`పెళ్ళిచూపులు` లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన నిర్మాత రాజ్ కందుకూరి నిర్మిస్తున్న తాజా చిత్రం `మెంటల్ మదిలో`. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకుడు. ఈ సినిమా ప్రెస్‌మీట్ శనివారం హైదరాబాద్‌లోజరిగింది. ఈ సందర్బంగా..
నిర్మాత రాజ్‌కందుకూరి మాట్లాడుతూ - ``సినిమా ఆడియెన్స్‌ను కనెక్ట్ అయితే మ్యాజిక్ జరుగుతాయి. ఈ మ్యాజిక్ జరగడానికి సపోర్టింగ్ సిస్టమ్ అవసరం. ఆ సపోర్ట్ కోసం నేను సురేష్‌బాబుగారిని సినిమా చూడమని అడిగినప్పుడు ఆయన సరేనని సినిమా చూశారు. కొన్ని చేంజస్ చెప్పారు. దర్శకుడు వివేక్ ఆ చేంజస్ చేస్తున్నారు. హీరో ఎంత ఇంట్రావర్ట్ పర్సన్, ఎంత సిగ్గరి, అతని జీవితంలో అతనెలా ఇబ్బందులు పడుతున్నాడు. కన్‌ఫ్యూజన్ వల్ల హీరో ఎలా నష్టపోతున్నాడనే విషయాన్ని దర్శకుడు చక్కగా ప్రెజంట్‌చేశాడు. తరుణ్‌భాస్కర్ నన్ను కలిసి నాకు కథ ఎలా చెప్పాడో అలాగే వివేక్, నాకు కాఫీ షాప్‌లో కథ చెప్పాను. నేను వివేక్‌ను సురేష్‌బాబుగారికి పరిచయం చేశాను. కథ విన్న ఆయన బావుందమ్మా, సినిమా చేయండి చూద్దాం అని అన్నారు. ఇప్పుడు సినిమా చూసిన తర్వాత బావుందనగానే మేం యాభై శాతం సక్సెస్ అయినట్లు భావించాం. వివేక్ ఆత్రేయ కొన్ని షార్ట్ ఫిలింస్ చేశాడు. తను ఐబిఎం ఉద్యోగి. ఈ సినిమాలో పనిచేసిన టెక్నిషియన్స్ అందరూ స్నేహితులే. మంచి యూత్ టీం నా వద్దకు వచ్చినప్పుడు నేను సపోర్ట్ చేశాం. మొన్న ఓ 30 మందికి షో వేశాం. అందులో దాదాపు అందరూ సినిమా హాంటిగ్‌గా ఉందని అన్నారు. అందరి సహకారం ఉంటుందని భావిస్తున్నాం`` అన్నారు.
మధుర శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ - ``గత ఏడాది విడుదలైన పెళ్ళిచూపులు చిత్రాన్ని సురేష్‌బాబుగారు ఏ రేంజ్‌కు తీసుకెళ్లారో నాకు బాగా తెలుసు. ఆయన్ను ఓ హెడ్ మాస్టర్‌లా భావిస్తుంటాను. నాకు ఏదైనా ఓ సినిమా ఆలోచన వస్తే, సురేష్‌బాబుగారిలా ఆలోచించడం నేర్చుకుంటున్నాను. ఆయన ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. మధుర ఆడియో ద్వారా సినిమా పాటలు రావడం ఆనందంగా ఉంది`` అన్నారు.
దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ - ``కల నిజమైంది. షార్ట్ ఫిలింస్ చేసిన నా సినిమాను సురేష్‌బాబుగారు విడుదల చేస్తుండటం చాలా గొప్ప విషయం. పెళ్ళిచూపులు స్టార్ట్ కాకముందే నేను రాజ్‌కందుకూరిగారికి కథ చెప్పాను. పెళ్ళిచూపులు సక్సెస్ తర్వాత మళ్ళీ సినిమా చేయడంతో ఆయన కాస్తా రిస్క్ తీసుకున్నారనే భావిస్తున్నాను. నా టీం అంతా బాగా సపోర్ట్ చేశారు, అందరికీ థాంక్స్`` అన్నారు.