21 November 2016
Hyderabad
రెండు సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులు, సినిమా ఇండస్ట్రీ బాగా ఆదరిస్తున్నారు. అందుకే దృశ్యం, భలే భలే మగాడివోయ్, అ..ఆ, గుంటూరుటాకీస్ సహా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించానని అన్నారు. సీనియర్ నరేష్. నిత్యామీనన్ ప్రధాన పాత్రలో క్రిష్ జె. సత్తార్ హీరోగా మలయాళంలో సూపర్‌హిట్ అయిన '22 ఫిమేల్ కొట్టాయం' చిత్రాన్ని మల్కాపురం శివకుమార్ సమర్పణలో సన్‌మూన్ క్రియేషన్స్ పతాకంపై శ్రీప్రియ దర్శకత్వంలో వి.ఆర్. కృష్ణ ఎం. 'ఘటన' పేరుతో నవంబర్ 18న విడుదలైన సంగతి తెలిసిందే. ఘటన సినిమాలో నేను నటించిన సైకిక్ విలన్ పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది అన్నారు నటుడు సీనియర్ నటుడు.
ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ - ``క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నాకు ఎన్.వి.రంగారావుగారంటే ఇన్‌స్పిరేషన్. భారతదేశంలోనే ఆయనలాంటి గొప్ప నటుడెవ్వరూ లేరని నా భావన. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రారంభమైనప్పుడు అన్నీ రకాల క్యారెక్టర్స్‌లో మెప్పించాలనుకున్నాను. ఆ విధంగా చాలా రకాల పాత్రల్లో మెప్పించాను. అయితే విలన్ క్యారెక్టర్ ఏ సినిమాలో చేయలేదనే భావన నా మనసులో ఉండిపోయింది. ఘటన సినిమాతో విలన్‌గా నటించాలనే కోరిక కూడా తీరిపోయింది. సోషల్ మీడియాలో నా పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది. విలన్‌గా చేసిన ఈ పాత్రకు ఇంత మంచి గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉంది. కెరీర్‌పరంగా ఈ పాత్ర నాకో మైల్‌స్టోన్ అనవచ్చు. ఇప్పుడు నేను పూర్తిస్థాయి విలన్ పాత్రలో నటించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చిన్న, పెద్ద సినిమాలనీ కాకుండా మంచి దర్శకుడా, మంచి బ్యానర్‌లో పనిచేస్తున్నానా అని చూసుకుంటున్నాను. శతమానంభవతిలో ఓ కీలక పాత్రలో కనపడబోతున్నాను. ఈ సినిమాలో నా బాడీ లాంగ్వేజ్, నా లాంగ్వేజ్ చాలా కొత్తగా ఉంటుంది. అలాగే రావుగారి అబ్బాయి-రాజుగారి అమ్మాయి చిత్రంలో రావుగారి పాత్రలో నటిస్తున్నాఉ. గుంటూరుటాకీస్2 చిత్రంలోనటిస్తున్నాను. వి.ఆర్.చలన చిత్ర బ్యానర్‌లో రానున్న సినిమాలో మంచి పాత్ర చేస్తున్నాను. అలాగే నా ఏజ్‌కు తగిన విధంగా లీడ్ రోల్ పోషిస్తూ రెండు భాషల్లో ఓ సినిమా చేస్తున్నాను. ఇవీగాక మరో ఐదు సినిమాలు చర్చల దశలోనే ఉన్నాయి. తెపరభాషా నటులను అవసరం మేరకే ప్రోత్సాహించండి. లుగులో ఎంతో ప్రతిభావంతమైన నటీనటులున్నారు. వారిని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.
పవన్‌కల్యాణ్ వంటి ఓ హీరో సామాజిక బాధ్యతతో అనంతపూర్ జిల్లాకు అండగా నిలబడుతున్నప్పుడు అతనికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్తితుల దృష్ట్యా ఓ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్‌ను సరిచేయడానికి ఓ బలమైన ప్రాంతీయ పార్టీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది`` అన్నారు.