pizza
Ghazi release on 17 February
ఫిబ్ర‌వ‌రి 17న విడుద‌ల‌వుతున్న `ఘాజీ`
You are at idlebrain.com > News > Functions
Follow Us

24 January 2017
Hyderaba
d

రానా, తాప్సీ, కె.కె.మీన‌న్‌, అతుల్ కుల‌క‌ర్ణి, నాజ‌ర్ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగ‌ణంగా మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్‌, పివిపి సినిమా సంయుక్తంగా సంక‌ల్ప్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `ఘాజీ`. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 17న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...

ద‌గ్గుబాటి రానా మాట్లాడుతూ - ``ముందుగా ఈ సినిమాకు సంబంధం లేని వ్య‌క్తి రామ్మోహ‌న్‌గారికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పాలి. ఎందుకంటే లోయ‌ర్ ట్యాంక్‌బండ్‌లో స‌బ్‌మెరైన్ సెట్ వేశార‌ని ఆయ‌న చెప్ప‌గానే నేను వివ‌రాలు సేక‌రించాను. అప్పుడు ఆ సెట్ ఘాజీ అనే సినిమా కోసం వేశార‌ని తెలిసింది. త‌ర్వాత నేను ఘాజీ గురించి చ‌దివాను. నేను ఈ సినిమాలో న‌టిస్తాన‌ని సంక‌ల్ప్‌ను క‌లిశాను. ఈ సినిమాలో భాగ‌మ‌య్యాను. సాధార‌ణంగా ఈ సినిమా చేసే స‌మ‌యంలో నాకు ప‌రిచ‌యం ఉన్న స్నేహితులు, కొంత మంది నిర్మాత‌లు ఏ సినిమా చేస్తున్నావ‌ని అడిగిన‌ప్పుడు స‌బ్‌మెరైన్ సినిమా చేస్తున్నాన‌ని చెబితే న‌న్ను పిచ్చోణ్ణి చూసిన‌ట్టు చూసేవారు. ముప్పై రెండేళ్ల నాకు 20 ఏళ్లుగా వైజాగ్ ఆర్‌.కె.బీచ్‌తో ప‌రిచయం ఉంది. అక్క‌డ ఘాజీ స‌బ్‌మెరైన్‌ను చూస్తుంటాను కానీ ఘాజీ గురించిన క‌థ ఎవ‌రికీ తెలియ‌దు. వైజాగ్‌లో కూడా ఇంత గొప్ప క‌థ జ‌రిగింద‌ని చాలా మందికి తెలియదు. ఇలాంటి సినిమాలో న‌టించే అవ‌కాశం రావ‌డం అరుదుగా ల‌భించే అవ‌కాశం. మ‌రో క్రెడిట్ రాజ‌మౌళిగారికి ఇవ్వాలి. ఈ సినిమా కోసం సంకల్ప్‌ను క‌లిసిన‌ప్పుడు ఇద్ద‌రం ఈ సినిమా స్క్రిప్ట్‌పై ఆరేడు నెల‌లు పాటు వ‌ర్క్ చేశాం. 10-15 వెర్ష‌న్స్ రాసుకు
ని బెస్ట్ అనుకున్న‌దానితో ముందుకెళ్లాం. అరుదైన జోన‌ర్ మూవీ. సినిమాను ఎంతో ఎఫెక్టివ్‌గా నిర్మించాల‌ని నిర్మాత‌లు ప్ర‌య‌త్నించి ఓ క్వాలిటీ సినిమాను చేయ‌డానికి ఒక్క‌ట‌య్యారు. అతుల్‌కుల‌క‌ర్ణి, కె.కె.మీన‌న్‌లు కేవ‌లం నటులుగానే కాకుండా ఈ సినిమా విష‌యంలో ర‌చ‌యిత‌లుగా కూడా త‌మ స‌హ‌కారాన్ని అందించారు. అలాగే క‌ర‌ణ్‌జోహార్‌, టాన్‌డ‌న్ గారికి కూడా కృత‌జ్ఞ‌త‌లు. ఎందుకంటే ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేయ‌డానికి వారు ముందుకు వ‌చ్చారు. ఘాజీ కంటే ముందు బాహుబ‌లి సినిమాతో వారి వ‌ద్ద‌కు వెళ్లాను. అప్ప‌టి నుండి తెలుగులో ఎలాంటి సినిమాలు వ‌స్తున్నాయ‌నే దాన్ని వారు గ‌మ‌నిస్తుండేవారు. ఈ సినిమాకు ముందు వారిని మరే సినిమా ఇన్‌స్ఫైర్ చేయ‌లేదు. ఫ‌స్టాఫ్‌ను సి.జి. వ‌ర్క్‌తో చూసిన వారు, సెకండాఫ్‌ను సౌండ్ లేకుండా చూసి థ్రిల్ ఫీల‌య్యారు. ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. అలాగే అమితాబ్ బ‌చ్చ‌న్‌గారు టీజ‌ర్ చూసిన త‌ర్వాత వాయిస్ ఓవ‌ర్ చెప్ప‌డానికి ఒప్పుకున్నారు. సినిమా టీజ‌ర్ విడుద‌లైన రెండు గంట‌ల్లోనే రెండు కోట్ల మంది వ్యూవ‌ర్స్ చూశారంటే సినిమా కోసం ఎంత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. తెలుగులో ఇలాంటి సినిమా రా
వాల‌నే కోరిక ఉండేది. ఈ సినిమాతో అది సాధ్య‌మైంది. అలాగే భ‌విష్య‌త్‌లో ఇలాంటి సినిమాల‌కు ఘాజీ సినిమా నాంది ప‌లుకుతుంద‌ని భావిస్తున్నాను`` అన్నారు.

Taapsee Pannu Glam gallery from the event

డైరెక్ట‌ర్ సంక‌ల్ప్ మాట్లాడుతూ - ``నేనెవ‌రో తెలియ‌క‌పోయినా, నా ఐడియాను న‌మ్మిఈ సినిమా చేయ‌డానికి ముందుకు వ‌చ్చిన నిర్మాత‌ల‌కు థాంక్స్‌. రానా చేరిక‌తో సినిమా రేంజ్ మ‌రింత పెరిగింది. మ‌దిగారు అద్భుత‌మైన సినిమాటోగ్ర‌ఫీ అందించారు. శ్రీక‌ర్ ప్ర‌సాద్‌గారు కూడా ఎంతో బ్యూటీఫుల్ ఎడిటింగ్ వ‌ర్క్‌ను అందించారు. కె ఎక్స‌లెంట్ సంగీతంను అందించారు. ప్ర‌తి ఒక్క‌రూ గ‌ర్వంగా ఫీల‌య్యే సినిమా. ఇలాంటి సినిమా నా డెబ్యూ మూవీ అని గ‌ర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది`` అన్నారు.

ప్ర‌సాద్‌.వి.పొట్లూరి మాట్లాడుతూ - ``గ‌తేడాది ఫిబ్ర‌వ‌రిలో క్ష‌ణం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాం. ప్రేక్ష‌కులు మ‌మ్మ‌ల్ని ఎంత‌గానో ఆద‌రించారు. నిర్మాత‌లుగా చాలా సినిమాలు చేసినా, ఘాజీ సినిమాను నిర్మించ‌డం చాలా గర్వంగా భావిస్తున్నాను. ఇలాంటి సినిమా తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోనే కాదు, ఇండియన్ సినిమాలోనే ఎవ‌రు ట‌చ్ చేయ‌ని స‌బ్జెక్ట్‌. రానా, తాప్సీ, సంక‌ల్ప్‌, అతుల్‌కుల‌క‌ర్ణి, కె.కె.మీన‌న్, నాజ‌ర్ వంటి యాక్ట‌ర్స్ చేరిక సినిమా రేంజ్‌ను పెంచింది. యూనిక్ ఫిలిం. కొన్ని చోట్ల లిబ‌ర్టీ తీసుకుని చారిత్రాత్మ‌క నిజాలు దెబ్బ తిన‌కుండా సినిమా చేశాం. ఇలాంటి సినిమా చేయ‌డాన్ని నిర్మాత‌లుగా గ‌ర్వ ప‌డుతున్నాం`` అన్నారు.

మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్ నిర్మాత జ‌గ‌న్ మాట్లాడుతూ - ``ఈ సినిమాను ఓంపురిగారికి అంకిత‌మిస్తున్నాం. తెలుగు,తమిళం, హిందీ భాషల్లో ఫిబ్ర‌వ‌రి 17న సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. మూడు భాషల్లో ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యేలా చేయ‌గ‌ల న‌టుడు ఎవ‌రోనని ఆలోచించుకుంటున్న స‌మ‌యంలో రానాగారు ముందుకు రావ‌డం ఆనందంగా ఉంది. సినిమాను గ‌తేడాది జూన్‌లో పూర్తి చేసినా గ్రాఫిక్స్ వ‌ర్క్‌పైనే ఏడు నెల‌లు పాటు వ‌ర్క్ చేశాం. సినిమాలో డెబ్బైశాతం వి.ఎఫ్‌.ఎక్స్ వ‌ర్క్ ఉంటుంది. ఇండియ‌న్ సినిమాలోనే ఫ‌స్ట్ స‌బ్‌మెరైన్ మూవీ ఇది. అండ‌ర్ వాట‌ర్‌లో జ‌రిగిన వార్ గురించి చెప్పే సినిమా`` అన్నారు.

తాప్సీ మాట్లాడుతూ - ``ఇండియ‌న్ సినిమాలో ఫ‌స్ట్ స‌బ్‌మెరైన్ మూవీ. అండ‌ర్ వాట‌ర్‌లో జ‌రిగిన యుద్ధం గురించి చెప్పే చిత్రం కావ‌డంతో నిర్మాత‌లు నాకు చ‌క్క‌గా సూట్ అవుతుంద‌ని చెప్పి ఒప్పించారు. ఈ సినిమాలో పార్ట్ కావ‌డం ఎంతో ఆనందంగా ఉంది. రానాతో గ‌తంలో బేబి, ఆరంభం సినిమాలు చేసినా, మేమిద్దరం క‌లిసి చేసిన మూడు భాష‌ల సినిమా ఇది. ఈ సినిమా కోసం తెలుగులోనే కాదు, త‌మిళం, హిందీ స‌హా దేశం యావత్తు ఆస‌క్తిగా ఎదురుచూస్తుంది`` అన్నారు.

రానా ద‌గ్గుబాటి, కె.కె.మీన‌న్‌, అతుల్ కుల‌క‌ర్ణి, తాప్సీ, నాజ‌ర్‌, ఓంపురి, రాహుల్ సింగ్‌, స‌త్య‌దేవ్‌, ర‌వి వ‌ర్మ‌, ప్రియ‌దర్శి త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి విజువ‌ల్ ఎఫెక్ట్స్ః ఈవా మోష‌న్ స్టూడియోస్‌, స్టంట్స్ః జాషువా, ఎడిట‌ర్ః శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, మ్యూజిక్ః కె, డైలాగ్స్ః గుణ్ణం గంగ‌రాజు, ఆడిష‌న‌ల్ స్టోరీ, స్క్రీన్ ప్లేః గుణ్ణం గంగ‌రాజు, నిరంజ‌న్ రెడ్డి, సౌండ్ డిజైన్‌, మిక్సింగ్ః తాప‌స్ నాయ‌క్‌, ఆర్ట్ః ముర‌ళి ఎస్.వి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః హ‌రి అయినిధి, అసోసియేట్ ప్రొడ్యూస‌ర్ః ఎన్‌.ఎం.పాషా, నిర్మాత‌లుః పివిపి సినిమా-పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, క‌విన్ అన్నె, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్-అన్వేష్ రెడ్డి, జ‌గ‌న్‌మోహ‌న్ వంచ‌, వెంక‌ట ర‌మ‌ణా రెడ్డి, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః సంక‌ల్ప్.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved