3 December 2016
Hyderabad
'టాటా బిర్లా మధ్యలో లైలా' చిత్రంతో నిర్మాతగా విజయవంతంగా ప్రయాణం ఆరంభించిన బెక్కెం వేణుగోపాల్ (గోపి) అప్పట్నుంచీ వరుసగా పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. లక్కీ మీడియా ఇటీవలే పదేళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంస్థ నుంచి ఇటీవల వచ్చిన 'సినిమా చూపిస్త మావ' ఘనవిజయం సాధించింది. తాజాగా ఈ సక్సెస్‌ఫుల్ బ్యానర్ నుండి దర్శకుడు సుకుమార్ నిర్మించిన 'కుమార్ 21 ఎఫ్'తో బోల్డంత పాపులార్టీ తెచ్చుకున్న హెబ్బా పటేల్ కథానాయికగా లక్కీమీడియా బ్యానర్‌పై భాస్కర్ బండి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్`. ఈ సినిమాను డిసెంబర్ 16న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
దిల్‌రాజు మాట్లాడుతూ - ``కొత్త బంగారు లోకం సినిమా విడుదలైనప్పుడు కొత్తలో సినిమాపై ఓ రకమైన డిస్కషన్ జరిగింది. టీనేజ్ లవ్‌స్టోరీ గురించి సినిమాలో చూపించడం ఎంత వరకు కరెక్ట్ అని అందరూ అనుకున్నారు. కానీ కొత్త బంగారు లోకం నాకు ఎలాంటి రిజల్ట్‌ను తెచ్చి పెట్టిందో అందరికీ తెలిసిందే. అయితే కొత్త బంగారు లోకం లైన్ విన్నప్పుడు నేను ఎలాగైతే ఫీలయ్యానో నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ లైన్ విన్నప్పుడు కూడా అలానే ఫీలయ్యాను. నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ టైటిల్ వినగానే ఇదేదో అమ్మాయిలు, అబ్బాయిలకు సంబంధించిన సినిమా అనుకుంటారు. కానీ ఈ సినిమాను యూత్ ఎంత ఎంజాయ్ చేస్తారో ఫ్యామిలీ ఆడియెన్స్ అంత బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకే ట్రైలర్‌లో అసలు మనమేం చెప్పాలనుకుంటున్నామో దాన్ని రివీల్ చేయమని యూనిట్ వాళ్లతో చెప్పాను. ఈ సినిమా ఒక తండ్రి, కూతురుకి మధ్య జరిగే ఎమోషనల్ జర్నీ. అమ్మాయి పుట్టినప్పటి నుండి పెళ్లైయ్యే వరకు సాగే జర్నీయే ఈ చిత్రం. మరో కొత్త బంగారు లోకం వంటి సినిమా అవుతుందని కచ్చితంగా చెప్పగలను. కొత్త బంగారు లోకంకు ఆడియెన్స్ నుండి ఎలాంటి అప్రిసియేషన్ వచ్చిందో ఈ సినిమాకు కూడా అలాంటి అప్రిసియేషనే వస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నాను`` అన్నారు.
బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ - ``సినిమా డిసెంబర్ 16న విడుదలవుతుది. ప్రేక్షకులు సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరుకంటున్నాను`` అన్నారు.
దర్శకుడు భాస్కర్ బండి మాట్లాడుతూ - ``నేను చోటాగారి వద్ద, వినాయక్‌గారి వద్ద వర్క్ చేశాను. వినాయక్‌గారు నా మొదటి గురువు అయితే చోటాగారు నాకు రెండో గురువు. ఈ కథను ముందుగా చోటాగారికి వినిపించాను. వినగానే చోటాగారు సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు థాంక్స్. గోపిగారు కూడా కథ వినగానే సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు ఆయనకు కూడా థాంక్స్. సాయికృష్ణగారు మంచి కథను ఇస్తే, ప్రవీణ్ గారు ఆ కథను అద్భుతంగా మలిచారు. ఈ సినిమాను చేసిన దిల్‌రాజుగారు బొమ్మరిల్లు వంటి సినిమా చేశామని అప్రిసియేట్ చేయడమే కాకుండా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకు రావడం ఆనందంగా ఉంది. డిసెంబర్ 16న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది`` అన్నారు.
ఈ కార్యక్రమంలో సాయికృష్ణ, ప్రవీణ్, అశ్విన్ బాబు, నోయెల్, పార్వతీశం తదితరులు పాల్గొన్నారు.
రావు రమేష్, హెబ్బా పటేల్, తేజస్వి మడివాడ, అశ్విన్, పార్వతీశం, నోయెల్ సేన్, కృష్ణభగవాన్, సనా, తోటపల్లి మధు, ధనరాజ్, షకలక శంకర్, చమ్మక్ చంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి కథః బి.సాయికృష్ణ, పాటలుః చంద్రబోస్, భాస్కరభట్ల, వరికుప్పల యాదగిరి, కాసర్ల శ్యామ్, కొరియోగ్రఫీః విజయ్ ప్రకాష్, స్టంట్స్ః వెంకట్, స్క్రీన్‌ప్లే, మాటలుః బి.ప్రసన్నకుమార్, ఎడిటర్ః చోటా కె.ప్రసాద్, ఆర్ట్ః విఠల్ కోసనం, మ్యూజిక్ః శేఖర్ చంద్ర, సినిమాటోగ్రఫీః చోటా కె.నాయుడు, ప్రొడక్షన్ః లక్కీ మీడియా, నిర్మాతః బెక్కం వేణుగోపాల్(గోపి), దర్శకత్వంః భాస్కర్ బండి.