pizza
Jawan release on 1 December - press meet
`జ‌వాన్` సాంగ్ రిలీజ్
You are at idlebrain.com > News > Functions
Follow Us

2 November 2017
Hyderabad

సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ ఫిర్జాదా జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వ‌హిస్తున్నచిత్రం `జవాన్`. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమా సాంగ్ రిలీజ్ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో

ద‌ర్శ‌కుడు బివిఎస్ ర‌వి మాట్లాడుతూ - ``మా నాన్న‌గారు ఈ మ‌ధ్య లోకం విడిచి పెట్టి వెళ్లిపోయారు. ఆయ‌న త‌ర్వాత న‌న్ను అలా గైడ్ చేసిన వ్య‌క్తి దిల్‌రాజుగారు మాత్ర‌మే. ఆయ‌న‌కు ఈ సంద‌ర్భంగా థాంక్స్‌. థ‌మ‌న్ ఈ సినిమాకు చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ధ‌తో థ‌మ‌న్ మ్యూజిక్ ఇచ్చాడు. ఎక్స్‌ట్రార్డిన‌రీ మ్యూజిక్ అందించాడు. గుహ‌న్‌గారు అద్భుత‌మైన విజువ‌ల్స్ అందించారు. కృష్ణ‌గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. చాలా గ్యాప్ త‌ర్వా ఈ సినిమాకు డైరెక్ట‌ర్ కావ‌డానికి తేజు కూడా కార‌ణ‌మే. క‌థ విన‌గానే మీరు డైరెక్ట్ చేయండి, నేను సినిమా చేస్తాను`` అన్నారు.

సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ - ``దిల్‌రాజుగారు, కృష్ణ‌గారు సినిమాకు ఏదీ అవ‌స‌ర‌మో దాన్ని యూనిట్‌కి స‌కాలంలో అందించి ఓ మంచి సినిమా చేయ‌డంలో అందరినీ ముందుకు న‌డిపారు. థ‌మ‌న్‌తో నేను క‌లిసి చేస్తోన్న సినిమా ఇది. డైరెక్ట‌ర్ ర‌విగారితో నాకు సుప్రీమ్ నుండి ఈ సినిమాకు సంబంధించిన జ‌ర్నీ కొనాసాగుతుంది. డిసెంబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం`` అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ - ``నాకు నిర్మాత‌తో కృష్ణ‌తో ఇడియ‌ట్ సినిమా నుండి ప‌రిచ‌యం ఉంది. ఈ సినిమాను నేను స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌న కోసం ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. అలాగే నా భ‌ద్ర సినిమాకు రైట‌ర్‌గా ప‌నిచేసిన బివిఎస్ ర‌వి, త‌ర్వాత మున్నా, ప‌రుగు, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ సినిమాల‌కు రైట‌ర్‌గా ప‌నిచేశాడు. అలాగే నేను, తేజు క‌లిసి మూడు స‌క్సెస్‌ఫుల్ మూవీస్ చేశాం. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే, జ‌వాన్ అన‌గానే..ఆర్ఎస్ఎస్‌కు చెందిన కుర్రాడు త‌న ఫ్యామిలీని కాపాడుకోవ‌డానికి ఏం చేశాడ‌నేదే క‌థ‌. గుడ్ ల‌వ్ అండ్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఇది దేశానికి సంబంధించిన క‌థ కాదు, ఓ కుర్రాడి కుటుంబానికి చెందిన క‌థ‌. థ‌మ‌న్ ఈ సినిమాకు అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చాడు. మా ప్ర‌య‌త్నం డిసెంబ‌ర్ 1న జ‌వాన్ రూపంలో విడుద‌ల‌వుతుంది`` అన్నారు.

ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ మాట్లాడుతూ - ``కృష్ణ‌న్నతొలి సినిమాకు నేను సంగీతం అందించ‌డం ఆనందంగా ఉంది. నాకు త‌మ్ముడు తేజుతో చేస్తున్న నాలుగో సినిమా. ఇప్పుడు రిలీజ్ చేసిన సాంగ్‌ను శ్రీమ‌ణి చ‌క్క‌గా రాశాడు. సినిమాను డిసెంబ‌ర్ 1న విడుద‌ల చేస్తున్నారు`` అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved