14 December 2016
Hyderabad
లక్కీ మీడియా బ్యానర్‌పై భాస్కర్ బండి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్`. రావు రమేష్, హెబ్బా పటేల్, తేజస్వి మడివాడ, అశ్విన్, పార్వతీశం, నోయెల్ సేన్ ప్రధాన తారాగణంగా నటించారు. సినిమా డిసెంబర్ 16న విడుదలవుతుంది. ఈ సందర్బంగా స్పెషల్ షోను వీక్షించిన దర్శకుడు వి.వి.వినాయక్ సినిమా గురించిన సంగతులను తెలియజేశారు. బుధవారం పాత్రికేయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో...
వి.వి.వినాయక్ మాట్లాడుతూ - ``బాస్కర్ బండి నా వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాడు. నాకు ఇష్టమైన వ్యక్తి. మంచి హార్డ్ వర్కర్. బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా సినిమా చూపిస్త మావ సినిమా తర్వాత రూపొందుతోన్న ఈ చిత్రానికి దిల్ రాజు వంటి నిర్మాత అండగా నిలవడం చాలా గొప్ప విషయం. దిల్‌రాజు వంటి నిర్మాతలు ఇప్పుడు ఇండస్ట్రీకి ఎంతో అవసరం. ఆయన ఎంతో కొత్త దర్శకులకు అవకాశాలనిస్తారు. దిల్‌రాజుగారితో పాటు సాయికృష్ణ మంచి కథను అందించగా, ప్రసన్నకుమార్ మంచి సంభాషణలు అందించారు. చోటాగారు కూడా భాస్కర్‌పై అభిమానంతో తన సపోర్ట్‌ను కూడా అందించారు. భాస్కర్ తనేం చెప్పాలనుకున్నాడో ఆ విషయాన్ని చాలా ఫోకస్డ్‌గా సినిమాలో చూపించాడు. సినిమా అవుట్‌పుట్ బాగా రావడానికి తనెంత కష్టపడ్డాడో నాకు తెలుసు. తండ్రి, కూతురు మధ్య అనుబంధాన్ని తెలియజేసే చిత్రమిది. సినిమా చివరి ముప్పై నిమిషాలు చాలా బావుందని అందరూ ఫీల్ అవుతారు. నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందరికీ నచ్చే చిత్రమవుతుంది`` అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ - ``నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ సినిమా కథ విన్నప్పటి నుండి సినిమాతో అసోసియేట్ అయ్యాను. సినిమాతో నాకు ముందు నుండి మంచి అనుబంధం ఏర్పడింది. ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఎమోషనల్‌గా సాగే మంచి చిత్రం. సినిమా డిసెంబర్ 16న విడుదలవుతుంది. అందరూ సినిమాను పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
దర్శకుడు భాస్కర్ బండి మాట్లాడుతూ - ``సినిమా రషెష్ చూసి రాజుగారు కొన్ని మార్పులు చెప్పారు. దాని ప్రకారం సినిమా చేంజస్ చేసిన తర్వాత సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. సాయికృష్ణ మంచి కథను అందివ్వగా, చోటా, ప్రసన్నకమార్‌గారు, శేఖర్ చంద్ర సహా అందరూ బాగా సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. డిసెంబర్ 16న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
ఈ కార్యక్రమంలో సాయికృష్ణ, బెక్కంవేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.