ్ కార్పెట్ రీల్స్ బ్యానర్ లో రవి పచ్చపాల నిర్మిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 4న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....
దర్శకుడు ఎస్.జె.చైతన్య మాట్లాడుతూ - ``యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌గారికి మా యూనిట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆవు పులి మద్యలో ప్రభాస్ పెళ్ళి అనే టైటిల్ ఏమాత్రం వివాదాస్పదం కాదు. చాలా అందమైన ప్రేమకథ ని తెరకెక్కించాం. తెలగులో మెదటిసారిగా ఏడవటానికి వాడే గ్టిజరిన్ ని నవ్వించటానికి మా చిత్రంలో వాడాము. అలాగే నెల్లూరు లోని రియల్ గ్యాంగ్‌స్టర్స్ ని ఈ చిత్రంలో నటింపజేశాము. ఓ రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని మా చిత్రాన్ని తెరకెక్కించాం. ఫ్యాన్ మేడ్ మూవీ ఇది. చిన్న సినిమాలను తీయడం కంటే రిలీజ్ చేయడం కష్టమైన ఈ పరిస్థితుల్లో మేం ప్రమోషనల్ ప్లాన్స్ తో ముందుకెళుతున్నాం. మా సినిమాను వంశీధర్‌రెడ్డి, ముత్యాలరాందాస్ రిలీజ్ చేయడానికి ముందుకు రావడం ఎంతో హ్యాపీగా ఉంది. డార్క్ కామెడీతో రూపొందిన ఈ సినిమాను నవంబర్ 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
హీరో ఎ.రవితేజ మాట్లాడుతూ - ``డైరెక్టర్ చైతన్యగారు ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి సినిమాను చాలా సెన్సిబుల్‌గా తెరకెక్కించారు. డార్క్ కామెడితో రూపొందిన ఈ చిత్రాన్ని నవంబర్ 4న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. నెల్లూరులో సినిమా చిత్రీకరణ అంతా జరిగింది. పాత్రలు సీరియస్‌గా సాగుతున్నా, చూసే ఆడియెన్స్‌కు మంచి కామెడి జనరేట్ అవుతుంది. మా సినిమాను విడుదల చేయడానికి సహకారం అందిస్తున్న వంశీధర్ రెడ్డిగారికి, ముత్యాల రాందాస్‌గారికి థాంక్స్`` అన్నారు.
నిర్మాత రవిపచ్చపాల మాట్లాడుతూ - ``ఒక ప్రభాస్ ఫ్యాన్ చేసిన సినిమా. ప్రభాకర్‌గారు కీలకపాత్రలో నటిస్తున్నారు. సినిమాను నవంబర్ 4న విడుదల చేయడానికి ప్లాన్ చేశాం. రవితేజ, అశ్విని, భానుశ్రీ అందరూ చక్కగా యాక్ట్ చేశారు. సినిమా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. మా ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
కార్యక్రమంలో హీరోయిన్స్ అశ్విని చంద్రశేఖర్, భానుశ్రీ తదితరులు పాల్గొన్నారు.