శ్రీమతి బొడ్డు లక్ష్మి సమర్పణలో ఈస్ట్‌వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్‌కార్తీక్, సనాఖాన్ హీరో హీరోయిన్లుగా విశాఖ థ్రిల్లర్ వెంకట్ దర్శకత్వంలో వరప్రసాద్ బొడ్డు నిర్మిస్తున్న చిత్రం `మామ..ఓ..చందమామ`. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మ్యూజిక్ డైరెక్టర్ మున్నాకాశీ, సినిమాటోగ్రాఫర్ జి.ఎల్.బాబు, ఎడిటర్ మాధవ్, ఆర్ట్ డైరెక్టర్ ఉత్తర్ కుమార్, శ్రీధర్, దీపిక కాకర్ల, అనీషా, డైరెక్టర్ విశాఖ థ్రిల్లర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా....
దర్శకుడు విశాఖ థ్రిల్లర్ వెంకట్ మాట్లాడుతూ - ``నవంబర్ 11న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను పసలపూడిలో స్టార్ట్ చేశాం. హీరో రామ్‌కార్తీక్, సనాఖాన్ సహా నటీనటులు, టెక్నిషియన్స్ అందించిన సపోర్ట్‌తో సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేశాం. ఈ నెలాఖరున రెండోషెడ్యూల్ను స్టార్ట్ చేస్తాం. బి.ఎ.రాజుగారి సహకారం కూడా మరువలేము. మున్నా కాశీ మంచి మ్యూజిక్ అందించాడు. కుటుంబ విలువలతో కూడిన కామెడి ఎంటర్టైనర్గా సినిమా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది`` అన్నారు.
హీరో రామ్‌కార్తీక్ మాట్లాడుతూ - ``సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. సినిమాటోగ్రాఫర్ బాబుగారు కోనసీమ అందాలను చక్కగా చూపిస్తున్నారు. డైరెక్టర్ వెంకట్‌గారు మంచి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్‌ను చక్కగా చిత్రీకరిస్తున్నారు. ఫిభ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాం. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాం`` అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సినిమా పెద్ద సక్సెస్ కావాలని ఆకాంక్షించారు.