ఉషా మూవీస్ సమర్పణలో ఆర్ ఫిలింస్ ఫ్యాక్టరీ అండ్ బొమ్మన ప్రొడక్షన్స్ సారథ్యంలో రాజా రామ్మోహన్ చల్లా దర్శకత్వంలో తూము రామారావు, బొమ్మన సుబ్బారాయుడు, రాజేష్ రంబాల నిర్మాతలుగా రూపొందిన చిత్రం `c/o గోదావరి` . ఈ చిత్రం ఫిబ్రవరి 24న విడుదలవుతుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
మ్యూజిక్ డైరెక్టర్ రఘుకుంచె మాట్లాడుతూ - ``గోదావరి గురించి, అందులో ప్రయాణం గురించి ఎంత చెప్పినా తక్కువే. గోదావరి అందాలపై చాలా సినిమాలు వచ్చాయి. సత్యంగారు, ఇళయరాజుగారు, రమేష్ ప్రసాద్‌గారు, కె.ఎం.రాధాకృష్ణగారు సహా పలువరు మ్యూజిక్ డైరెక్టర్స్ గోదావరిపై మంచి పాటలను మనకు అందించారు.ఇప్పుడు వీటితో పాటు గోదావరిలో ఫేమస్ అయిన పులస చేపను కూడా చేర్చిన పాటను అందించాను. ఈ పాటకు మంచి స్పందన వస్తుంది. ఈ సినిమాలో కథే హీరో. సినిమా తప్పకుండా పెద్ద హిట్ సాధిస్తుంది`` అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన తూము రామారావు మాట్లాడుతూ - ``ఇటీవల రిలీజైన పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు కూడా సినిమా బావుందని అప్రిసియేట్ చేశారు. ఎన్నో సినిమాలకు రచయితగా పనిచేసిన రామ్మోహన్‌గారు ఈసినిమా దర్శకుడుగా పరిచయం అయ్యి సినిమాను చక్కగా తెరకెక్కించారు. సినిమాను ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం`` అన్నారు.
దర్శకుడు రాజా రామ్మోహన్ మాట్లాడుతూ - ``గోదావరి గురించి ఎంత చెప్పినా తక్కువే. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలతో అనుబంధం ఏర్పరుచుకున్న గోదావరిపై తీసిన ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు కొత్త వారైన ఇతర ప్యాండింగ్ ఆర్టిస్టులతో సినిమాను చక్కగా చేశాం. మా ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం`` అన్నారు.
ఈ కార్యక్రమంలో బొమ్మన సుబ్బారాయుడు సహా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.