సాయిరాం శంకర్, నికిషా పటేల్ జంటగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై రూపొందిన చిత్రం `అరకు రోడ్ లో`. వాసుదేవ్ తెరకెక్కించారు. మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాద రాజు, రామేశ్వరి నక్కా సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం చిత్రయూనిట్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....
సాయిరాంశంకర్ మాట్లాడుతూ - ``అరకురోడ్‌లో సినిమా డిసెంబర్ 2న విడుదలవుతుంది. కరెన్సీ నోట్స్ సమస్య ఉన్నా, సినిమాపై ఉన్న నమ్మకంతో సినిమాను విడుదల చేస్తున్నాం. సినిమా బాగా ఆడాలంటే సినిమాలోని కంటెంట్‌తో పాటు ప్రమోషన్స్, థియేటర్స్ అన్నీ అవసరం ఈ సినిమాకు అన్నీ చక్కగా కుదిరాయి. కామెడి, యాక్షన్ థ్రిల్లర్ మూవీ. వైజాగ్-అరకు ప్రాంతాల్లో నడిచే కథ. మంచి ఎమోషన్స్ ఉన్న సినిమా. చాలా రోజుల తర్వాత నాకు మంచి సక్సెస్ వస్తుందని నమ్మకంగా ఉంది`` అన్నారు.
Nikesha Patel glam gallery from the event
డైరెక్టర్ వాసుదేవ్ మాట్లాడుతూ - ``డైరెక్టర్ పూరి జగన్నాథ్‌గారు సినిమాను చూశారు. ఆయనకు సినిమా బాగా నచ్చింది. రాహుల్ రాజ్ మంచి సంగీతానందించారు. మణిశర్మగారి తనయుడు ఈసినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విన్నవాళ్లందరూ సూపర్బ్‌గా ఉందని అంటున్నారు. డిసెంబర్ 2న విడుదలవుతున్న మా చిత్రం అరకు రోడ్‌లో తప్పకుండా అందరికీ నచ్చే చిత్రమవుతుంది`` అన్నారు.
చిత్ర నిర్మాతలు మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాద రాజు, రామేశ్వరి నక్కా మాట్లాడుతూ - ``కరెన్సీ సమస్య ఉన్నా సినిమాపై నమ్మకంతో సినిమాను ధైర్యంగా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. నిర్మాతలుగా మాకు మంచి బ్రేక్ నిచ్చే చిత్రమవుతుంది. సాయిరాం శంకర్ అమ్మాయి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో చక్కగా నటించింది. సాయిరాం కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చే చిత్రమవుతుందని నమ్మకంగా ఉన్నాం`` అన్నారు.
నికిషా పటేల్ మాట్లాడుతూ - ``సినిమా చాలా బాగా వచ్చింది. దర్శకుడు వాసుదేవ్ సినిమాను బాగా డైరెక్ట్ చేశారు. నిర్మాతలు చాలా ప్యాషన్‌తో సినిమాను నిర్మించారు. డిసెంబర్ 2న సినిమా విడుదలవుతుంది`` అన్నారు.
కమల్ కామరాజు, అభిమన్యు సింగ్, కోవై సరళ, థర్టీ ఇయర్స్ పృథ్వి, కృష్ణ భగవాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్, సంగీతం : రాహుల్ రాజ్, వాసుదేవ్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జగదీశ్ చీకటి, నిర్మాతలు : మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాద రాజు, రామేశ్వరి నక్కా, రచన, దర్శకత్వం : వాసుదేవ్.