pizza
Hyper release on 30 September
సెప్టెంబర్‌ 30న విడుదలవుతున్న 'హైపర్‌'
You are at idlebrain.com > News > Functions
Follow Us

26 September 2016
Hyderaba
d

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో వెంకట్‌ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంటగోపీచంద్‌ ఆచంటఅనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'హైపర్‌' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). సెన్సార్‌ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ పొందిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 30న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌ రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో.....

గోపీచంద్‌ ఆచంట మాట్లాడుతూ ''సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుని `యు/ఎ` సర్టిఫికేట్‌ను పొందింది. సెప్టెంబర్‌ 30న గ్రాండ్‌ రిలీజ్‌ అవుతుంది. హీరో రామ్‌ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ థియేటర్స్‌లో సినిమా రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. యు.ఎస్‌లో 92 థియేటర్స్‌లో సినిమా విడుదలవుతుండగాసెప్టెంబర్‌ 29న యు.ఎస్‌లో ప్రీమియర్‌ షో పడుతుంది. ఈ సినిమాను జూన్‌లో స్టార్ట్‌ చేశాం. 72 రోజుల పాటు షూటింగ్‌ చేశాం. మధ్యలో వైజాగ్‌లో వర్షాల కారణంగా రెండురోజులు,హైదరాబాద్‌లో భారీ వర్షాలు కారణంగా రెండు రోజులు మాత్రం ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే సినిమా సెట్స్‌లోకి వెళ్లడానికి ముందుగానే పక్కా ప్లానింగ్‌తో ఉండటం వల్ల సినిమాను దసరా సందర్భంగా సెప్టెంబర్‌ 30న విడుదల చేస్తున్నాం. రామ్‌సత్యరాజ్‌ సహా యూనిట్‌లోని ప్రతి ఒక ఆర్టిస్ట్‌టెక్నిషియన్‌ బాగా సపోర్ట్‌ చేయడంతో సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేయగలిగాం. మణిశర్మగారు అద్భుతమైన రీరికార్డింగ్‌ను అందించారు. స్క్రిప్ట్‌ను తయారు చేసుకోవడానికే మూడు నెలల సమయం పట్టింది. రామ్‌కు తగ్గ ఎనర్జీ ఉన్న కథ అవసరం అనిపించడంతో మంచి కథ కోసం సమయం తీసుకుని మంచి కథను తయారు చేసుకున్నాం. కథకు తగిన విధంగా అబ్బూరి రవిగారు డెప్త్‌తో కూడిన డైలాగ్స్‌ను అందించారు. అలాగే గౌతంరాజుగారి ఎడిటింగ్‌సమీర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ ఇలా అన్నీ డిపార్ట్‌మెంట్స్‌లో బెస్ట్‌ టీం కుదరడంతో సినిమాను ప్లానింగ్‌ ప్రకారం రిలీజ్‌ చేస్తున్నాం'' అన్నారు.

రామ్‌ ఆచంట మాట్లాడుతూ - ''జూన్‌ 3న సినిమాను స్టార్ట్‌ చేశాం. సినిమా ఇంత ్తత్వరగా విడుదలవుతుందంటే ఏకైక కారణం మా దర్శకుడు సంతోష్‌ శ్రీన్‌వాస్‌. తనను అందరూ వాసు అంటారు కానీ మేం మాత్రం తనను మాసు అంటుంటాం. ఈ సినిమాతో మాసు దర్శకుడుగా మరో మెట్టు పెకెక్కుతాడు. కమర్షియల్‌ యాంగిల్‌లో ఒక మంచి కథను చెప్పడం తనకున్న పెద్ద ప్లస్‌ పాయింట్‌. రామ్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ఫ్రౌడ్‌ మూవీ అవుతుంది. అలాగే మా 14 రీల్స్‌ బ్యానర్‌లో వస్తున్న మరో బెస్ట్‌ మూవీ అవుతుంది. సినిమా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తోయాక్షన్‌తో పాటు కొత్త యాంగిల్‌ కూడా ఉంటుంది. అదేంటనేది సినిమాలో మీరే చూసి తెలుసుకోవాలి'' అన్నారు.

అనీల్‌ సుంకర మాట్లాడుతూ - ''కొన్నిసినిమాలు హ్యాపీనిస్తాయిమరికొన్ని ఫ్రౌడ్‌నిస్తాయి. సినిమా మంచి లాభాలను నిస్తే హ్యాపీగా ఉంటుంది. లాభాలతో పాటు ఇలాంటి మంచి సినిమాను మా బ్యానర్‌లో చేశామని చెప్పడం ఫ్రౌడ్‌గా ఉంటుంది. మా14రీల్స్‌ బ్యానర్‌లో వస్తున్న మరో ఫ్రౌడ్‌ మూవీ 'హైపర్‌'. సినిమా చూడగానే దూకుడు సినిమా చూసిన ఫీలింగ్‌ కలిగింది. ఈ సినిమా ఇంత బాగా రావడానికి 99 శాతం క్రెడిట్‌ దర్శకుడు సంతోష్‌ శ్రీన్‌వాస్‌కే దక్కుతుంది. తండ్రి కొడుకులు కలిసి థియేటర్స్‌కు రావడానికి ఓ కంటెస్ట్‌ పెడుతున్నాం. థియేటర్‌కు వచ్చే తండ్రి కొడుకులకు టికెట్‌తో పాటు ఓ కూపన్‌ ఇస్తాం. ఆ కూపన్‌లోని వివరాలను పూర్తి చేసి ఇవ్వాలి. ఆ కూపన్స్‌ను టాలీవుడ్‌ హీరోలువారి తనయులతో కలిసి డ్రా తీస్తారు. గెలిచిన వారికి 5 లక్షల రూపాయలను పిల్లవాడి చదువుకోసం 14 రీల్స్‌ బ్యానర్‌ అందజేస్తుంది'' అన్నారు.

దర్శకుడు సంతోష్‌ శ్రీన్‌వాస్‌ మాట్లాడుతూ - ''హైపర్‌ మూవీ సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా ఆనందంగా ఉంది. కుటుంబంలో తండ్రికొడుకులు సహా అందరూ కనెక్ట్‌ అయ్యే సినిమా. రామ్‌తో కందిరీగ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో బెస్ట్‌ సినిమా చేయాలని బాగా ఆలోచించి ఈ హైపర్‌ కథను తయారు చేసుకున్నాను. నిర్మాతలు మేకింగ్‌లో పిల్లర్స్‌లా నిలబడి ఎంతగానో సపోర్ట్‌ చేశారు. అలాగే సమీర్‌రెడ్డిఅబ్బూరి రవిగౌతంరాజుగారుమణిశర్మజిబ్రాన్‌ వంటి టెక్నిషియన్స్‌ సపోర్ట్‌తో . మంచి సినిమా చేశామని చెప్పగలను. టీం అంతా సినిమా బాగా రావడానికి మంచి ఎఫర్ట్‌ పెట్టి పనిచేశారు. బిబ్రాన్‌ ఆడియో మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. ప్రతి కొడుక్కి తండ్రంటే ఇష్టం ఉంటుంది. కానీ అది బయటకు చెప్పలేని సిచ్యువేషన్‌లో ఉంటారు. కానీ అలా కాకుండా తండ్రంటే ప్రేమను తెలియజేసే కొడుకు కథే మా హైపర్‌. సినిమాలో అన్నీ ఎలిమెంట్స్‌తో పాటు మంచి మెసేజ్‌ కూడా ఉంటుంది'' అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved