నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో బిబో శ్రీనివాస్ సమర్పణలో ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మించిన చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి`. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయల సమావేశంలో...నిర్మాతలు బిబో శ్రీనివాస్, వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు మాట్లాడుతూ - ``గౌతమిపుత్ర శాతకర్ణి సంక్రాంతి సందర్భంగా జనవరి 12న గ్రాండ్ రిలీజై అన్నీ చోట్ల నుండి పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. నందమూరి అభిమానులు, ప్రేక్షకులు సినిమా చూసి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత ఇండస్ట్రీ నుండి అందరూ అప్రిసియేట్ చేస్తున్నారు.
టైటిల్‌లో ఏ పవర్ ఉందో తెలియదు కానీ అనౌన్స్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ అవాంతరాలు లేకుండా సినిమా రూపొందింది. ఇంత పెద్ద సినిమాను 79 రోజుల్లో పూర్తి చేయడంలో నందమూరి బాలకృష్ణగారు, డైరెక్టర్ క్రిస్ సహా ఇతర నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ రాత్రి పగలు కష్టపడి కృషి ఎంతో ఉంది. ఈ పని చేయడంలో ఎలాంటి ఇతర కారణాలు లేకుండా పూర్తి చేయాలని ముందుగానే అనుకుని, ఓ ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ వచ్చాం. నందమూరి బాలకృష్ణగారిలోని ఎనర్జీ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన సపోర్ట్, ఎనర్జీతోనే అందరూ మొదటి రోజు నుండి హార్డ్‌వర్క్ చేశారు. సినిమాను 600 పైగా థియేటర్స్‌లో విడుదల చేశాం. రెస్పాన్స్ బాగుండటంతో ఇంకా థియేటర్స్ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కలెక్షన్స్ విషయం ఇంకా చూడలేదు. సినిమా రిలీజ్ పరంగా బిజీగా ఉన్నాం. నంబర్స్ కోసమో, మరి దేని కోసమో ఈ సినిమాను మేం చేయలేదు. ఒక మంచి సినిమాను చేయాలని భావించి చేసిన సినిమా. తెలంగాణ సీ.ఎం.కె.సి.ఆర్‌గారు సినిమాను ఈరోజో, రేపో చూస్తారు. అలాగే ఈరోజు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారు సినిమా చూసి సినిమాను అప్రిసియేట్ చేశారు. ఇంతకు ముందు చేసిన సినిమాలో పోల్చితే మూడు నాలుగు రెట్లు బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించాం. బాలకృష్ణగారి కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను చేస్తున్నామని చాలా కేర్ తీసుకుని చేశాం. బాలకృష్ణగారితో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసినందుకు నిర్మాతలు గర్వపడుతున్నాం`` అన్నారు.