Khaidi No. 150 collects 108.48 cr in 7 days
At a press event arranged today in Grand Ball Room of Taj Krishna, Allu Arvind has announced the collections of Khaidi No. 150. This film is also the fastest 100 cr film. Here are the details of the collections
Twin Telugu states (AP+T)
76.15 cr
Karnataka
9 cr
North India
1.43 cr
Orissa
0.4 cr
Tamilnadu
0.6 cr
North America
17 cr
Rest of the world
3.9 cr
Total gross for 7 days:
108.48cr
మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా రూపొందిన చిత్రం `ఖైదీ నంబర్ 150`. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదలైంది. గ్రాండ్ హిట్ మూవీగా వందకోట్లకు పైగా కలెక్షన్స్‌ను సాధించింది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....
అల్లు అరవింద్ మాట్లాడుతూ - ``మరో నాలుగు రోజుల్లో కృతజ్ఞతాభినందన సభను ఏర్పాటు చేసి సినిమాలో పనిచేసిన వారికి డిస్ట్రిబ్యూటర్స్ సహా అందరికీ అభినందనలు తెలియజేస్తాం. రిలీజ్ అయిన తర్వాత ఫాస్టెస్ట్ 100 కోట్ల గ్రాస్‌ను సాధించిన చిత్రమైంది. ఏడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 76 కోట్ల 15 లక్షల నాలుగు వేల రూపాయలను, కర్ణాటకలో 9 కోట్లు, నార్త్ ఇండియాలో కోటి 43 లక్షలు నార్త్ అమెరికాలో 17 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ది వరల్డ్‌లో 3 కోట్ల 96లక్షలు, ఒరిస్సాలో 40లక్షలు, ఇలా మొత్తంగా 108కోట్ల 48లక్షల రూపాయలను సాధించి మొదటివారంలో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. చిరంజీవిగారు పునః ప్రవేశంఇంత పెద్ద సక్సెస్‌తో ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్`` అన్నారు.
వి.వి.వినాయక్ మాట్లాడుతూ - `` అన్నయ్య 150వ సినిమా ఖైదీ నంబర్ 150ను పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. ఈ సంక్రాంతి చాలా ఆనందంగా జరుపుకున్నాను. అన్నయ్యపై ప్రేమను ప్రజలు కలెక్ష్స్ రూపంలో చూపిస్తున్నారు. చాగల్లు అనే మా చిన్న ఊరిలో ఐదు లక్షలు పైగా కలెక్షన్స్‌ను సాధించదంటే సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అర్థం చేసుకోండి. కత్తిలాంటి మంచి కథను ఇచ్చిన మురుగదాస్ గారికి థాంక్స్. సాధారణంగా సినిమా సక్సెస్‌లో కథభాగం 51శాతం అయితే సినిమా ప్రారంభంలో అన్నయ్య అందంగా కనపడితే 51 శాతం అనుకున్నాను. ఆయన సినిమా కోసం చాలా కష్టపడి చాలా అందంగా కనపడ్డారు. ఆయన్ను చూడగానే చూడాలని ఉంది సినిమాలో చిరంజీవిలా ఉన్నారని అన్నాను. ఆయన డ్యాన్సులు, టైమింగ్ ప్రతిది చాలా కొత్తగా కనపడింది. రత్నవేలుగారు చిరంజీవిగారిని, ప్రతి సన్నివేశాన్ని అందంగా చూపించారు. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్నిచ్చారు. నీరు నీరు ..పాట విన్నవారందరూ ఇళయరాజాగారు, కీరవాణిగారిని దేవి గుర్తుకు తెచ్చాడని అన్నారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్బ్‌గా ఇచ్చాడు. చిరంజీవిగారు ఎలా కనపడతారో, ఎలా నటిస్తారోనని సినిమాకు ముందు లక్ష ప్రశ్నలు వచ్చాయి. అయితే ఆయన వాటన్నింటినీ ఫస్ట్ షాట్‌తోనే పటాపంచలు చేశారు. పరుచూరి బ్రదర్స్, తోటతరణి, సాయిమాధవ్ బుర్రా, వేమారెడ్డి సహా ప్రతి ఒక టెక్నిషియన్, యాక్టర్ అందరూ తమ వంతుగా సపోర్ట్ అందించారు. ఒరిజినల్ కన్నా మేకింగ్ పరంగా ఇంకా డెప్త్‌కు వెళ్లాం. వచ్చే సినిమాలో అన్నయ్య ఇంకా అందంగా కనపడతారు ఈ సక్సెస్ అన్నయ్యలో కొత్త ఉత్సాహానిచ్చింది. అలాగే సినిమా బావుందని ట్వీట్ చేసిన రాజమౌళిగారికి, మహేష్‌గారికి థాంక్స్. ఈ సినిమాను ఇంతలా ఆదరిస్తున్న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు థాంక్స్`` అన్నారు.