19 September 2016
Hyderabad
వరుణ్ సందేశ్, ప్రియాంక భరద్వాజ్ జంటగా సాన్వి క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో గజ్జల హరికుమార్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం `మిస్టర్ 420`. ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదలవుతున్న నేపథ్యంలో మంగళవారం చిత్రయూనిట్ హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా....
చిత్ర నిర్మాత గజ్జల హరికుమార్ రెడ్డి మాట్లాడుతూ - ``సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని `యు/ఎ` సర్టిఫికేట్ పొందింది. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాను సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నాం. సినిమాలో హీరో చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్‌ను చూడగానే ప్రేమలో పడతాడు. అనుకోని ఘటనతో హీరో జీవితం మలుపు తిరుగుతుంది. అదేంటనేదే సినిమా. వరుణ్ సందేశ్ సహకారం మరచిపోలేను. వరుణ్ సందేశ్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీ అవుతుందనే నమ్మకం ఉంది. హీరోయిన్ ప్రియాంక ముంబై నుండి తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా తర్వాత వరుణ్ సందేశ్‌తో మా బ్యానర్‌లో రెండో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. దర్శకుడు ఎస్.ఎస్.రవికుమార్ సినిమాను బాగా తెరకెక్కించారు. సినిమాటోగ్రాఫర్ జశ్వంత్ అద్భుతమైన విజువల్స్ ను తీశారు. ముస్తఫా సంగీతానికి చాలా మంచి స్పందన వచ్చింది. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది`` అన్నారు.
Glam gallery from the event |
|
|
|
హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ - ``సినిమాలో అవినాష్ అనే యువకుడి పాత్రలో కనపడతాను. చిన్న చిన్నదొంగతనాలు చేసే హీరో జీవితంలో ఏం జరిగిందనేదే సినిమా. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా బాగా రావడానికి రీషూట్ కూడా చేశాం. సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. సినిమాను సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నాం. ముస్తఫా సంగీతానికి మంచి స్పందన వచ్చింది. అన్నీ పాటలు బావున్నాయి. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాను. అందులో ఒక చిత్రంలో రైతు పాత్ర చేస్తున్నాను. రామూర్తి దర్శకుడు. ఇక రెండో సినిమా రాఘవేంద్రరావుగారి వద్ద పనిచేసిన సత్యనారాయణగారి దర్శకత్వంలో చేస్తున్నాను`` అన్నారు.
హీరోయిన్ ప్రియాంక భరద్వాజ్ మాట్లాడుతూ - ``మిస్టర్ 420 సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నందకుఉ హ్యాపీగా ఉంది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను పెద్ద హిట్ చేసి నన్ను ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను`` అన్నారు.
నటీనటులు
వరుణ్ సందేశ్, ప్రియాంక భరద్వాజ్, సాయాజి షిండే, రఘు బాబు, పృథ్వీ (30 ఇయర్స్), సాయి (ఈరోజుల్లో) షాని, శేఖర్ (ఛత్రపతి), జీవా, రఘు కారమంచి, రచ్చ రవి,మీనా
టెక్నీషియన్స్
కొరియో గ్రాఫర్ - రఘు, స్వర్ణ, శేఖర్, సుధీర్ , స్టంట్స్ – నందు, లిరిక్స్ - చంద్రబోస్, అనంత శ్రీరామ్
ఎడిటింగ్ - నందమూరి హరి, సినిమాటోగ్రాఫర్ - జశ్వంత్ , మ్యాజిక్ - రియాన్ ముస్తఫా, డైలాగ్స్ - మోహన్ చంద్ర
డైరెక్టర్ - ఎస్.ఎస్.రవికుమార్, ప్రొడ్యూసర్ - హరికుమార్ రెడ్డి గజ్జల.