pizza
Prema Bhiksha press meet
చిత్రీకరణను పూర్తి చేసుకున్న `ప్రేమ‌భిక్ష`
You are at idlebrain.com > News > Functions
Follow Us

23 January 2017
Hyderaba
d

అనిల్‌కుమార్‌, శృతిల‌య హీరో హీరోయిన్లుగా ఓం శ్రీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎం.ఎన్‌.బైరా రెడ్డి, నాగ‌రాజు నిర్మాత‌లుగా ఆర్.కె.గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం `ప్రేమ‌భిక్ష‌`. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా సోమ‌వారం చిత్రయూనిట్ హైద‌రాబాద్‌లో పాత్రికేయుల స‌మావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంద‌ర్భంగా...

న‌టుడు సుమ‌న్ మాట్లాడుతూ - ``ఈ సినిమాలో నేను పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర చేశాను. మ‌నం ఏం చేస్తే, అదే మ‌న కుటుంబానికి మిగులుతుంది. అనే కాన్సెప్ట్‌తో సాగే డిఫ‌రెంట్ పాత్ర చేశాను. ద‌ర్శ‌కుడు గాంధీ సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. హీరో అనిల్‌, హీరోయిన్ శృతిల‌య అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. సినిమా త‌ప్ప‌కుండా మంచి విజ‌యాన్ని సాధిస్తుంద‌ని భావిస్తున్నాను`` అన్నారు.

న‌టుడు జీవా మాట్లాడుతూ - ``ద‌ర్శ‌కుడు క‌థ చెప్ప‌గానే ఎలా చేస్తాడోన‌ని అనుకున్నాను. అలాగే క‌థ విన్న త‌ర్వాత హీరో అనిల్‌కుమార్ చూడ‌గానే ఎలా యాక్ట్ చేస్తాడోన‌ని కూడా అనుకున్నాను. కానీ ద‌ర్శ‌కుడు చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. అలాగే అనిల్ కుమార్‌, శృతిలు ఎంతో మంచి పెర్‌ఫార్మెన్స్ చేశారు. మంచి టీంతో ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది`` అన్నారు.

ద‌ర్శ‌కుడు ఆర్‌.కె.గాంధీ మాట్లాడుతూ - ``క్రూర‌త్వాన్ని ప్రేమ‌తో ఎలా జ‌యించ‌వ‌చ్చున‌ని తెలియ‌జేసే చిత్ర‌మే ఇది. హీరో హీరోయిన్లు, టెక్నిషియ‌న్స్ అంద‌రిసపోర్ట్‌తో సినిమాను అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేశాం. త్వ‌ర‌లోనే ఆడియో విడుద‌ల చేసి సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తాం`` అన్నారు.

నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగరాజ్ మాట్లాడుతూ - ``అనంత‌పురం జిల్లాలో భ‌ద్ర‌ప‌ట్నం అనే గ్రామంలో 1970లో జ‌రిగిన యథార్థ ఘ‌ట‌న‌ను తీసుకుని సినిమాను తెర‌కెక్కించాం. సినిమాను 70 శాతం అనంత‌పురం జిల్లాలో, మిగిలిన భాగాన్ని క‌ర్ణాట‌క‌లోని కొన్ని ప్రాంతాల్లో చిత్రీక‌రించాం. సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. త్వ‌ర‌లోనే ఆడియో, సినిమా విడుద‌ల వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం`` అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ - ``నేను చాలా పాట‌ల‌కు మ్యూజిక్ చేశాను. ఈ సినిమాలోని పాట‌లు క‌థ‌కు అనుగుణంగా సాగుతుంది. నాకు మంచి పేరు తెస్తుంద‌ని భావిస్తున్నాను`` అన్నారు.

హీరో అనిల్‌కుమార్ మాట్లాడుతూ - ``సినిమాలో చాలా మంచి రోల్ చేశాను. ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో చిత్రయూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.
సుమ‌న్‌, ష‌ఫి, జీవా, క‌విత‌, సుమ‌న్‌శెట్టి, రాజేంద్ర‌, గోప‌క‌ర్‌, కిల్ల‌ర్ వెంక‌టేష్‌, జ్యోతి మ‌రురు త‌దిత‌రులు పాల్గొన్న ఈ సినిమాకు కెమెరాః ప్ర‌మోద్‌.ఆర్‌, సంగీతంః ఘంటాడి కృష్ణ‌, సాహిత్యంః రాం పైడి శెట్టి, ఘంటాడి కృష్ణ‌, ఆర్ట్ః బాబు, స్టంట్స్ః శంక‌ర్‌, కొరియోగ్ర‌ఫీః ఎస్‌.ఎస్‌.కె.సందీప్‌, నిర్మాత‌లుఃఎం.ఎన్‌.బైరారెడ్డి, నాగరాజు, క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః ఆర్.కె.గాంధీ.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved