pizza
Ameerpet lo release on 16 December
డిసెంబ‌ర్ 16న విడుద‌ల‌వుతున్న `అమీర్ పేట‌లో...`
You are at idlebrain.com > News > Functions
Follow Us

3 December 2016
Hyderaba
d

ప‌ద్మ‌శ్రీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై యామిని బ్ర‌ద‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో మ‌హేష్ మంద‌ల‌పు నిర్మాణ సారథ్యంలో శ్రీ హీరోగా న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన చిత్రం `అమీర్ పేట‌లో..`.అశ్విని హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో ఈష‌, రాజు, తిల‌క్‌, రాజ‌శేఖ‌ర్‌, శేఖ‌ర్ త‌దిత‌రులు తారాగ‌ణంగా న‌టించారు. ఈ సినిమా డిసెంబ‌ర్ 16న విడుద‌ల‌వుతుంది, ఈ సంద‌ర్భంగా శ‌నివారం చిత్ర‌యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...

హీరో, ద‌ర్శ‌కుడు శ్రీ మాట్లాడుతూ - ```అమీర్ పేట‌లో..`చిత్రం డిసెంబ‌ర్ 16న విడుద‌ల కానుంది. మ‌మూరి ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ వారి స‌హ‌కారంతో సినిమాను విడుద‌ల చేస్తున్నాం. వంశీ, ప్ర‌వీణ్‌గారి స‌హ‌కారాన్ని మ‌ర‌చిపోలేను. ఏ ద‌ర్శ‌కుడు అయినా క‌థ రాసుకున్న త‌ర్వాత అత‌నికి మంచి టీం స‌హ‌కారం ఉండాలి. అలాంటి మంచి టీం నాకు దొరికింది. ముర‌ళి, అశ్విని, నిర్మాత మ‌హేష్ స‌హా టీం అంద‌రూ ఎంతగానో స‌పోర్ట్ చేశారు. అమీర్ పేట అన‌గానే మ‌న‌కు చాలా విష‌యాలు గుర్తుకు వ‌స్తుంటాయి. అలా అమీర్‌పేట‌లోని జీవితాల‌ను చూపిస్తూనే, మంచి క‌థ‌ను తెర‌పై చూపించ‌బోతున్నాం. ఎంట‌ర్‌టైన్మెంట్‌తో పాటు ఎమోష‌న‌ల్ కంటెంట్ కూడ ఉన్న సినిమా. ఫ్యామిలీ అంతా క‌లిసి సినిమా చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. మా ప్ర‌య‌త్నాన్ని అంద‌రూ ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

Glam galleries from the event

నిర్మాత మ‌హేష్ మంద‌ల‌పు మాట్లాడుతూ - ``మా `అమీర్ పేట‌లో...` సినిమా చాలా బాగా వ‌చ్చింది. వంశీ, శ్రీకాంత్‌, ప్ర‌వీణ్‌గారు స‌పోర్ట్‌ను మ‌ర‌చిపోలేను. అలాగే శ్రీ హీరోగా న‌టిస్తూ, ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త‌నెంత క‌ష్ట‌ప‌డ్డాడో మాకు తెలుసు. మా టీం క‌లిసి ఓ మంచి ప్ర‌య‌త్నం చేశామ‌ని అనుకుంటున్నాను. మా సినిమాను ప్రేక్ష‌కులు ఆశీర్వ‌దిస్తార‌ని భావిస్తున్నాను`` అన్నారు.

స‌హ నిర్మాత యామిని వంశీ క్రిష్ణ మాట్లాడుతూ - ``మ‌యూరి డిస్ట్రిబ్యూట‌ర్స్ వారి స‌హకారంతో సినిమాను డిసెంబ‌ర్ 16న విడుల చేస్తున్నాం. అంద‌రూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది`` అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ ముర‌ళి మాట్లాడుతూ - ``సినిమా పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో చిత్రయూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

శ్రీ, అశ్విని, ఈష‌, రాజు, తిల‌క్‌, రాజ‌శేఖ‌ర్‌, మ‌హేష్‌తోట‌, మ‌ధు, సాయి, ర‌జిత‌, రితిక‌, శేఖ‌ర్‌, రాజేష్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతంః ముర‌ళి లియోన్‌, సినిమాటోగ్ర‌ఫీః కిర‌ణ్ గ్వారా, ఎడిట‌ర్ః క్రాంతి.కె, నృత్యంః గోరా, స‌హ నిర్మాత‌లుః యామిని వంశీ క్రిష్ణ‌, యామిని ప్ర‌వీణ్ కుమార్‌, దివి శ్రీకాంత్‌, నిర్మాతః మ‌హేష్ మంద‌ల‌పు, క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః శ్రీ.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved