15 November 2016
Hyderabad
'దృశ్యం' వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత శ్రీప్రియ దర్శకత్వంలో వస్తోన్న మరో అద్భుత దృశ్య కావ్యం 'ఘటన'. నిత్యామీనన్ ప్రధాన పాత్రలో క్రిష్ జె. సత్తార్ హీరోగా మలయాళంలో సూపర్‌హిట్ అయిన '22 ఫిమేల్ కొట్టాయం' చిత్రాన్ని మల్కాపురం శివకుమార్ సమర్పణలో సన్‌మూన్ క్రియేషన్స్ పతాకంపై శ్రీప్రియ దర్శకత్వంలో వి.ఆర్. కృష్ణ ఎం. 'ఘటన' పేరుతో సురక్ష్ ఎంటర్ టైన్మెంట్ ఇండియా ప్రై.లి బ్యానర్‌పై నవంబర్ 18న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో.....
నిర్మాత వి.ఆర్.కృష్ణ.యం మాట్లాడుతూ - ''మలయాళ సినిమా '22 ఫిమేల్ కొట్టాయం'ను తెలుగు, తమిళంలో రీమేక్ చేశాం. తమిళంలో అల్రెడి సినిమా విడుదలై మంచి సక్సెస్ ను సాధించింది. నిత్యామీనన్‌గారు కథకు చక్కగా యాప్ట్ అయ్యారు. తెలుగులో విజయశాంతిగారు ప్రతిఘటనలో ఎలా నటించారో నిత్య అలా నటించారు. శివకుమార్‌గారు సినిమా చూసి నచ్చడంతో విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. నవంబర్ 18న సినిమా విడుదలవుతుంది. . మా ప్రయత్నాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ - ``'22 ఫిమేల్ కొట్టాయం`లో రీమా కలింగ చేసిన పాత్రను తెలుగు, తమిళంలో నిత్యామీనన్ అద్భుతంగా చేశారు. నర్సు పనిచేసే ఓ యువతి విదేశాలకు వెళ్లాలనుకుని వీసా కోసం ఓ కన్సటెన్సిని సంప్రదిస్తుంది. ఆ కన్సటెన్సివారు ఆ యువతిని మోసం చేస్తారు. ఆ యువతి ఆ మోసం నుండి ఎలాంటి బాధలు పడింది. చివరకు వారికి ఎలా బుద్ది చెప్పిందనేదే కథ. తెలుగులో రీమేక్ చేసేటప్పుడు కొంత మంది తెలుగు హీరోలను సంప్రదించినా వారు ఈ సినిమాను చేయడానికి అంగీకరిచలేదు. నిత్యామీనన్ కథ వినగానే సినిమా చేయడానికి ఒప్పుకుంది. ఈ సినిమాను నవంబర్ 18న 250-300 థియేటర్స్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇక కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను క్యాన్సిల్ చేయడం వల్ల సినిమా పరిశ్రమ చాలా ఇబ్బందులు గురైంది. సాధారణంగా ఓ వారంలో పది నుండి పదిహేన కోట్ల రూపాయల బిజినెస్ తెలుగు సినిమాల్లో జరుగుతుంది. కానీ నోట్స్ క్యాన్సిల్ చేయడం వల్ల సినిమా పరిశ్రమ చాలా ఇబ్బందులను పేస్ చేస్తుంది. ఈ సమస్య నుండి ప్రభుత్వం సినిమా పరిశ్రమ అండగా నిలబడాలని కోరుకుంటున్నాను`` అన్నారు.