pizza
Pichiga Nachav release on 17 March
మార్చి17న అచ్చ తెలుగు స్వ‌చ్చ‌మైన ప్రేమ‌క‌థ `పిచ్చిగా న‌చ్చావ్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

15 March 2017
Hyderaba
d

మార్చి17న అచ్చ తెలుగు స్వ‌చ్చ‌మైన ప్రేమ‌క‌థ `పిచ్చిగా న‌చ్చావ్‌`

సంజీవ్‌, చేతన ఉత్తేజ్‌, నందు, కారుణ్య నటీనటులుగా శ్రీవత్స క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'పిచ్చిగా నచ్చావ్‌'. వి.శశిభూషణ్‌ దర్శకుడు. కమల్‌కుమార్‌ పెండెం నిర్మాత. ఈ సినిమా మార్చి 17న విడుల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...

పుచ్చా రామ‌కృష్ణ మాట్లాడుతూ - ``నిర్మాత క‌మల్‌కుమార్‌గారు, ద‌ర్శ‌కుడు శ‌శిభూష‌ణ్, నేను ఈ సినిమా కోసం ముందు నుండి ట్రావెల్ చేస్తూ వ‌స్తున్నాం. దర్శ‌కుడు శ‌శిభూష‌ణ్ మ‌దిలో వ‌చ్చిన చ‌క్క‌ని ఆలోచ‌నే `పిచ్చిగా న‌చ్చావ్‌`. నిర్మాత క‌మ‌ల్‌గారు సినిమాను ఎక్క‌గా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించారు. సినిమా చూసిన వారంద‌రూ దీన్ని భారీ బ‌డ్జెట్ మూవీ అనుకుంటున్నారు. సినిమా చూసి సురేష్ ప్రొడ‌క్ష‌న్ వంటి సంస్థ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తానని చెప్ప‌డం ఆనందంగా ఉంది. మార్చి 17న సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల అవుతుంది. మా ప్ర‌య‌త్నాన్ని అంద‌రూ ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

నిర్మాత క‌మల్‌కుమార్ పెండెం మాట్లాడుతూ - ``ఈ సినిమా కోసం ఒక సంవ‌త్స‌రంగా టీం అంద‌రూ క‌ల‌సి ఒక ఫ్యామిలీలా ట్రావెల్ అవుతున్నాం. ఎక్క‌డా ఇబ్బందులు లేకుండా సినిమాను అనుకున‌న్ స‌మ‌యంలో పూర్తి చేశాం. మంచి మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్ళాయి. సినిమా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది`` అన్నారు.

ద‌ర్శ‌కుడు వి.శ‌శిభూష‌ణ్ మాట్లాడుతూ - ``క‌థ విన‌గానే నిర్మాత క‌మ‌ల్‌గారు సినిమాను నిర్మించ‌డానికి ముందుకు వ‌చ్చారు. సినిమాను కృష్ణాజిల్లాలో 46 రోజులు పాటు ఏక‌ధాటిగా చిత్రీక‌రించాం. మంచి ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. దాదాపు కొత్త‌వాళ్ళ‌తో చేసిన సినిమా. క‌థ‌లో హీరోయిన్ ఉండ‌దు. క‌థ వ‌ల్ల హీరోయిన్ క్రియేట్ అవుతుంది. ఒక‌రిని న‌మ్మితే వారి కోసం ఎంత దూరం అయినా వెళ‌తాం. 108 థియేట‌ర్స్‌లో సినిమాను రిలీజ్ చేస్తున్నాం. అచ్చ తెలుగు స్వ‌చ్చ‌మైన ప్రేమ‌క‌థ‌. మార్చి 17న సినిమా రిలీజ్ అవుతుంది`` అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved