24 December 2016
Hyderabad
మాస్ హీరో విశాల్, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మించిన కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఒక్కడొచ్చాడు'. ఈ చిత్రం డిసెంబర్ 23న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ లెవల్‌లో రిలీజైంది. ఈ సందర్భంగా హీరో విశాల్‌తో పాత్రికేయులతో సినిమా గురించి విశేషాలను మాట్లాడారు..
హీరో విశాల్ మాట్లాడుతూ - ``సక్సెస్ రెస్పాన్స్ చాలా బాగా ఉంది. ఒక్కడొచ్చాడులోని మెయిన్ పాయింట్ ఇప్పుడు సోసైటీలో జరుగుతున్న బ్లాక్ మనీ సమస్యకు కనెక్ట్ అయ్యేలా ఉంది. సినిమా చేస్తున్నప్పుడు ఈ సమస్యపై మోడీగారు కూడా బ్లాక్ మనీ సమస్యపై పోరాటం చేస్తారని అనుకోలేదు. తెలుగు, తమిళంలో సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయడం, వరుసగా సెలవులు ఉండటం మాకు ప్లస్ అయ్యింది. నేను ఇలాంటి సినిమాలనే చేయాలనే కథలు ఎంపిక చేసుకోను. కథలు వింటూ ఉంటాను. ఏ కథ నచ్చితే ఆ కథతో ముందుకెళ్లిపోతాను. ఒక్కడొచ్చాడు కథ చేయడానికి ముందు ఐదారు కథలు విన్నాను. ఈ కథ పాయింట్ నాకు బాగా నచ్చింది. సినిమాకు వచ్చే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఓ సినిమా చేయడం అనేది ఓ హీరోకు చాలా ముఖ్యం. అది హీరోకే కాదు, యూనిట్ అందరికీ ఎనర్జీ బూస్టర్‌లా ఉపయోగపడుతుంది. అలాగే ఈ సినిమాలోని మంచి మెసేజ్ ఉండటం కూడా నేను ఈ సినిమా చేయడానికి కారణమని చెప్పాలి. ఇలాంటి కమర్షియల్ ప్యాక్డ్ మూవీని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. వడివేలు, సూరి కామెడికి మంచి స్పందన వస్తుంది. ఒకప్పుడు ఫైట్స్ చేయడానికి బాగా ఇష్టపడేవాడిని, సాంగ్స్ చేయడానికి భయపడేవాడిని. కానీ ఇప్పుడు ముందు డ్యాన్సులు చేయడానికి ఇష్టపడుతున్నాను. తమన్నా మంచి డ్యాన్సర్ కాబట్టి ఆమెతో డ్యాన్స్ చేయడానికి డ్యాన్సుల కోసం బాగా రిహార్సల్ చేశాను. పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. భాగ్యలక్ష్మిగారు చాలా మంచి సాహిత్యాన్ని అందించారు. ఓ లేడీ రైటర్ అయినా అన్నీ రకాల సాంగ్స్‌ను చక్కగా రాశారు. యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. భవిష్యత్‌లో ఆమెతో కలిసి వర్క్ చేస్తాను. అలాగే జగపతిబాబుగారు సినిమాలో చాలా కీలకపాత్రలో నటించారు. జగపతిబాబుగారు తమిళంలో కూడా వరుసగా సినిమాలు చేస్తుండటం వల్ల తమిళ ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితులే. అందువల్ల కీ రోల్ కోసం ఆయన్నే తీసుకొన్నాం. ఆయన రోల్‌కు చాలా మంచి అప్రిసియేషన్ వస్తుంది. తమన్నాది, నాది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కావడంతో వీళ్లిద్దరూ తెరపై ఎలా ఉంటారోనని ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. ఒక హీరో, ప్రొడ్యూసర్ మధ్య మంచి రిలేషన్ ఉండటం అనేది మంచి పరిణామమే. హరితో నా జర్నీ బాగా ఉంది. నా సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా ఉండాలని నేను ఆలోచించుకోవడం ఓకే, కానీ ఓ నిర్మాతగా హరిగారు విశాల్‌ను ఎలా ప్రెజెంట్ చేయాలని ఆలోచిస్తుంటారు. ఒక్కడొచ్చాడు సినిమా విషయంలో ఆయన చాలా కేర్ తీసుకున్నారు. ఆయనతో వర్క్ చేయడం కంఫర్ట్‌గా ఫీలవుతున్నాను.
నెక్ట్స్ నేను చేయబోయేది 23వ సినిమా మిస్కిన్‌గారి దర్శకత్వంలో ఉంటుంది. ఆయన స్టయిల్ లో మంచి కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. తెలుగులో ఇంకా టైటిల్ అనుకోలేదు. 24వ సినిమాగా మిత్రన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాను. ఇప్పటికే సినిమా 40 శాతం పూర్తయ్యింది. సమంత హీరోయిన్. నా 25వ సినిమా `పందెంకోడి2`. త్వరలోనే సెట్స్‌లోకి వెళుతుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 28న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.