pizza
Jayanthi press meet
ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతున్న 'జయంతి' - ఫణిరాజ్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

30 January 2017
Hyderaba
d

ఫణి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఫణిరాజ్‌, శిఖామల్హోత్ర నటీనటులుగా రూపొందుతోన్న చిత్రం 'జయంతి'. ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి దర్శక నిర్మాత కె.ఫణిరాజ్‌ తెలియజేశారు. ఈ సందర్భంగా..

హీరో, దర్శకనిర్మాత ఫణిరాజ్‌ మాట్లాడుతూ ...''చిన్నప్పట్నుంచి సినిమాలంటే చాలా పిచ్చి. నేను బేసిక్‌గా జ్యోతిషుణ్ణి. నేను ఇండస్ట్రీకి 12 ఏళ్ళ క్రిందటే వచ్చాను. ఒకట్రెండు సినిమాల్లో కూడా నటించాను. అయితే పని ఒత్తిడి వల్ల చాలా గ్యాప్‌ తీసుకున్నాను. ఇప్పుడు సోలోగా చేస్తున్న సినిమా జయంతి. నాకు సాధారణంగా ఫైట్స్‌ అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో ఫైట్స్‌ను రిచ్‌గా ఉండేలా ప్లాన్‌ చేశాను. ఇది హర్రర్‌ మాత్రమే కాదు, కమర్షియల్‌ హంగులన్నీ ఉన్న చిత్రం. సిచ్యువేషన్స్‌కు తగ్గట్టు ఫైట్స్‌ కంపోజ్‌ చేశాం. సన్నివేశాలకు తగిన విధంగా కామెడి కూడా యాడ్‌ చేశాం. హర్రర్‌లో కొత్తదనం ఉండాలని హెడ్‌లెస్‌ దెయ్యం కాన్సెప్ట్‌తో వెళ్ళాం. ఎన్టీఆర్‌గారి కదలడు-వదలడు చిత్రంలోని సన్నివేశాలను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని హెడ్‌లెస్‌ దెయ్యం కాన్సెప్ట్‌ను పెట్టాం. ఈ చిత్రంలో బ్రహ్మానందం, అలీ, పోసాని చేసే కామెడి ఆడియెన్స్‌ను అలరిస్తుంది. మంచి టెక్నిషియన్స్‌ దొరక్కపోవడంతో సినిమా ఆలస్యం అయ్యింది. అందుకనే మంచి టీంను వెతుక్కుని సినిమా కంప్లీట్‌ చేశాను. ఈ సినిమాను ఫిబ్రవరిలో చేయాలనుకుంటున్నాను. సీజీ వర్క్‌ చాలా బాగా వచ్చింది. ఫిబ్రవరి 10న నా రెండో సినిమా స్టార్ట్‌ అవుతుంది. ఆ సినిమా పేరు 'భార్యే దెయ్యం'. బిజినెస్‌ పరంగా ఎటువంటి ఆటంకం జరగలేదు. సినిమా విజయంపై మంచి నమ్మకం ఉంది. ఈ సినిమా చిత్రీకరించే టైంలో అన్నీ భాషల్లోని బెస్ట్‌ సన్నివేశాలను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని చేశాం. ఈ సినిమా చేసేటప్పుడు హీరో పడే ప్రెషర్‌ ఏంటో నాకు తెలిసింది'' అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved