13 October 2016
Hyderabad
వరుస చిత్రాల నిర్మాణంతో పాటు, డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ బిజీగా ఉన్నారు మల్కాపురం శివకుమార్. ప్రస్తుతం ఆయన `నాగభరణం` చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. 40 కోట్ల భారీ బడ్జెట్‌తో అద్భుతమైన గ్రాఫిక్స్‌తో విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పెన్ మూవీస్, ఇన్‌బాక్స్ పిక్చర్స్, బ్లాక్‌బస్టర్ స్టూడియో పతాకాలపై జయంతి లాల్ గాడా, సాజిద్ ఖురేషి, సొహైల్ అన్సారీ నిర్మిస్తున్నారు. సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్ మీడియాపై అక్టోబర్ 14న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా గురువారం మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ``తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతోందీ చిత్రం. మా సురక్ష్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై విడుదల చేస్తున్నాం. విజువల్ వండర్‌గా ఉంటుంది చిత్రం. రీరికార్డింగ్ చేసినప్పుడు చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. మకుట సంస్థ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దింది. లేని మనిషిని సృష్టించి ఇందులో అద్భుతం చేశారు. అమ్మోరు, అరుంధతి చిత్రాలు మహిళలను ఎలా ఆకట్టుకున్నాయో, అలా ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఆ చిత్రాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉందీ చిత్రం. గతంలో అక్టోబర్ నెలలోనే `కార్తికేయ` చిత్రాన్ని విడుదల చేశాం. ఇప్పుడ ఈ సినిమాలోనూ పాము ఉంది. ఈ చిత్రం కూడా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. టీజర్, ట్రైలర్ లాంఛ్ అయ్యాక ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. ట్రైలర్‌తో పోలిస్తే సినిమా 100 రెట్లు బాగా వచ్చింది. 500 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ఓవర్సీస్‌లోనూ విడుదల చేస్తున్నాం`` అని తెలిపారు.