pizza
London Babulu press meet
నవంబ‌ర్ 10న `లండ‌న్‌బాబులు`
You are at idlebrain.com > News > Functions
Follow Us

24 October 2017
Hyderabad

ర‌క్షిత్, స్వాతి జంట‌గా రూపొందిన చిత్రం `లండ‌న్ బాబులు`. చిన్నికృష్ణ ద‌ర్శ‌కుడు. మారుతి నిర్మాత‌. ఏవీఎస్ స్టూడియో స‌మ‌ర్ప‌ణ‌లో మారుతి టాకీస్ ప‌తాకంపై సినిమా నిర్మిత‌మైంది. న‌వంబ‌ర్ 10న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...

మారుతి మాట్లాడుతూ - ``చాలా రోజుల క్రిత‌మే సినిమా పూర్త‌య్యింది. ఫ‌స్ట్‌కాపీ కూడా రెడీ అయ్యింది. అయితే మంచి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేశాం. న‌వంబ‌ర్ 10న సినిమా విడుద‌ల కానుంది. ర‌క్షిత్‌, స్వాతి న‌టించారు. ర‌క్షిత్ బాగా చేశాడ‌ని అంద‌రూ అంటున్నారు. ఈ సినిమాను జీ తెలుగువాళ్లు చూసి శాటిలైట్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నారు. సినిమా చూసిన వారంద‌రూ అప్రిసియేట్ చేశారు. సినిమాలో అవ‌స‌ర‌మైన ఎంట‌ర్‌టైన్మెంట్ క‌న‌ప‌డుతుంది. ప్ర‌తి ఒక్క‌రూ బాగా పెర్ఫామ్ చేశాడు. `అండ‌వ‌న్ క‌ట్ట‌లై` అనే త‌మిళ సినిమాను తెలుగులో `లండ‌న్‌బాబులు`గా రీమేక్ చేశాం. అన్నీ వర్గాల ప్రేక్ష‌కులు చూసే సినిమా ఇది.ఇలాంటి మంచి సినిమాను అంద‌రూ ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

చిన్నికృష్ణ మాట్లాడుతూ ``సినిమాల‌కు దూరంగా వైజాగ్‌లో ఉన్న న‌న్ను పిలిచి మారుతిగారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు. పావుగంట క‌థ విని నిఖిల్ నాకు వీడుతేడా అవ‌కాశ‌మిచ్చారు. స్వీట్‌మేజిక్ వాళ్ల అబ్బాయిని ఇంట్ర‌డ్యూస్ చేయ‌డం ఆనందంగా ఉంది. నాకు ముందు వినాయ‌కుడిలా, వెనుక మారుతిగారే స‌పోర్ట్‌గా నిలిచారు. మంచి వినోదాత్మ‌క చిత్ర‌మిది. లండ‌న్ వెళ్లాల‌నుకున్న ఓ యువ‌కుడి క‌థ ఇది.నంవ‌బ‌ర్ 10న సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది. న‌వంబ‌ర్ 4న ప్రీ రిలీజ్ వేడుక నిర్వ‌హించ‌బోతున్నాను`` అన్నారు.

ధ‌న‌రాజ్ మాట్లాడుతూ - ``నేను ఈ సినిమా ప్రివ్యూ చూశాను. సినిమా బాగా వ‌చ్చింది. చిన్ని సినిమాను అందంగా, అద్భుతంగా తీశాడు. ర‌క్షిత్ కొత్త‌వాడైనా, స్వాతి వంటి సీనియ‌ర్ న‌టితో బాగా చేశాడు. నేను, స‌త్య మంచి రోల్స్ చేస్తాం. నవంబ‌ర్ 10న సినిమా రిలీజ్ అవుతుంది`` అన్నారు.

ఆలీ, ముర‌ళిశ‌ర్మ‌, రాజార‌వీంద్ర‌, జీవా, ధ‌న‌రాజ్‌, స‌త్య‌, అజ‌య్ ఘోష్, ఈరోజోల్లో సాయి, వేణు, స‌త్య‌కృష్ణ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి

సినిమాటోగ్రాఫర్ - శ్యామ్ కె నాయుడు, మ్యూజిక్ - కె, ఎడిటర్ - ఎస్.బి.ఉద్దవ్, కో డైరెక్టర్ - కొప్పినీడి పుల్లారావు, ఆర్ట్ డైరెక్టర్ - విఠల్ కోసనం

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - కిరణ్ తలసిల, దాసరి వెంకట సతీష్.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved