pizza
Ippatlo Ramudila Seethala Evaruntaarandi Babu press meet
అక్టోబ‌ర్ 27న `ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబు`
You are at idlebrain.com > News > Functions
Follow Us

16 October 2017
Hyderabad

శివ సాయి సమర్పణలో లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్ బేన‌ర్‌పై నిర్మాత ప్రశ్నాద్ తాతా నిర్మిస్తున్న చిత్రం `ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబు` . మహీదర్, ఇషితా, ప్రశాంత్, లలిత ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి వెంకటేష్ కె. దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబ‌ర్ 27న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో సోమ‌వారం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో...

నిర్మాత ప్రశ్నాద్ తాతా మాట్లాడుతూ ``ఇదే సారథి స్టూడియోలో స్టూడెంట్స్‌గా ఉన్నామేము నేడు స్టేజి ఎక్కి సినిమా గురుంచి మాట్లాడటం సంతోషంగా ఉంది. ఇప్పట్లో రాముడిలా సీతలా ఉండాలని ప్రతి ఒక్కరు ఎలా అనుకుంటారో అదే ఈ సినిమాలో మేము చూపించడం జరిగింది. ఈ చిత్రానికి గానూ కొత్త విలన్ ను పరిచయం చేయడం జరుగుతోంది. కథ కథనాలకు ప్రాధాన్యత ఉన్న మా సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నా. అలానే ఈ చిత్రానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలను తెలియచేస్తున్నాను`` అన్నారు. దర్శకుడు వెంకటేష్ మాట్లాడుతూ ``ఈ చిత్రం కంప్లీట్ యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. వైజాగ్, నెల్లూరు తదితర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 27న విడుదల చేస్తున్నాం. మాకు సహాయసహకారాలు అందించిన రాదా కృష్ణ గారికి ఈ సందర్బంగా కృతజ్ఞతలను తెలియచేస్తున్నాం`` అన్నారు.

మ‌హిధ‌ర్ మాట్లాడుతూ ``ఈ చిత్రం లో మెయిన్ రోల్ లో చేస్తున్నాను. టైటిల్ ఎంత డిఫరెంట్ గా ఉంటుందో చిత్ర కథాంశం కూడా అంతే డిఫరెంట్ గా ఉంటుంది, అన్ని పాత్రలకు సమానమైన ఇంపార్టెంట్స్ ఉంటుంది. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో నటించే అవకాశం వచ్చింనందుకు సంతోషంగా ఫీల్ అవుతున్న అదేవిదంగా ఈ సినిమాలో నటించిన మరో హీరో ప్రశాంత్ ఇటీవలే మరణించడం బాధాకరమైన విషయం`` అని తెలిపారు

హీరోయిన్ ఇషిత మాట్లాడుతూ ``కొత్త వారు అందులోనూ భాష సమస్య ఉంటుందనే అపోహ అందరిలోనూ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఏమాత్రం చూపించకుండా నన్ను సపోర్ట్ చేసిన దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలు`` అన్నారు.

డ్యాన్స్ మాస్ట్సర్ జోజో మాట్లాడుతూ ``యూత్ ఫుల్ ఎంటర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాంగ్స్ చాలా బాగొచ్చాయి. మంచి మెసేజ్ కూడా ఈచిత్రంలో ఉంది. మొదట్లో భయపడ్డాను కొత్తవారితో ఎలా డాన్స్ చేయించాలా అని ఆ తరువాత అందరూ బాగా సపోర్ట్ చేయడం తో కొరియోగ్రఫీ చేయడం సులువుగా అనిపించింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు`` అని అన్నారు.

నటుడు బాబు మాట్లాడుతూ ``టైటిల్ ఎంత డిఫరెంట్ గా ఉంటుందో సినిమా కూడా అంతే డిఫరెంట్ గా ఉండి అందరినీ ఆకట్టుకుంటుంది`` అని అన్నారు. మహీధర్, ఇషిత, ప్రశాంత్, లలిత, రామ్ జగన్, వైభవ్ సూర్య, జబర్దస్త్ భాస్కర్, తరణి, కిరణ్, బాబు తులసి, నందిని, మధు, జిఎస్ ఆర్, పవన్, రాధాకృష్ణ తీరుమాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎ. జగన్, పాటలు: చైతన రాపేటి, సంగీతం: రామేష్ డి. రీ రికార్డింగ్: డా. జోశ్యభట్ల, ఎడిటింగ్: సత్య గిడుతూరి, స్టిల్స్: మోహన్ బాబు.ఎం, గ్రాఫిక్స్: ఇంద్ర, ఫైట్స్: అహమ్మెద్, డాన్స్: జోజో, నిర్మాత: ప్రశ్నాద్ తాతా, రచన- దర్శకత్వం: వెంకటేష్.కె.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved