ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా, రమ్యకృష్ణ, నాజర్ ప్రధాన తారాగణంగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'బాహుబలి2'. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ చిత్ర లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని దస్‌పల్లా హోటల్లో శుక్రవారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా
శోభు యార్లగడ్డ మాట్లాడుతూ - ''షూటింగ్ ప్రకారం చూస్తే సినిమాలో ముఖ్య ఎపిసోడ్స్ అన్నీ పూర్తయ్యాయి. మరో రెండు నెలల్లో అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో కొన్ని రోజుల్లో సినిమా చిత్రీకరణ అంతా పూర్తి చేసేస్తాం. కొన్ని సీన్స్, సాంగ్స్ చిత్రీకరించాల్సి ఉంది. ఏప్రిల్ 28న బాహుబలి2 విడుదల చేయబోతున్నాం. వచ్చే ఏడాది, జనవరిలో సినిమా ట్రైలర్ విడుదలయ్యే అవకాశాలున్నాయి'' అన్నారు.
రానా మాట్లాడుతూ ``ఇప్పుడు నేనొక సినిమాల అభిమానిగా మాట్లాడుతున్నాను. నేను హైదరాబాద్‌లో చాలా ఇంగ్లిష్ సినిమాలు చూసేవాడిని. ఇండియానా జోన్స్ లాంటి వార్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం ఉండేది. ఆ సినిమాల తాలూకు బుక్స్ వంటివి ఎక్కువగా చదివేవాడిని. ఇండియన్ సినిమా ఇలా ఉంటదా? అని అనుకునేవాడిని. నేను రాజమౌళిగారిని కలిసినప్పుడు ఒక మ్యాప్ చూపించారు. మహిష్మతి అనే రాజ్యం, ఆ రాజు వంటివన్నీ నాకు సవివరంగా చెప్పారు. అది వాళ్లు క్రియేట్ చేసిన ప్రపంచం. ఒక మహావృక్షాన్ని వాళ్లు క్రియేట్ చేశారు. అందులో ఒక కొమ్మ సినిమా. టెలివిజన్ సీరీస్, కామిక్ బుక్స్, మెర్చండైజింగ్, వర్చువల్ థింగ్స్ వంటి విషయాల్లో వాళ్లు కేర్ తీసుకున్నారు. ఫైనెస్ట్ వార్ ఫిల్మ్ ఇన్ ద కంట్రీని తెరకెక్కించడానికి వాళ్లు ఎంత కష్టపడ్డారో తెలిసిందే. చాలా సినిమాలకి ప్రమోషన్ తాలూకు టీ షర్ట్ లు వంటివి చూస్తుంటాం. ఈ సినిమాకి విత్ లివ్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ బాహుబలి. చాలా క్వాలిటీగా చేశారు. యామజాన్ ప్రైమ్ నుంచి మా టీజర్‌ను అక్టోబర్ 1న విడుదల చేయనున్నాం. గ్రాఫిక్ చేశారు. వరల్డ్ క్లాస్ యానిమేషన్ చూస్తున్నట్టు అనిపిస్తుంది`` అని చెప్పారు.
రాజమౌళి మాట్లాడుతూ ``బాహుబలి టీమ్‌కి అక్టోబర్ ఎగ్జయిట్‌మెంట్ మంత్. షూటింగ్‌కి ప్యాకప్ చెప్పి ప్రెస్‌మీట్‌కు వచ్చేసరికి లేట్ అయింది. బాహుబలికి సంబంధించిన రకరకాల విషయాలు అక్టోబర్‌లోనే విడుదలవుతాయి. బాహుబలి సీరీస్ యామెజాన్ ప్రైమ్‌లో రానుంది. దానికి సంబంధించిన టీజర్ అక్టోబర్ 1న విడుదలవుతుంది. అక్టోబర్ 5న ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్తున్నాం. గుడ్ న్యూస్ అనగానే పెళ్లి గురించి అనుకోకండి. ఈ సినిమా పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోడు. అంటే నేను చేసుకోవద్దని చెప్పానని కాదు. తనే ఆ మాట చెప్పాడు. అలాగని తన తదుపరి సినిమా న్యూస్ కూడా కాదు. తన అభిమానులకే కాదు మొత్తం సౌత్ ఇండియాకే ప్రౌడ్ న్యూస్. అక్టోబర్ 5న రిలీజ్ కానుంది. దాని తర్వాత ఇంకా చాలా జరగనున్నాయి. బాహుబలిని ఒక మహావృక్షంగా తీసుకుంటే టీవీ సీరీస్, కామిక్స్, బుక్స్, గేమ్స్ అన్నీ హయ్యస్ట్ బడ్జెట్‌తో తీస్తున్నాం. బాహుబల్ వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ అనేది అందరూ ఎక్సయిట్ అయ్యేది. ఇది ప్రపంచంలో అందరూ ఇప్పుడిప్పుడు ఎక్స్పీరియన్ప్ చేస్తున్న విషయం. మేం ఈ సినిమాతో చేయడానికి ట్రై చేస్తున్నాం. మాహిష్మతి సామ్రాజ్యాన్ని 360 డిగ్రీస్‌లో ఎక్స్ పీరియన్స్ చేయగలిగితే అది వర్చువల్ రియాలిటీ. టుడీ తెరమీద బొమ్మ చూస్తున్నట్టు కాకుండా మాహిష్మతి ప్రపంచంలోకి వెళ్లి అక్కడ జరగుతున్న కథని అక్కడివారితో కలిసి చూస్తున్నవారిగా అనుభూతిని కలిగించడమే మా ప్రయత్నం. 360 ఫోటోస్ అనో, వీడియోస్ అనో ఫోన్‌లో చూసుకుంటే కెమెరా తిప్పుతుంటే 360 డిగ్రీస్‌లో అన్నీ కనిపిస్తాయి. దానికన్నా కాస్త ఎహెడ్‌గా వెళ్తే గూగుల్ కార్డ్ బోర్డ్ లో ఫోన్ పెట్టుకుని చూసినా కనిపిస్తుంది. శామ్‌సంగ్ గేర్‌వియర్‌ని పెట్టుకుని చూస్తే వర్చువల్ ప్రపంచాన్ని చూడొచ్చు. ఏ ఫోన్ ఉంటే ఆ స్మార్ట్ ఫోన్‌లో దాన్ని చూడొచ్చు. రూ.100 నుంచి రూ.3000 వరకు కాస్ట్ పడొచ్చు. దీనికన్నా హయ్యండ్ వర్చువల్ రియాలిటీ ని రూ.2లక్షల ఖర్చుతో ఆక్యులస్ రిఫ్ట్ గానీ, వైవ్‌గానీ హయ్యస్ట్ గ్లాసస్ దొరుకుతాయి. మేం చేసే బాహుబలి ఎక్స్ పీరియన్స్ ఆ గ్లాసెస్ కోసం చేస్తున్నాం. కమర్షియల్‌గా వయబుల్ లేదు కాబట్టి 200, 300 థియేటర్లలో వాటిని స్టాల్స్ పెట్టి మేం ఇస్తాం. ఎక్స్ పీరియన్స్ చేయొచ్చు. ప్రపంచం మొత్తం మీద ఇలాంటిది తొలిసారి బాహుబలి సినిమాలకే జరుగుతుంది. రూ.25కోట్ల బడ్జెట్‌లో అది అనుభవంలోకి వస్తుంది. బాహుబలి థియేటర్లలో విడుదల కావడానికి నెల రోజుల ముందుగానే వర్చువల్ రియాలిటీ హయ్యండ్ ఎక్స్ పీరియన్స్ ను విడుదల చేస్తాం. దాంతో పాటు మేకింగ్ వీడియోస్‌ని వర్చువల్ రియాలిటీలో చేస్తున్నాం. డైరక్ట్ గా కావాలంటే ఫోన్‌లో ప్యాన్ చేసుకుని, గూగుల్ కార్డ్ బోర్డ్ లోనూ చూడొచ్చు. మేకింగ్ వీడియోలను కూడా హయ్యండ్ క్వాలిటీస్‌తో చేస్తున్నాం. ఫస్ట్ మేకింగ్ విఆర్ వీడియోస్‌ని ప్రభాస్ పుట్టినరోజుకి విడుదల చేయనున్నాం. ఈ రోజు మధ్యాహ్నం నేను తొలి టెస్ట్ చూశా. యూఎస్‌కి వెళ్లి వర్చువల్ రియాలిటీ టెక్నాలజీని గురించి తెలుసుకున్నా. రకరకాల కంపెనీల్లో వీడియోలు చూశా. నేను అక్కడ చూసిన క్వాలిటీ కన్నా, మేం తీసిన టెస్ట్ షార్ట్ చాలా మంచి క్వాలిటీతో ఉంది. అది చెప్పడానికి గర్విస్తున్నా`` అని తెలిపారు.
ప్రభాస్ మాట్లాడుతూ ``బాహుబలి కామిక్ బుక్స్ విడుదల చేస్తున్నాం. అక్టోబర్ 22న విడుదల చేస్తాం. నా ఫ్యాన్స్, అందరూ ఎదురుచూస్తున్న ఫస్ట్ లుక్‌ను అక్టోబర్ 22న నా పుట్టినరోజుకు ఒక రోజు ముందు ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేస్తున్నాం`` అని చెప్పారు.
విలేకరుల ప్రశ్నలకు బాహుబలి టీమ్ చెప్పిన జవాబులు
5న రిలీజ్ చేసే న్యూస్ ఏంటి? గోల్డెన్ గ్లోబ్‌లాంటిది ఏమైనా....?
రాజమౌళి: అవార్డులకు సంబంధించి కాదండీ. మాకు ఆ న్యూస్ వచ్చినప్పుడు
ఆస్కార్‌కి సంబంధించిందా?
రాజమౌళి: అనెక్స్ పెక్టెడ్‌గా మేమెంత హ్యాపీగా ఫీలయ్యామో, ప్రేక్షకులు కూడా అలాగే ఫీలవ్వాలండీ.
కంటెంట్ వైస్ హైలైట్స్ చెప్పండి?
రాజమౌళి: సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను రివీల్ చేయాలని నా గత చిత్రాలకు చెప్పాను. కానీ బాహుబలికి సంబంధించి ఎలాంటి విషయాలను రివీల్ చేయలేదు. బాహుబలి సినిమా తాలూకు విషయాలను రివీల్ చేయకూడదు. కథకు సంబంధించి సినిమాలోనే చూడటం కరెక్ట్ అని నా ఫీలింగ్.
తమన్నా మీద సాంగ్స్ ఉంటాయా?
రాజమౌళి: సెకండాఫ్‌లో తమన్నా ఉంటుంది. కానీ ఆమె మీద పాటలు లేవు. అనుష్క ఇందులో హీరోయిన్.
వార్ సీక్వెన్స్ అన్నీ తీసేశారా?
రాజమౌళి: క్లైమాక్స్ అయిపోయింది. గ్రాఫిక్స్ విషయంలో, మనుషుల విషయంలో ఏ ఇబ్బందులు లేకుండా పూర్తి చేయగలిగాం. రెండున్నర నెలలు సమయం పట్టింది. ఎడిటింగ్ చేసి గ్రాఫిక్స్ చేశాం.
షూటింగ్ పార్ల్ లో బ్యాలన్స్ ఏంటి?
రాజమౌళి: రెండు పాటలు, చిన్న ప్యాచ్ వర్క్, ఒక చిన్న యాక్షన్ సీక్వెన్స్ ఉంది.
ప్రభాస్, రానా వర్కింగ్ ఇన్ రాజమౌళినా? లేకుంటే అరెస్టడ్ బై రాజమౌళినా?
డిసెంబర్‌లో రెండు వారాల్లో వారికి సంబంధించిన షూటింగ్ పూర్తవుతుంది. ఆర్టిస్టులందరూ రిలీజ్ అవుతారు. బాహుబలి అనే మహావృక్షం నుంచి చాలా సినిమా అనేది కొమ్మ మాత్రమే. బాహుబలి పార్ట్ 3 అనేది ఆన్ ద కార్డ్స్.
వర్చువల్ రియాలిటీ అనేది నేసల్ స్టేజ్ ఇన్ ఇండియా? టార్గెటింగ్ ద ఇంటర్నేషనల్ మార్కెట్? ఆర్ ఎ లోకల్ థింగ్?
వర్చువల్ రియాలిటీ నేసెల్‌స్టేజ్ ఇన్ ఇండియా. హూ ఈజ్ యువర్ టార్గెట్? ఇంటర్నేషనల్ ఆడియన్స్ టార్గెటా? లేకుంటే లోకల్ ఆడియన్స్ టార్గెటా?
రాజమౌళి: నేషనల్ ఆడియన్స్ నే నేను టార్గెట్ చేశాను. దీనికి సంబంధించి మేం ఎ.ఎం.డి వాళ్లతో కొలాబరేట్ అయ్యాం. వాళ్లు నాణ్యతతో కూడిన వాటిని అందిస్తారు. కెమెరాలు, రిలేటెడ్ టెక్నాలజీ, దానికి సంబంధించిన స్టిచింగ్, హై క్వాలిటీ 360 డిగ్రీ ఇమేజ్‌ని తీసుకురావడానికి వాళ్లు హెల్ప్ చేస్తున్నారు. లాస్ ఏంజెల్స్ కి సంబంధించిన గ్రాఫిక్స్ కంపెనీల్లో దానికి సంబంధించిన సీజీ వర్క్ జరుగుతోంది. వర్చువల్ రియాలిటీకి సంబంధించింది ముఖ్యంగా అక్కడ జరుగుతోంది.
లాస్ ఏంజిల్స్ కంపెనీ ఏంటి?
రాజమౌళి: సీఎన్‌సీపీటీ అనే కంపెనీ లాబీ పాట్స్ ను ఇస్తోంది. వీఆర్ ఎక్స్ పీరియన్స్ అనేది జాన్ రిఫెల్ కి చెందిన కంపెనీ అది. వర్చువల్ రియాలిటీకి సంబంధించిన పార్ట్స్ కోసం వేరే కంపెనీలతో కలిసి చేస్తున్నాం.
ఇన్స్ పిరేషన్ ఎక్కడిది?
రాజమౌళి: ఇది చాలా ఫ్లాట్‌ఫార్మ్స్ కి రీచ్ అవుతుందని అనుకుంటున్నాం.
వర్చువల్ రియాలిటీ అనేది ఒన్లీ వార్ సీక్వెన్స్ కేనా?
రాజమౌళి: సెట్ ఇన్ ద వార్. బట్ వార్ మాత్రమే ఉండదు.
తమన్నా ఫ్యాన్స్ తమన్నాతో పాట పాడుతున్నట్టు చేయొచ్చా?
రాజమౌళి: అది కూడా చేయొచ్చండి.
రానా: వర్చువల్ ఇంకా ఎర్లీ స్టేజ్ ఇన్ ఇండియా అన్నారు కదా.. ప్రతి టెక్నాలజీకి ఇండియాలో సరైన ప్రాడక్ట్ కావాలి. దానికి బాహుబలి ప్రాడక్ట్ మెయిన్ కావాలన్నది మా అభిప్రాయం.
రాజమౌళి: యానిమేటడ్‌సీరీస్ కి 1, 2 అనేది సంబంధం లేదు. బేసిక్ స్టోరీ నేను చేశాను. మిగిలిన డెవలప్‌మెంట్ అంతా గ్రాఫిక్ ఇండియా వాళ్లు చేస్తున్నారు. యానిమేషన్ టుడీ యానిమేషన్ చేస్తున్నాం.
దీనికి టైమ్ ఫ్రేమ్ ఏమన్నా పెట్టుకున్నారా?
రాజమౌళి: ఫరెవర్. నాకు బాహుబలిని వదలాలని లేదు. వెస్ట్ లో ఆల్ ద ఫ్రాంచైసిస్ అనేది ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్లు పోయిన తర్వాత కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ సినిమా కోసం ఆర్టిస్టులు పెట్టిన హార్డ్ వర్క్ సినిమా అయ్యాక ఆగిపోవాలని లేదు. కంటిన్యూ కావాలని ఉంది.
అంటే బాహుబలి అనే సినిమానే తీస్తారా?
రాజమౌళి: బాహుబలి అనేది దాని మానాన అది కంటిన్యూ అవుతుంది. నేను దాంతో మాత్రమే ఉండను.
బాహుబలి 600, 700 క్రోర్స్ అన్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతోంది?
రాజమౌళి: రియలిస్టిక్ ఎక్స్ పెక్టేషన్ ఒకటి ఉంటుంది. అది తెలుగులో బాహుబలి 1 ఎంత చేసిందో, దానికి 30-40 శాతం ఎక్కువ చేయాలని ఎక్స్ పెక్టేషన్. హిందీ, మలయాళంలో టాప్ 10 సినిమాల్లో ఒకటి కావాలని, తమిళ్‌లో టాప్ 5 సినిమాల్లో ఉండాలని కోరుకుంటున్నాం. ఆశకి ఏముందండీ ఆస్కార్ కావాలని కూడా ఉంటుంది.
ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ చూపిస్తున్నారా?
రానా: ముందా? వెనకా అని ఆలోచించనీయకుండా ఉంటుంంది.
రాజమౌళి: నిజమే అండీ. రానా చెప్పినట్టు థియేటర్‌కి వెళ్లిన వ్యక్తి దాన్ని అనుభవించి బయటికి రావాలి. అంతే