pizza
Darshakudu press meet
`ద‌ర్శ‌కుడు` ప్రెస్‌మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

22 July 2017
Hyderabad



Glam galleries from the event

'కుమారి 21 ఎఫ్‌' సెన్సేషనల్‌ హిట్‌ తర్వాత బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ నిర్మాతగా సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్‌, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి నిర్మిస్తున్న చిత్రం 'దర్శకుడు'. అశోక్‌, ఈషా జంటగా నటిస్తున్నారు. హరిప్రసాద్‌ జక్కా దర్శకత్వం వహిస్తున్నారు. హరి ప్రసాద్‌ జక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 4న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్బంగా శ‌నివారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్, పాట‌ల‌ను ప్ర‌దర్శించారు.

బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ మాట్లాడుతూ - ''కుమారి 21 ఎఫ్‌' సినిమాకి మీడియా, ప్రేక్షకులు అందించిన సహకారం మర్చిపోలేను. ఇప్పుడు అదే సపోర్ట్‌ని 'దర్శకుడు' సినిమాకి అందిస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమాకి తమవంతు సహకారాన్ని అందించిన రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈనెల 28న ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ ప్లాన్‌ చేస్తున్నాం. ఆ వేడుకకి బన్నీ చీఫ్‌ గెస్ట్‌గా రాబోతున్నాడు. సాయికార్తీక్‌ అందించిన మ్యూజిక్‌కి చాలామంచి రెస్పాన్స్‌ వస్తోంది. సండే టు సాటర్‌డే నాకు ఇష్టమైన సాంగ్‌. ఆగస్ట్‌ 4న సినిమా రిలీజ్‌ అవుతుంది'' అన్నారు.

దర్శకుడు హరిప్రసాద్‌ జక్కా మాట్లాడుతూ - ''చాలా మంచి లవ్‌స్టోరి. సినిమాలంటే ప్యాషన్‌ వున్న ఒక డైరెక్టర్‌ కథ. సాయికార్తీక్‌ డిఫరెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. ప్రతి పాటకి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సినిమాలోని ప్రతి సీన్‌ ఆడియన్‌ని ఎంగేజ్‌ చేసేలా వుంటుంది. ఆగస్ట్‌ 4 సినిమా రిలీజ్‌ అవుతుంది. చిత్రాన్ని ఆదరిస్తారని భావిస్తున్నాం'' అన్నారు.

సంగీత దర్శకుడు సాయి కార్తీక్‌ మాట్లాడుతూ - ''మంచి లవ్‌స్టోరి. ఎమోషన్స్‌ కూడా వుంటాయి. దర్శకుడు హరిప్రసాద్‌ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. తప్పకుండా ఆందర్నీ మెప్పించే సినిమా అవుతుంది'' అన్నారు.

హీరో అశోక్‌ మాట్లాడుతూ - ''మంచి కథతో తెరకెక్కించిన సినిమా ఇది. హరిప్రసాద్‌ చాలా బాగా తీశారు. సాయికార్తీక్‌ మ్యూజిక్‌ ఎక్స్‌లెంట్‌గా వుంది. ఆగస్ట్‌ 4న విడుదలవుతున్న ఈ సినిమాని పెద్ద హిట్‌ చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ ఈషాతో సహా చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved