| 
             
 
                 | 
                
                  
                    
                      | 
                        
                          
                          
                                                     
                        
                        
                          4 January 2017 
                            Hyderabad 
                          శ్రీ రాజేందర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాజేందర్ స్వీయ దర్శకత్వం లో హీరో గా  వస్తున్న సినిమా నెం.1 హీరో రాజేందర్. రేపు సినిమా విడుదల సందర్బంగా పాత్రికేయులతో సమావేశం ఏర్పాటు చేసారు.. రాజేందర్ మాట్లాడుతూ ..ఈ సినిమా కు స్టోరీ,స్క్రీన్ ప్లే,మ్యూజిక్,దర్శకత్వం వహించాను.ఇంతక ముందు చెన్నై లో సినిమాలు సీరియల్స్ లో నటించాను.ఇప్పుడు నేనే హీరోగా నిర్మాతగా మారి సొంత బ్యానర్ స్థాపించి సినిమా చేశాను.చాల బాగా వచ్చింది రొమాంటిక్ లవ్ స్టోరీ యూత్ కె కాకుండా ఫామిలీ కి కూడా నచ్చేవిధంగా ఉంటుంది నా ఈ ప్రయాణం లో ఎడిటర్ శ్రీనివాస్ గారు ఎంతో సహాయం చేసారు .అలాగే నా తోటి ఆర్టిస్ట్ లు చక్కగా నటించారు.అనుకున్న బడ్జెట్ లో సినిమా తీసి లాభానికే అమ్మాను.మేము అనుకున్నన్నిథియేటర్లు దొరికాయి శుక్రవారం మీ ముందుకు వస్తున్న మమ్మల్ని దీవించండి.అలాగే నా సినిమా పై వచ్చే లాభాలతో అనాధ ఆశ్రయాలను సహాయం చేయాలని ఉంది.ప్రియతమ ముఖ్య మంత్రి చంద్రశేఖర్ గారు  కూడా చేయూతనివ్వాలి కోరుకుంటున్నాను అన్నారు.హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ..నాది ట్రేడిషనల్ భార్య క్యారక్టర్ నాకు అవకాశం ఇచ్చిన రాజేందర్ గారికి థాంక్స్.ఈ సినిమాకు రాజేందర్ ఎంత కష్టపడ్డాడో నాకు తెల్సు ఎవరి సహాయం లేకుండా సినిమా ను విడుదల చేస్తున్నాడు అల్ ది బెస్ట్ అన్నారు ఎడిటర్ శ్రీనివాస్. 
                        
                        
   
   
  
                         | 
                       
                    
                      Photo 
                        Gallery (photos by G Narasaiah)  | 
                     
                    
                       | 
                     
                    | 
                
 | 
                 
               
             
          | 
             
        
        |